Illegal Assets Cases: 31 కేసులు కోట్లలో అక్రమాస్తుల గుర్తింపు!
Illegal Assets Cases( image credit: twitter)
Telangana News

Illegal Assets Cases: గత నెలలో 31 కేసులు కోట్లలో అక్రమాస్తుల గుర్తింపు!

Illegal Assets Cases: ఆమ్యామ్యాలకు అలవాటుపడిన అధికారుల గుండెల్లో ఏసీబీ ( ACB) దడ పుట్టిస్తుంది. గత ఒక్క నెలలోనే ఏసీబీ 31 కేసులు నమోదు చేసింది, ఇందులో 15 ట్రాప్‌లు ఉన్నాయి. నమోదైన రెండు అక్రమాస్తుల కేసుల్లో వరుసగా రూ. 13.50 లక్షలు, రూ. 5.22 కోట్ల విలువైన ఆస్తులకు సంబంధించిన పత్రాలను అవినీతి నిరోధక అధికారులు సీజ్ చేశారు. ఈ కేసుల్లో మొత్తం 25 మంది అధికారులను అరెస్ట్ చేశారు, వీరిలో ఇద్దరు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇటీవల ఆర్‌టీఏ చెక్‌పోస్టులపై జరిపిన దాడుల్లో రూ. 2.72 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.

 Also Read: Savita Pradhan: 16 ఏళ్లకే పెళ్లి.. అత్తింటి వేధింపులు.. కట్ చేస్తే గొప్ప ఐఏఎస్ ఆఫీసర్..!

ఆరు నెలల్లో రికార్డు స్థాయి కేసులు..
గడిచిన ఆరు నెలల్లో ( ACB) ఏసీబీ 126 కేసులు నమోదు చేసి రికార్డు సృష్టించింది. ఈ కేసుల్లో 8 మంది ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులతో సహా 117 మంది ప్రభుత్వ అధికారులను అరెస్ట్ చేసింది. లంచం తీసుకుంటున్న వేర్వేరు శాఖల అధికారులను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని రూ. 24.57 లక్షల నగదును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, రూ. 27.66 కోట్ల విలువైన అక్రమాస్తులను గుర్తించారు.

ఫిర్యాదుల కోసం ఏసీబీ హెల్ప్‌లైన్..
అధికారికంగా సహాయం చేయడానికి ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే, 1064 నెంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని ఏసీబీ డీజీ విజయ్ కుమార్ (Vijay Kumar) సూచించారు. దాంతోపాటు 9440446106 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా వివరాలు తెలియజేయవచ్చని పేర్కొన్నారు.

 Also Read: Banakacherla Project: బనకచర్ల ప్రతిపాదనలు మొదలుపెట్టిందే బీఆర్ఎస్!

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క