Swetcha Effect: ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!
Swetcha Effect(image credit: twitter)
Telangana News

Swetcha Effect: నకిలీలపై ఫోకస్ జిల్లాలకు స్పెషల్ టీమ్స్.. ఆత్మలకు చేయూత పేరుతో స్వేచ్ఛ కథనాలు!

Swetcha Effect: పింఛన్ల (Pension) లబ్ధిదారుల విషయంలో చాలా అవకతవకలు జరుగుతున్నాయని ‘స్వేచ్ఛ’ (Swetcha)  ఆధారాలతో సహా కథనాలను ప్రచురించింది. చనిపోయిన వారి పేరిట జమ అవుతున్న పెన్షన్ల (Pension) వివరాలను లెక్కలతో సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దీనిపై ఫోకస్ పెట్టింది. అనర్హులు, చనిపోయిన వారి పేరిట పక్కదారి పడుతున్న (Pension) పింఛన్లపై ఫిర్యాదులు కూడా రావడంతో సెర్ప్ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి జిల్లాకు స్పెషల్ టీమ్స్ పంపనున్నట్లు సమాచారం. పింఛన్లు (Pension)( పొందుతున్న లబ్ధిదారులు కేవైసీ ఆధారంగా నకిలీల ఏరివేత కార్యక్రమం చేపట్టనున్నట్లు తెలిసింది. బ్యాంకుల వారీగా వివరాలు సేకరించి నిజమైన అర్హులకు పింఛన్లు (Pension) అందేలా పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం.

అక్రమ పింఛన్లకు చెక్

రాష్ట్రంలో అక్రమ పింఛన్ల (Pension) ఏరివేతకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతున్నది. చనిపోయిన వారిపేరున వారి ఖాతాల్లో జమచేసి పింఛన్లు కాజేస్తున్నారని, అనర్హులు తీసుకొంటున్నారని ఫిర్యాదులు (Government)  ప్రభుత్వానికి వచ్చాయి. అదే విధంగా ప్రభుత్వరంగ సంస్థల ఉద్యోగుల కుటుంబ సభ్యులు పింఛన్లు పొందుతున్నారని, అక్రమంగా సదరం సర్టిఫికెట్​ పొంది తీసుకొంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. వీటిపైనా ‘స్వేచ్ఛ’ కథనాలు ప్రచురించింది. రాష్ట్రంలో 42,08,129 మంది పింఛన్​ దారులున్నారు.

ఇందులో ఎక్కువగా 14,95,320 మంది వృద్ధులు, 15,09.793 మంది వితంతువులు పింఛన్లు (Pension) తీసుకుంటున్నారు. ఇప్పుడు వీరిలో అనర్హులను గుర్తించి తొలగించేందుకు స్పెషల్​ బృందాలు రంగంలోకి దిగనున్నాయి. సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ (సెర్ప్​) ఆధ్వర్యంలో క్షేత్రస్థాయి పరిశీలన చేయనున్నారు. ప్రతి జిల్లాలో నాలుగైదు స్పెషల్ బృందాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో నేరుగా లబ్ధిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి, వారి గుర్తింపు వివరాలు, జీవన స్థితిని తనిఖీ చేయనున్నారు. పింఛన్ లబ్ధిదారుల వివరాలను సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.

 Also Read: Anchor Swecha Suicide Case: యాంకర్ స్వేచ్ఛ అత్మహత్య.. గత పదేళ్ల వేధింపులపై పోలీసుల ఫోకస్?

సెర్ప్ టీమ్స్ ఏం చేస్తారంటే?

సెర్ప్ టీమ్స్ గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని పింఛన్ (Pension) లబ్ధిదారుల ఆధార్, బ్యాంకు ఖాతాలు, ఇతర గుర్తింపు పత్రాలను తనిఖీ చేస్తారు. గ్రామాల వారీగా సర్వే చేసి అనర్హుల జాబితాను రూపొందిస్తారు. ప్రత్యేక లాగిన్​ ద్వారా అనర్హుల పేర్లను ఆన్​లైన్​ చేస్తారు. ఎంపీడీవోలు, అక్కడి నుంచి డీఆర్డీవోలు, సెర్ప్​ అధికారులు, కలెక్టర్లు, డైరెక్టరుకు పంపిస్తారు. తనిఖీ సమయంలో ఇంటి దగ్గర అందుబాటులో లేనివారు, వలస వెళ్లిన వారి విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రభుత్వ (Government)  ఆదేశాల మేరకు ముందుకెళ్లనున్నారు. ఈ ప్రక్రియతో ప్రభుత్వ (Government)  నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట వేయనున్నారు.

