YSRCP Wake Up
ఆంధ్రప్రదేశ్

YSRCP: ఎన్నికలైన ఏడాదికి మేల్కొన్న వైసీపీ.. ఇప్పుడెందుకో?

YSRCP: 2024 ఎన్నికలు పూర్తయి ఏడాది గడిచిపోయింది. నాటి నుంచి నేటి వరకూ మొద్దు నిద్రలో ఉన్న వైసీపీ గురవారం నిద్ర లేచిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 2024 ఎన్నికల్లో అనుమానాస్పద పోలింగ్‌పై ఎన్నికల కమిషన్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి (YV Subba Reddy), పార్టీ లోక్‌సభ పక్ష నేత మిథున్ రెడ్డి, మాజీ ఎంపీ బెల్లాన్న చంద్రశేఖర్, పార్టీ నేత లోకేష్ రెడ్డి తదితర నేతల బృందం ఫిర్యాదు చేసింది. కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి 2024 ఎన్నికల్లో చివరి గంటల్లో అకస్మాత్తుగా పోలింగ్ శాతం పెరగడం, అసాధారణంగా ఓటర్లు పెరగడం తదితర అంశాలను ఈసీ దృష్టికి నేతల బృందం తీసుకెళ్లింది. ముఖ్యంగా ఈవీఎంలపై ఉన్న టెక్నికల్ అనుమానాలను వైసీపీ నేతలు నిశితంగా ఈసీకి వివరించారు. ముఖ్యంగా.. హిందూపురంలోని పోలింగ్ బూత్ నెం.150లో జరిగిన అనుమానాస్పద ఓటింగ్‌పై నేతలు వివరణ కోరారు. ఈ సందర్భంగా వైసీపీ నేతలు మీడియా సమావేశం నిర్వహించి వివరాలు వెల్లడించారు.

Read Also- Vallabhaneni: వైఎస్ జగన్‌ను కలిసిన వల్లభనేని.. మంత్రి పదవి ఫిక్స్?

Election commission

Read Also- Viral News: బాలుడిని హోటల్‌కు తీసుకెళ్లి ఇంగ్లిష్ టీచర్ చేసిన పనిది!

విచారణ జరపండి..!
అనంతరం వైవీ సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో ఈవీఎంలకు సంబంధించిన టెక్నికల్ అంశాలు, కొన్ని పోలింగ్ బూత్‌ల్లో చోటుచేసుకున్న అసంబద్ద విషయాలను ఎన్నికల సంఘంకు గతంలో ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. వీటిపై మా సందేహాలకు వివరణ ఇచ్చేందుకు ఎన్నికల సంఘం సమావేశం ఏర్పాటు చేసి, ఆహ్వానించిందన్నారు. ఈ మేరకు సమావేశంలో ఓటర్ లిస్టు పెరుగుదల, ఈవీఎం టెక్నికాలిటీస్, పోలింగ్ సరళి తదితరంశాలపై చర్చలు జరిగాయని.. ఏపీలోని కొన్ని నియోజకవర్గంలో ఈవీఎంల (EVM) ఓట్లకు, వీవీ ప్యాట్‌లతో (VV PAT) పోల్చి చూడాలని కోరినా ఎన్నికల సంఘం స్పందించలేదనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. నిబంధనల ప్రకారం డబ్బులు కట్టినా కూడా మ్యాచింగ్ చేయడానికి కౌంటింగ్ చేయడం లేదనే విషయంపై ఎన్నికల అధికారులను ప్రశ్నించాం. అలాగే ఈవీఎంలలో బ్యాటరీల పైనా సందేహాలు ఉన్నాయి. పోలింగ్ పూర్తయ్యే సరికి బ్యారీల్లో 80 శాత చార్జింగ్ ఉంటే, 40 రోజుల తర్వాత కౌంటింగ్ సమయానికి దాదాపు 98 శాతం చార్జింగ్ ఉన్నట్లు గుర్తించాం. దీనిపైన కూడా విచారణ జరగాలని కోరాం. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4 కోట్ల ఓట్లలో దాదాపు 51 లక్షల ఓట్లు చివరి గంటలో పోలవ్వడం అనేక సందేహాలకు తావిస్తోంది. దీనిపై విచారణ జరపాలని కోరాం. అయితే ఎన్నికల సంఘం అధికారులు మాత్రం వివి ప్యాట్‌ల కంపారిజన్ చేయడం కుదరదని తెగేసి చెప్పారు. సాయంత్రం 6 గంటల తర్వాత పోలింగ్ జరిగిన చోట్ల, ఎక్కువ శాతం పోలింగ్ నమోదైన ఘటనలపై డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే కొన్ని నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. రాయచోటి నియోజకవర్గంను ఉదాహరణగా చూపించడం జరిగింది. దీనికి ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది అని సుబ్బారెడ్డి తెలిపారు.

