Phone Tapping: రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం (Ranga Reddy) రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ (Shadnagar) నియోజకవర్గంలోనూ హాట్ టాపిక్‌గా మారింది. (Ranga Reddy) రంగారెడ్డి జిల్లాలో ఎక్కడా వినిపించని ట్యాపింగ్ ప్రచారం, షాద్‌నగర్ (Shadnagar) చుట్టూనే జరుగుతుండడం చర్చనీయాంశమవుతున్నది. నియోజకవర్గంలో ఎదురు లేకుండా చేసుకునేందుకు గత ప్రభుత్వంలో స్థానిక ఓ యువ నేత విచ్చలవిడిగా ఈ దుశ్చర్యకు పాల్పడినట్లుగా ప్రచారం జరుగుతున్నది. చోటామోటా నేతలు, వ్యాపారస్తులు, రియల్టర్లకు సంబంధించిన ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగినట్లు తెలుస్తుండగా, సొంత ప్రయోజనాల కోసం కూడా ట్యాపింగ్‌ను వాడినట్లు తెలుస్తున్నది. ఆ యువనేత ట్యాపింగ్ వ్యవహారాన్ని త్వరలోనే బయటపెడతానని స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మీడియా సమావేశంలో ఇటీవల పేర్కొనడంతో ఎవరా ఆ యువనేత! అన్న చర్చ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Also Read: CM Revanth Reddy: 9 నుంచి 12 తరగతుల విధానంపై అధ్యయనం!
గచ్చిబౌలి కేంద్రంగా ట్యాపింగ్!
ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) ఎస్ఐబీ కార్యాలయం వేదికగా జరగగా, ఇతర ప్రైవేట్ ప్రదేశాల్లోనూ ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) వ్యవహారాన్ని నడిపించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో షాద్‌నగర్ (Shadnagar) నియోజకవర్గానికి సంబంధించి గచ్చిబౌలి కేంద్రంగా ట్యాపింగ్ జరిగినట్లుగా స్థానికంగా ప్రచారం జరుగుతున్నది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నియోజకవర్గ, మండల స్థాయి నేతలకు సంబంధించిన ఫోన్లు ట్యాపింగ్ (Phone Tapping) అయ్యాయంటూ సిట్ నుంచి నోటీసులు అందుకున్న పలువురు నేతలు ఇప్పటికే జూబ్లిహిల్స్ పీఎస్‌కు వెళ్లి వాంగ్మూలం ఇచ్చి వచ్చారు.
నేతలే ఆశ్చర్యం
తమ ఫోన్లను ట్యాపింగ్ (Phone Tapping) చేయడమేమిటని, సదరు బాధిత నేతలే ఒకింత ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే, వ్యాపారస్తులు, రియల్టర్ల ఫోన్లను కూడా ట్యాపింగ్ (Phone Tapping) చేసినట్లుగా ప్రచారం జరుగుతుండగా, ఎవరూ బయటకు చెప్పడం లేదు. రాజకీయంగా లబ్ధి పొందడంతోపాటు బ్లాక్ మెయిలింగ్ చేసి వసూళ్లకు సైతం పాల్పడినట్లుగా పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ఎదురు లేకుండా చేసుకునేందుకే సదరు యువనేత ట్యాపింగ్ వ్యవహారాన్ని వాడుకున్నట్లుగా విమర్శలు సైతం వినిపిస్తున్నాయి.
గత ప్రభుత్వంలో ప్రతిపక్షంలో కీలక నేతగా ఉన్న ప్రస్తుత ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్‌కు (MLA Veerlapalli Shankar) సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ (Phone Tapping) జరిగినట్లు ఇప్పటివరకు ఎక్కడా ప్రస్తావనకు రాలేదు. కానీ, నేతల ట్యాపింగ్ వ్యవహారంపై ఎమ్మెల్యే మాత్రం గుర్రుగానే ఉన్నారు. మీడియాతో మాట్లాడిన పలు సందర్భాల్లో సదరు యువనేత ట్యాపింగ్ వ్యవహారాన్ని బయట పెడతానంటూ ఎమ్మెల్యే చెబుతూ వస్తున్నారు. ట్యాపింగ్ ఎవరి కోసం, ఎందుకోసం, ఎవరి స్వప్రయోజనాల కోసం చేశారు, తదితర విషయాలన్నీ త్వరలోనే అవన్నీ బయటకు వస్తాయని స్థానికులు చర్చించుకుంటున్నారు.
నిస్తేజంలో బీఆర్‌ఎస్ క్యాడర్
ఇప్పటికే ఓటమిపాలై ఇబ్బందుల్లో ఉన్న బీఆర్‌ఎస్ క్యాడర్ ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో మరింత నిస్తేజంలో ఉన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నాటికి ఏం జరుగుందో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న నేతలు ఏదో ఒక కేసులో ఇరుక్కుంటే తమ పరిస్థితి ఏంటని పార్టీ శ్రేణులు ఆవేదన చెందుతున్నారు. ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో మరికొంత కాలం వేచి చూద్దామనే తీరులో కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తున్నది.
Also Read: Infosys: టాయిలెట్‌కు వెళ్లిన యువతి.. నిమిషాల్లోనే అరుపులు.. ఫోన్ చెక్ చేయగా?