గతంలో ఇష్టారాజ్యంగా పింఛన్లు

రాష్ట్రంలో ఎక్కువ శాతం ఫించన్లు (Pension) బ్యాంకు ఖాతాల్లో పడుతున్నాయి. మరికొన్ని బయోమెట్రిక్​, పోస్ట్ ఆఫీస్​ల ద్వారా ఇప్పటికీ అందజేస్తున్నారు. బ్యాంకు ఖాతాలో పింఛన్​ డబ్బులు జమ అవుతుండడంతో ఆ వ్యక్తి బతికి ఉన్నాడా లేక మృతి చెందాడా అనేది నిర్ధారించుకోవడం కష్టమవుతున్నది. ఏటీఎం కార్డు ద్వారా డబ్బులు డ్రా చేసే వెసులుబాటు ఉండడంతో అనర్హులను గుర్తించడం ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. అయితే, గతంలో రాజకీయ పైరవీలతో ఇష్టారాజ్యంగా పింఛన్లు మంజూరు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. అనర్హులు పింఛన్‌ అందుకుంటున్నారని ఫిర్యాదులు అందినా పట్టించుకోలేదనే విమర్శలు ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం అనర్హులకు అందకుండా పకడ్బందీ చర్యలకు సిద్ధమైంది.

కీలకంగా కేవైసీ

అక్రమ పింఛన్లను (Pension) నియంత్రించేందుకు బ్యాంకుల్లో ప్రతి ఏటా కేవైసీ (నో యువర్​ కస్టర్​) దరఖాస్తు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం (Government) సూచించింది. పింఛన్ లబ్ధిదారులు తమ గుర్తింపు పత్రాలు (ఆధార్, ఫొటో, బ్యాంకు ఖాతా వివరాలు) జీవన ధ్రువీకరణ పత్రాలను బ్యాంకులకు సమర్పించాల్సి ఉంటుంది. దీంతో లబ్ధిదారుడు బతికి ఉన్నారని నిర్ధారించడం, డూప్లికేట్ ఖాతాలను నిరోధించడం జరుగుతుంది. బ్యాంకు ఖాతాలతో ఆధార్ లింకేజ్ ద్వారా పారదర్శకతను పెంచే అవకాశం ఉంది. ఒకవేళ లబ్ధిదారుడు కేవైసీ సమర్పించకపోతే పింఛన్ (Pension) తాత్కాలికంగా నిలిపివేయనున్నారు. కేవైసీ (KYC)  ధ్రువీకరణతో పింఛన్ పథకంలో పారదర్శకత పెరిగిందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.

 Also Read:CM Revanth Reddy: పేదల వైద్యం కోసం ఏడాదిన్నరలో రూ.1400 కోట్లు! 

Just In

01

Vichitra Movie: తల్లీ కూతుళ్ల సెంటిమెంట్‌‌తో విడుదలకు సిద్ధమవుతున్న ‘విచిత్ర’..

Chain Snatching: బిగ్ బ్రేకింగ్ న్యూస్.. కోనాపూర్ శివారులో చైన్ స్నాచింగ్ కలకలం

Nepal: ప్రయాణికులకు శుభవార్త.. ఆర్‌బీఐ నిబంధనల మార్పుతో రూ.100కు పైబడిన భారత కరెన్సీ నోట్లు నేపాల్‌లో అనుమతి

Priyanka Gandhi: ఉపాధి హామీ పథకం పేరు మార్పు పై ప్రియాంక గాంధీ ఫైర్!

Premante OTT Release: ప్రియదర్శి ‘ప్రేమంటే’ ఓటీటీ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?