YSRCP Mets EC

అన్నీ పూసగుచ్చినట్లుగా..
హిందూపురం (Hindupuram) అసెంబ్లీ నియోజకవర్గం పోలింగ్ బూత్ నెంబర్ 157, 28వ పోలింగ్ బూత్‌ల్లో అసెంబ్లీ, పార్లమెంట్ అభ్యర్ధులకు భిన్నమైన పోలింగ్ నమోదైంది. 28వ బూత్‌లో వైసీపీ పార్లమెంట్‌ అభ్యర్ధికి 472 ఓట్లు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి కేవలం 1 ఓటు మాత్రమే వచ్చింది. అలాగే రాష్ట్రంలో నామమాత్రంగా ప్రభావం చూపించే కాంగ్రెస్‌ పార్టీకి చెందిన పార్లమెంట్ అభ్యర్థికి 1 ఓటు వస్తే, అసెంబ్లీ అభ్యర్థికి 464 ఓట్లు వచ్చాయి. అలాగే టీడీపీకి పార్లమెంట్‌ అభ్యర్థికి 8 ఓట్లు వస్తే, అసెంబ్లీకి 95 ఓట్లు వచ్చాయి. ఈ ఓటింగ్ సరళిని గమనిస్తేనే అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీటిపై సమగ్ర దర్యాప్తు జరపాలని కోరడంతో, దీనిపై డేటా తెప్పించుకుని పరిశీలిస్తామని ఈసీ హామీ ఇచ్చింది. ఇటువంటి ఘటనల నేపథ్యంలో ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయని వివరించాం. అందుకే రాబోయే రోజుల్లో జాతీయ స్థాయిలో అన్ని ఎన్నికలు బ్యాలెట్ విధానంలో జరగాలని సూచించాం. అనేక అభివృద్ధి చెందిన దేశాల్లో బ్యాలెట్ విధానం అమల్లో ఉంది. యూఎస్, జర్మన్, యూరోప్‌ దేశాల్లో బ్యాలెట్ ద్వారానే ఎన్నికలు జరుగుతున్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో ఎన్నికలు పారదర్శకంగా జరగాలంటే, బ్యాలెట్ పేపర్‌తో ఎన్నికలు జరగాలనేదే వైసీపీ పార్టీ ఉద్దేశమని ఈసీకి వివరించాం. ఇప్పటికే మాజీ ఎంపి బెల్లాన చంద్రశేఖర్ తన నియోజకవర్గంలో వీవీప్యాట్‌లను లెక్కించాలని కోర్ట్‌లో కేసు వేశారు. కానీ ఎన్నికల అధికారులు మాక్ పోలింగ్ నిర్వహించి చేతులు దులుపుకున్నారు. వీవీ ప్యాట్‌‌లను లెక్కించేది లేదని చెబుతున్నారు. కనీసం సీసీ ఫుటేజీ అడిగినా ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. మా మార్గదర్శకాలు ఇలాగే ఉన్నాయని స్పష్టం చేస్తున్నారు. ఈ అనుమానాలను తొలగించేందుకు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరపాలని కోరాము అని ఈసీ సమావేశంలో జరిగిన విషయాలను వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. చూశారుగా.. ఎన్నికలకైన ఏడాదికి వైసీపీకి ఈ విషయాలన్నీ ఎలా గుర్తొచ్చాయో..!

YV Subbareddy

Read Also- HHVM Trailer: హరిహర వీరమల్లు ట్రైలర్‌‌పై ఓ రేంజిలో ట్రోలింగ్.. ఈ డైలాగ్ ఎవర్ని ఉద్దేశించి పెట్టారో?

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..