Mahesh Kumar Goud: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) సభను విజయవంతం చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) పిలుపునిచ్చారు. ఈ నెల 4న (Hyderabad) హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో జాతీయ అధ్యక్షుడి అధ్యక్షతన కాంగ్రెస్ కీలకమైన సభను నిర్వహించబోతుందని, దీనికి అత్యధిక మంది హాజరు కావాలని ఆయన సూచించారు. (Gandhi Bhavan) గాంధీభవన్‌లో రంగారెడ్డి జిల్లా చేవెళ్ల, మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గ సమావేశాలు నిర్వహించారు. గ్రామ శాఖ అధ్యక్షులతో ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge) మాట్లాడటం చాలా ముఖ్యమైన అంశమని మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) వివరించారు.
Also Read: NTCA Study: మహారాష్ట్ర నుంచి తెలంగాణకు పులుల సంచారం
ఇది పార్టీ చరిత్రలో ఒక గొప్ప సమావేశం అని, అందరూ విధిగా సమావేశాన్ని విజయవంతం చేయాలని కోరారు. అంతేకాకుండా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge చెప్పే సందేశాన్ని ప్రజలకు చేరవేయాలన్నారు. ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ కార్యక్రమాలు కూడా తెలంగాణలో అన్ని గ్రామాలలో జరిగాయన్నారు. ఏఐసీసీ నాయకులు తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కార్యక్రమాల పట్ల చాలా ఆసక్తిగా ఉన్నారని, అందుకే మరింత కష్టపడి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు. తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) కార్యక్రమాలను మోడల్‌గా తీసుకుని దేశవ్యాప్తంగా నిర్వహించాలని ఏఐసీసీ (AICC) చూస్తుందని వెల్లడించారు. సంస్థాగత నిర్మాణం అద్భుతంగా నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
Also Read: Employees: సమస్యలపై ప్రశ్నించినోళ్ల ఇక్రిమెంట్లు కట్!