Dil Raju and Kiran
ఎంటర్‌టైన్మెంట్

Dil Raju: పైరసీపై కఠిన చర్యలకు ఎఫ్‌డీసీ ముందడుగు.. సినిమాలను పైరసీ చేస్తున్న కిరణ్ అరెస్ట్

Dil Raju: సినీ పరిశ్రమలో పైరసీని అరికట్టేందుకు కఠిన చర్యలు చేపడుతున్నామని, ఇందుకోసం ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు పేర్కొన్నారు. బుధవారం ఎఫ్‌డీసీ ఎండీ సిహెచ్ ప్రియాంకతో కలిసి సమాచార శాఖ ఎఫ్‌డిసి బోర్డు రూమ్‌లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయన పైరసీపై తీవ్రంగా స్పందించారు.

ఈ సందర్బంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే ఉప ముఖ్యమంత్రితో పలు కీలక సమావేశాలు నిర్వహించామన్నారు. సినిమా ఇండస్ట్రీ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సమగ్ర కార్యాచరణను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. అవసరమైతే నూతన నిబంధనల రూపకల్పన కూడా చేస్తామని వెల్లడించారు. ఎఫ్‌డిసి నోడల్ ఏజెన్సీగా, ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైబర్ సెల్, పోలీస్ శాఖల ప్రతినిధులతో కమిటీ ఏర్పాటు చేసి, సినిమా షూటింగ్‌లకు ఆన్‌లైన్ అనుమతుల ప్రాసెస్‌తో పాటు.. వీడియో పైరసీ నియంత్రణకు కూడా కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. సినీ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అందరం కలిసి ఈ రంగాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం ఉందని.. ఈ సందర్భంగా దిల్ రాజు చెప్పుకొచ్చారు.

Also Read- Aamir khan: కుమార్తెగా నటించిన ఫాతిమా సనాషేక్‌‌‌తో రొమాన్స్.. ఆమిర్ ఖాన్ సంచలన వ్యాఖ్యలు

ఎఫ్‌డిసి ఎండీ సిహెచ్. ప్రియాంక మాట్లాడుతూ.. సినిమా జర్నలిస్టుల అక్రిడేషన్ అంశంపై సమీక్ష జరిపి, సాధ్యసాధ్యాలపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇండస్ట్రీలోని సమస్యలను ఎవరైనా తమ దృష్టికి తీసుకువస్తే, వాటి పరిష్కారానికి తప్పకుండా తాము కృషి చేస్తామని ఆమె హామీ ఇచ్చారు.

ఇదిలా ఉండగా.. ‘తమ్ముడు’ ఇంటర్వ్యూలో కూడా దిల్ రాజు ఎఫ్‌డిసి కార్యక్రమాల గురించి చెప్పుకొచ్చారు. ఆయన మాట్లాడుతూ.. ఎఫ్‌డిసి ఆధ్వర్యంలో ఇటీవల గద్దర్ అవార్డ్స్ వేడుకను గ్రాండ్‌గా నిర్వహించాం. నెక్ట్స్ ప్రస్తుతం మన రాష్ట్రంలో ఆగిపోయిన చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్ నిర్వహించాలని అనుకుంటున్నాం. అందుకు సంబంధించిన అంశాలపై కసరత్తు జరుగుతోంది. ఇంకా ఆన్‌లైన్ టికెటింగ్, రన్ ట్రాక్ తీసుకొచ్చే ప్రక్రియ కూడా కొనసాగుతోందని తెలిపారు.

Also Read- Dil Raju: నితిన్‌ను అల్లు అర్జున్‌తో పోల్చానని.. నెగిటివ్‌గా చూడొద్దు

కిరణ్ అరెస్ట్
పైరసీ కేసులో కిరణ్ అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి దర్యాప్తు చేపట్టగా.. కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తోంది. నిందితుడు కిరణ్‌ చేస్తున్న పైరసీతో సినీ ఇండస్ట్రీకి వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లినట్లుగా సమాచారం. పైరసీకి పాల్పడుతున్న ఏపీకి చెందిన అతడిని రెండ్రోజుల క్రితం హైదరాబాద్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఏసీ టెక్నీషియన్‌గా పనిచేస్తోన్న కిరణ్‌, దాదాపు 2019 నుంచి ఇప్పటి వరకు 65 సినిమాలకు పైగా పైరసీ చేసి.. వాటిని పలు సైట్లకు విక్రయించాడని దర్యాప్తులో తేలింది. ఒక్కో సినిమాను ఆయన రూ.40వేల నుంచి రూ.80వేల వరకు విక్రయించేవాడని, కిరణ్‌కు క్రిప్టో కరెన్సీ రూపంలో అతడికి కమీషన్‌ వచ్చేదని పోలీసులు వెల్లడించారు. ‘సింగిల్‌’ సినిమా పైరసీ విషయంలో.. ఫిలింఛాంబర్‌లోని యాంటీ పైరసీ సెల్‌ ప్రతినిధి యర్ర మణీంద్ర బాబు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, కిరణ్‌ను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా దర్యాప్తు కొనసాగుతూనే ఉంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!