Sigachi Pharma Incident( image credit: swetcha reporter)
తెలంగాణ

Sigachi Pharma Incident: సిగాచి ఘటనపై నిపుణుల కమిటీ.. ఘటనా స్థలానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్!

Sigachi Pharma Incident: పాశమైలారం ప్రమాదంపై ప్రభుత్వం ఎక్స్ పర్ట్ కమిటీని నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి దాన కిషోర్  (Dana Kishore) ఉత్తర్వులు జారీ చేశారు. సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు (Patancheru, Sangareddy District) మండలంలో జూన్ 30న జరిగిన ఘటనపై ఈ కమిటీ పూర్తి స్థాయిలో స్టడీ చేయనున్నది. ప్రతీ అంశాన్ని ఇన్వెస్టిగేషన్ నిర్వహించి ప్రభుత్వానికి డీటెయిల్డ్ రిపోర్ట్ ఇవ్వనున్నది.

ఈ ఎక్స్‌పర్ట్ కమిటీకి చైర్మన్‌గా సీఎస్ ఐఆర్, ఐఐసీటీ సైంటిస్ట్ డాక్టర్ వెంకటేశ్వర్ రావు (Dr. Venkateswara Rao) వ్యవహరించనుండగా, డాక్టర్ ప్రతాప్ కుమార్, డాక్టర్ సూర్యానారాయణ, (Dr. Suryanarayana) డాక్టర్ సంతోశ్ గూగేలు మెంబర్లుగా పనిచేయనున్నారు. ప్రమాద సమయంలో 143 మంది ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించిన డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఇప్పటి వరకు 40 మందికి పైగా చనిపోయినట్లు అంచనా వేశారు. చాలా మంది తీవ్రమైన గాయాలు పాలయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తి చేసి కమిటీ ఏర్పాటుకు ఆదేశాలు ఇచ్చారు.

సిగాచి ఇండస్ట్రీస్‌పై పూర్తి స్థాయిలో స్టడీ
ఈ కమిటీ సిగాచి ఇండస్ట్రీస్‌పై పూర్తి స్థాయిలో స్టడీ చేయనున్నది. స్టాండర్డ్ ఆపరేషన్ ప్రోసీడర్స్ ఫాలో అయ్యారా? రెగ్యులర్‌గా ఇన్పెక్షన్లు జరుగుతున్నాయా? సెప్టీ మెజర్స్ ఏమున్నాయి? లోపం ఎక్కడ జరిగింది? మెడికల్ అండ్ ఇండస్ట్రీయల్ ప్రాసెస్‌లో వైలేషన్స్ ఉన్నాయా? సంస్థ బాధ్యతాయుతంగా వ్యవహరించిందా? ప్రమాద సమయంలో సంస్థకు సంబంధం లేని వాళ్లు లోపల ఉన్నారా? తదితర అంశాలపై కమిటీ అధ్యయనం చేసి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వనున్నది. భవిష్యత్‌లో సర్కార్ ఎలాంటి యాక్షన్ ప్లాన్ తీసుకోవాలనే దానిపై కూడా ఈ కమిటీ కొన్ని అంశాలను ప్రతిపాదించనున్నది.

Also Read: Harish Rao: అసెంబ్లీలో బనకచర్లపై చర్చకు సిద్ధం.. మాజీ మంత్రి సంచలన కామెంట్స్!

ఘటనా స్థలానికి ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ మీనాక్షి 

సిగాచి ఫార్మా కంపెనీ దగ్గర సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్, (Meenakshi Natarajan) టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, (Mahesh Kumar Goud) మంత్రి దామోదర్ రాజనర్సింహ (Damodar Rajanarsimha) ఘటనా స్థలానికి పరిశీలించారు. ఫ్యాక్టరీ వద్ద జరుగుతున్న సహాయక చర్యలను డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బాధితుల బంధువులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా కల్పించారు. అయితే, వర్షం కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతున్నది. అయినప్పటికీ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

బాధితులను ఆదుకుంటాం

ఆసుపత్రిలో గాయపడ్డవారిని మీనాక్షి పరామర్శించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ప్రభుత్వం ఇప్పటికే చెల్లించిందని, కంపెనీ నుంచి కూడా బాధితులకు నష్టపరిహారం అందజేసేలా చూస్తామని తెలిపారు. ఘటనా ప్రాంతం చాలా భయానకంగా ఉందన్నారు.

స్పందించిన సిగాచి కంపెనీ

మృతుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం ఇస్తామని సిగాచి కంపెనీ ప్రకటించింది. గాయపడిన వారికి వైద్య సాయంతో పాటు పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. 3 నెలలపాటు ప్లాంట్ మూసివేస్తున్నట్టు స్పష్టం చేసింది. సిగాచి తరఫున కంపెనీ సెక్రెటరీ వివేక్ ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ నివేదిక కోసం ఎదురు చూస్తున్నామని, ఘటనకు రియాక్టర్ పేలుడు కారణం కాదన్నారు. మరోవైపు, సిగాచి చైర్మన్ చిదంబర్ నాయర్ (Chidambar Nair) స్పందిస్తూ, 35 ఏండ్లుగా తాము కంపెనీ నడుపుతున్నట్టు చెప్పారు. అప్పటి నుంచి ఎటువంటి ప్రమాదం జరగలేదన్నారు. పదేండ్ల క్రితం కంపెనీని ఎలాంగో గౌడకు లీజుకు ఇచ్చామని చెప్పారు. దాని బాధ్యతలను అతడే చూసుకుంటున్నాడని వివరించారు. ఈ ఘటనలో అతను కూడా చనిపోయినట్టు చెప్పారు.

Also Read: Phone Tapping: షాద్‌ నగర్‌ చుట్టూ ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం!

Just In

01

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?