Balkampet Yellamma Kalyanam( IMAGE CXREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ

Balkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం!

Balkampet Yellamma Kalyanam: కొలిచే వారి కొంగు బంగారం శ్రీ బల్కంపేట ఎల్లమ్మ కల్యాణం (Balkampet Yellamma Kalyanam) అంగరంగ వైభవంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగింది. దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్ల మధ్య అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కల్యాణ మహోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, (Ponnam Prabhakar) దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ (Konda Surekha) అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆ తర్వాత దేవాలయం ఆరు బయట ఏర్పాటు చేసిన వేదికపై నిర్వహించిన కల్యాణాన్ని తిలకించారు. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు వచ్చారు. దేవాదాయ శాఖ అధికారులు ఆలయ మర్యాదలతో గౌరవ స్వాగతం పలికారు. భక్తులు, ప్రజలకు ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా మెరుగైన వవతులు కల్పించారు.

 Also Read: Law Student: లా విద్యార్థినిపై అఘాయిత్యానికి ముందు ఏం జరిగిందో బయటకొచ్చింది!

గత సంవత్సరం కల్యాణోత్సవంలో చోటుచేసుకున్న పొరాపట్లను దృష్టిలో పెట్టుకుని నిర్వాహకులు ఈసారి మరింత పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా ఏర్పాట్లపై జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్,  (Ponnam Prabhakar) మంత్రి కొండా సురేఖతో (Konda Surekha) పాటు దేవాదాయ శాఖ కార్యదర్శి శైలజ రామయ్యర్ (Sailaja Ramayyar) కూడా తరుచూ సమీక్షలు నిర్వహించి, సూచనలు, సలహాలివ్వడంతో ఈసారి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు ఘనంగ చేశారు. తాగునీరు, విద్యుత్ నిరంతరాయంగా ఏర్పాటు చేపట్టారు.

భక్తులు ఎక్కడా కూడా ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రతి ఒక్కరు అమ్మవారి కల్యాణం తిలకించేలా, దర్శనం కలిగేలా చూశారు. కల్యాణం తదుపరి కూడా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. గర్భగుడిలోని అమ్మవారిని దర్శించుకునేందుకు నిర్వాహకులు ప్రత్యేకంగా బ్యారికేడ్లను ఏర్పాటు చేశారు. దీంతో బల్కంపేట పరిసర ప్రాంతాల్లో ఆధ్యాత్మికత వెల్లువిరిసింది. ఈ కల్యాణ మహోత్సవంలో రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, శాసనసభ్యులు దానం నాగేందర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, మల్లారెడ్డి, సమాచార శాఖ కమిషనర్ సీహెచ్ ప్రియాంక, జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్, (Karnan) హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, (CV Anand) జిల్లా కలెక్టర్ హరి చందన దాసరి, అదనపు పోలీస్ కమిషనర్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

 Also Read: MHSRB Releases Notifications: స్పీచ్ పాథాలజిస్ట్ డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?