Government Jobs: త్వరలో వరుసగా ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రానున్నాయి. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఆలస్యమైన జాబ్ క్యాలెండర్, ఇక నుంచి స్పీడప్ కానున్నది. కోర్టులో పెండింగ్‌లో ఉన్న (Group 1, 2) గ్రూప్ 1, 2, కేసులను కూడా త్వరగా క్లియర్ చేయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోనున్నది. సంక్షేమ పథకాల్లో ఉద్యమకారులకు ప్రయారిటీ ఇవ్వనున్నారు. అంతేగాకుండా త్వరలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీజేఎస్‌కు కొన్ని సీట్లు ఇవ్వాలనే ప్రపోజల్ సీఎంకు ఇచ్చారు. సానుకూలంగా స్పందించిన సీఎం పార్టీ పెద్దలను కూడా కలవాలని (TJS) టీజేఎస్‌కు సూచించారు.
Also Read: AM Rathnam: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ విడుదల వేళ.. అభిమానులకు నిర్మాత విన్నపం!
ఎప్పుడూ సిద్ధం
ఇవే అంశాలపై టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ఫ్రోఫెసర్ కోదండరాం నేతృత్వంలో ప్రత్యేక బృందం సీఎం (Revanth Reddy) రేవంత్ రెడ్డిని కలిశారు. ప్రజా సమస్యలు, రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఉద్యమకారులు, నిరుద్యోగులు, రైతుల (farmers) సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. ప్రజా సమస్యల పరిష్కారానికి జన సమితి సూచనలను స్వీకరించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని సీఎం స్పష్టం చేసినట్లు టీజేఎస్ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా పలు ప్రజా సమస్యలపై రేవంత్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సమావేశంలో తెలంగాణ జన సమితి నేతలు అర్జున్, బద్రుద్దీన్, శ్రీనివాస్, శంకర్ రావు, రమేష్ ముదిరాజ్, ఆశప్ప, సలీం, వినయ్ తదితరులు పాల్గొన్నారు.
Also Read: Banakacharla Project: బనకచర్లపై పార్టీల కుస్తీ.. క్రెడిట్ కోసం తాపత్రయం