Kavitha( IMAGE CREDIT: TWITTER)
Politics

Kavitha: కవిత ఓటమికి కారణం ఎవరు?.. సొంత పార్టీ నేతలా?

Kavitha: నాది బీఆర్ఎస్ అంటారు.. జాగృతి పేరుతో రాజకీయం చేస్తున్నారు. కేసీఆర్ (KCR)  జపం చేస్తుంటారు.. చుట్టూ దెయ్యాలు ఉన్నాయంటూ వల్లె వేస్తున్నారు. కొన్నాళ్లుగా ఇదే కన్ఫ్యూజన్ బీఆర్ఎస్ క్యాడర్‌ను కమ్మేసింది. అసలు, ఎమ్మెల్సీ కవిత (Kavitha)  పార్టీలో ఉన్నారా లేరా అనే డౌట్‌కు కారణమైంది. ఆమె ఎంత వివరణ ఇచ్చుకున్నా పదేపదే సొంత పార్టీ నేతలను టార్గెట్ చేస్తుండడంతో ఆమె ప్రత్యేక్ రూట్ ఎంచుకున్నారని అర్థం అవుతున్నదన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది. ఇలాంటి సమయంలో తన ఓటమి గురించి కవిత చేసిన వ్యాఖ్యలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి.

 Also ReadSiddharth Kaushal: రాజకీయాల్లోకి సిద్ధార్థ్ కౌశల్.. పార్టీ కూడా ఫిక్స్!

సొంత పార్టీ వాళ్లే ఓడించారట

2019 పార్లమెంట్ ఎన్నికల్లో సొంత పార్టీ వాళ్లే తనను ఓడించారనేది కవిత (Kavitha)  వెర్షన్. గత కొన్నాళ్లుగా ఈ విషయాన్ని వీలు చిక్కినప్పుడల్లా చెబుతూ వస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలోనూ ఈ విషయాన్ని మారోసారి గుర్తు చేశారు. ఎమ్మెల్యేలను పక్కన పెట్టి తానే అన్నీ అనేలా నడుచుకున్న సందర్భంలో ఎమ్మెల్యేలు తిరగబడ్డారని, అందుకే ఎంపీ ఎన్నికల్లో తనకు మద్దతుగా నిలవలేదని అన్నారు. ఎమ్మెల్యేలు తనకు సహకరించలేదని  ( KCR) కేసీఆర్‌కు కాల్ చేసి మాట్లాడితే, మన పార్టీ ఎమ్మెల్యేలు అలా చేయరు అంటూ సముదాయించారని చెప్పారు. తర్వాత ఆయనే రియలేజ్ అయ్యారని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అందరినీ గెలిపించాలని తాను ప్రచారం చేసిన విషయాన్ని గుర్తు చేసిన కవిత (Kavitha)  గెలిచాక వారే తనపై కుట్రలు చేశారని వ్యాఖ్యానించారు.

ఒంటెద్దు పోకడలే కారణమా?

నిజామాబాద్( Nizamabad)  పార్లమెంట్ నుంచి 2014 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన కవిత, ఐదేళ్లు నియోజకవర్గంలో ఏకచక్రాధపత్యం వహించారు. తండ్రి సీఎం కావడంతో నిజామాబాద్ నియోజకవర్గాన్ని తన ఆస్థానంలా ఏలారన్న విమర్శలు ఉన్నాయి. దాని ఫలితంగా ఎమ్మెల్యేల్లో వ్యతిరేకత వచ్చి ఉండొచ్చన్న అభిప్రాయం పార్టీలోనే ఉన్నది. దాని ఫలితమే 2019 ఎన్నికల్లో ఓటమికి కారణమై ఉండొచ్చనే చర్చ ఉన్నది. నిజానికి లోకల్‌గా ఎంపీ కన్నా ఎమ్మెల్యే‌కే పవర్ ఎక్కువ. నిత్యం ప్రజలతో ఉండేందుకు వీలు ఉంటుంది. అలా కాకుండా ఎమ్మెల్యేలను డమ్మీలుగా చేసి కవిత ఒంటెద్దు పోకడలకు పోవడం వల్లే వారిలో వ్యతిరేకత పెరిగి ఉండొచ్చని, దాని ఫలితంగా ఆమె ఓటమికి కారణమై ఉండొచ్చని రాజకీయ పండితులు సైతం చెబుతున్నారు.

రాజకీయ ఉనికి కోసమే తాపత్రయమా?

(Brs) బీఆర్ఎస్‌లోనే ఉన్నానని చెబుతున్న కవిత, (Kavitha)  కొన్నాళ్లుగా అదే పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారు. పైకి ఎవరి పేరు చెప్పకపోయినా, కేసీఆర్ (KCR) చుట్టూ దెయ్యాలు, నన్ను ఓడించారు అంటూ నిందలు వేస్తున్నారు. పైగా, జాగృతి (Jagruthi)  పేరుతో హడావుడి చేస్తున్నారు. జిల్లాలు, మండలాలు, రాష్ట్రాలు, దేశాల వారీగా అధ్యక్షుల నియామకాలు చేస్తున్నారు. గతంలో ఈ స్థాయిలో జాగృతిపై ఫోకస్ చేయని కవిత, (Kavitha)  బీఆర్ఎస్ (BRS)  నేతలను టార్గెట్ చేసుకుని మాట్లాడుతున్న సమయంలోనే ఉనికి కోసం జాగృతి పేరిట రాజకీయం చేస్తున్నారన్న అభిప్రాయం సర్వత్రా వినిపిస్తున్నది.

 Also Read: Ramachandra Rao: పార్టీలో కొత్త పాత పంచాయతీలు లేవు.. రామచందర్‌ రావు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్