Raja Singh vs BJP: తెలంగాణ బీజేపీతో విచిత్ర పరిస్థితులు నెలకొన్నాయి. నేతల పరిస్థితి ఒకవైపు సంతోషం, మరోవైపు దు:ఖం అన్నట్లుగా మారింది. కాషాయ దళపతిగా (Ramchandra Rao) రాంచందర్ రావును ఏకగ్రీవం చేసుకున్నందుకు శ్రేణులు సంతోషంగానే ఉన్నా మరోవైపు రాజాసింగ్ (Raja Singh) పార్టీకి గుడ్ బై చెప్పడంపై నిరాశతో ఉన్నారు. రాజాసింగ్ పార్టీ మారడంతో ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటనే ప్రశ్నలు అటు శ్రేణుల్లో, ఇటు పొలిటికల్ సర్కిల్స్‌లో ఉత్పన్నమవుతున్నాయి. ఈ పరిస్థితికి కారణం ఆయన పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జరగడమే. అయితే, రాజాసింగ్ (Raja Singh) మాత్రం పార్టీ మార్పుపై ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తున్నది. తన భవిష్యత్‌ను ఢిల్లీ నిర్ణయిస్తుందని రాజాసింగ్ (Raja Singh) చెబుతున్నారు.
Also Read: Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
గ్రేటర్‌లో ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్
గ్రేటర్ పరిధిలో (BJP) బీజేపీకి ఉన్న ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అలాంటిది ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి పార్టీకి షాకిచ్చారు. అయితే, అంతే స్థాయిలో పార్టీ కూడా ఆయనకు షాకిచ్చింది. ఆయన తీరు పరాకాష్టకు చేరిందని రాష్ట్ర నాయకత్వం స్పష్టంచేసింది. రాజాసింగ్ (Raja Singh) రాజీనామా ఇష్యూను ఢిల్లీ హైకమాండ్‌కు పంపించినట్లు పార్టీ సైతం పేర్కొంది. దీంతో రాజాసింగ్ (Raja Singh) రాజీనామా అంశం ఢిల్లీకి చేరింది. ఈ తరుణంలో జాతీయ నాయకత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నదోనని ఆసక్తికరంగా మారింది. రాజాసింగ్ ఇష్యూపై పార్టీ నాన్చివేత ధోరణిని వ్యవహరిస్తుందా? లేక నిర్ణయం వెల్లడిస్తుందా? అనేది ఇంట్రెస్టింగ్‌గా మారింది. లేదా పార్టీ నిర్ణయం తీసుకునేలోపే రాజాసింగే అలకమాని కాషాయ పార్టీలో కొనసాగుతారా? అనేది ఆసక్తికరంగా మారింది.
పార్టీ మారుతారని జోరుగా ప్రచారం
గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఆయన శివసేనలో చేరుతారని విస్తృతంగా ప్రచారం జరుగుతుండగా ఆయన మాత్రం దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. తనకు మహారాష్ట్రకు చెందిన హిందుత్వ పార్టీ నుంచి ఆఫర్లు వస్తున్నాయని ధృవీకరించినా బీజేపీ BJP) హైకమాండ్ నిర్ణయం తర్వాత తదుపరి స్టెప్ తీసుకుంటానని స్పష్టంచేశారు. కానీ, కార్యకర్తలు మాత్రం రాజాసింగ్‌కు ఫోన్ చేసి మరీ పార్టీలోనే ఉండాలని కోరుతున్నట్లు తెలుస్తున్నది. రాజీనామాపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. రాజాసింగ్ (Raja Singh) లాంటి వారు అధ్యక్షుడిగా ఉంటే బాగుండేదని పలువురు అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు.
రాజాసింగ్ రాజీనామాతో పార్టీకి నష్టం
గ్రేటర్ పరిధిలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (Maganti Gopinath) మృతితో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ తరుణంలో గోషామహల్ ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పడం పార్టీకి నష్టం కానుందనే చర్చ జరుగుతున్నది. జూబ్లీహిల్స్‌లో గెలిచి కాషాయ పార్టీ రాబోయే భవిష్యత్‌కు లైన్ క్లియర్ చేసుకోవాలని భావిస్తున్న తరుణంలో రాజాసింగ్ (Raja Singh) పార్టీకి గుడ్ బై చెప్పడం మైనస్‌గా మారుతుందనే ప్రచారం జరుగుతున్నది. ఇప్పటికే తెలంగాణలో రాజాసింగ్ (Raja Singh) రాజీనామా నేపథ్యంలో ముంబైలోని థానేలో మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత ఉప ముఖ్యమంత్రి, శివసేన పార్టీ చీఫ్ ఏక్ నాథ్ షిండేతో శివసేన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు సింకారు శివాజీ భేటీ అయినట్లు తెలుస్తున్నది. మరి రాజాసింగ్ బీజేపీ నిర్ణయానికి ఏకీభవిస్తారా? లేక తన దారి తాను చూసుకుంటారా? అనేది చూడాలి.
Also Read: Anchor Swecha Suicide Case: యాంకర్ స్వేచ్ఛ అత్మహత్య.. గత పదేళ్ల వేధింపులపై పోలీసుల ఫోకస్?