NTCA Study: పులుల ఆవాస యోగ్యంగాఅటవీ ప్రాంతాలు ఉన్నాయా? అసలు పులులు ఎన్ని ఉన్నాయి. ప్రాంతంలో అయితే అవి స్థిరంగా ఉంటాయి ఆ ప్రాంతాలను త్వరలోనే నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ(NTCA) బృందం అధ్యయనం చేయనుంది. కవ్వాల్ లోకి పులులను తీసుకురావాలన్న లక్ష్యంతో ఆటవీశాఖ(Forest Department) అధికారులు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మహారాష్ట్ర(Mharasta) నుంచి పులులు వస్తుండటంతో కవ్వాల్ లో రీ లోకేషన్ చేయాలని భావిస్తున్నారు. పులులను తీసుకెళ్లడానికి మహారాష్ట్ర ప్ఱభుత్వం కూడా అనుమతి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.
స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు
మహారాష్ట్రలో పులుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో తడోబా, తిపేశ్వర్, కడంబా వంటి రిజర్వ్ ఫారెస్ట్‌ల నుంచి పులులు తెలంగాణ(Telangana)లోని కవ్వాల్, ఆసిఫాబాద్ఫారెస్ట్కు వలస వస్తున్నాయి. మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామ సమీపంలో కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. ఈ కవ్వాల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ వరకు పెద్ద పులులు వచ్చి వెళ్తున్నాయి. కానీ, స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం లేదని అధికారుల అధ్యయనంలో వెల్లడైంది. అవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకునేలా ప్రణాళికలు రూపకల్పనకు తెలంగాణ అటవీశాఖ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించింది. కవ్వాల్ రిజర్వ్ ఫారెస్ట్(kawal Reserve Forest)లో పులుల సంరక్షణతోపాటు వాటి సంతత్తిని వృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటుంది.
మహారాష్ట్రలోని తాడోబా అంధారి టైగర్ రిజర్వ్ (TATRT) నుంచి పులులను తీసుకొచ్చేందుకు కసరత్తు చేస్తున్నది. కవ్వాల్ అటవీ ప్రాంతానికి పులులను తీసుకురావడమే ధ్యేయంగా చేపట్టిన ‘ప్రాజెక్ట్ టైగర్'(Project Tiger) ప్రతిపాదనను మహారాష్ట్ర సర్కార్‌నుంచి సానుకూల స్పందన లభించినట్లు ఫారెస్టు అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టుపై త్వరలో నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ (NTCA) బృందం కవ్వాల్లో పర్యటించనున్నట్లు సమాచారం. కవ్వాల్ రిజర్వ్‌ఫారెస్ట్ లో పులుల సంచారానికి అనుకూలతలు, ఆహారం, ఆవాస సామర్థ్యం, నీటి వసతి, పర్యావరణం, జన్యురీత్యా ఏర్పడే ప్రభావాలు తదితర అంశాలపై పరిశీలించనున్నట్లు తెలిసింది. ఎన్టీసీఏ ఇచ్చే నివేదిక ఆధారంగా పులులను ఇక్కడికి రీలోకేషన్ చేయనున్నట్లు అధికారులు తెలిపారు.
Also Read: Gadwal News: కొడుకులు అన్నం పెట్టడం లేదని కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన తల్లి
మహారాష్ట్ర తాడోబా నుంచి పులులు
గోదావరి నది పరీవాహక ప్రాంతంలో కవ్వాల్ అభయారణ్యం 892.23 చదరపు కిలోమీటర్ల కోర్ ఏరియా, 1,123.21 చదరపు కిలోమీటర్ల బఫర్ ఏరియాతో కలిపి మొత్తం 2,015.44 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉందని అధికారులు తెలిపారు. కవ్వాల్లో పులుల ఆహారానికి జింకలు, సాంబార్, నీల్గాయి వంటి వన్యప్రాణులు ఉన్నాయి. కాగా, పొరుగున ఉన్న మహారాష్ట్ర తాడోబా నుంచి పులులు వస్తున్నాయి. మళ్లీ తిరిగి మహారాష్ట్రకు వెళ్తున్నాయి. తాడోబా టైగర్ రిజర్వ్‌లో 40 నుంచి 50 వరకు, ఇంద్రావతి నేషనల్ పార్కు(ndravati National Park)లో 20 నుంచి 35 వరకు పులులు ఉన్నాయని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో అక్కడి నుంచి టైగర్స్‌ను తెలంగాణకు(Telangana) తీసుకొచ్చేందుకు రాష్ట్ర అటవీశాఖ అధికారులు ప్రతిపాదనలను మహారాష్ట్ర చీఫ్ వైల్డైఫ్ వార్డెన్ కు ప్రతిపాదన పంపించారు. మహారాష్ట్ర సర్కార్ సమ్మతి తెలిపినట్లు సమాచారం. పులుల రీలోకేషన్ చేసేందుకు అనుమతుల కోసం రాష్ట్ర అటవీశాఖ ఎన్టీసీఏకు లేఖ రాసింది. త్వరలోనే ఈ బృందం కవ్వాల్ లో పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు.
రెండేళ్లు పైబడిన పులులు కావాలి
కవ్వాల్‌లో పులుల సంఖ్యను పెంచి, శాశ్వత ఆవాసంగా మార్చేందుకు తెలంగాణ అటవీశాఖ తాడోబా నుంచి రెండు ఆడ పులులు, ఒక మగ పులిని తీసుకురావాలని ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వానికి సైతం సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీనిద్వారా పులుల పునరుత్పత్తితోపాటు వీటి సంత్తతి పెరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. రెండేళ్లు పైబడిన పులులు కావాలని మహారాష్ట్రను తెలంగాణ కోరినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రక్రియ విజయవంతమైతే కవ్వాల్ టైగర్ రిజర్వ్‌లో పులుల సంఖ్య గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కాగా, పులుల కోసం ఆవాసం కోసం కవ్వాల్ కోర్ ఏరియా నుంచి మైసంపేట, రాంపూర్ గ్రామాల ప్రజలను ఇప్పటికే వేరే ప్రాంతానికి తరలించారు. పులుల ఆవాసానికి అనుకూల వాతావరణం ఏర్పాటు చేశారు. ఈ ఫారెస్ట్‌లో పులుల సంచారానికి ఏ ప్రాంతం అనుకూలంగా ఉంటే అక్కడికే వాటిని తీసుకురానున్నారు. వేటగాళ్ల నుంచి పులులను కాపాడేందుకు కెమెరా ట్రాప్‌లు, చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. గట్టి నిఘాను సైతం పెట్టారు. 2009లో మధ్యప్రదేశ్‌లోని పన్నా టైగర్ రిజర్వ్‌లో పులుల పునఃప్రవేశ ప్రాజెక్టు విజయవంతమైంది. ప్రస్తుతం అక్కడ 50 పులుల వరకు ఉన్నట్లు అధికారులు తెలిపారు.
పులులను తీసుకెళ్లేందుకు మహారాష్ట్ర అంగీకారం
కవ్వాల్ లో పులులను రీ లోకేషన్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నాం. తాడోబా టైగర్ రిజర్వ్‌లో 40 నుంచి 50 వరకు, ఇంద్రావతి నేషనల్ పార్కులో 20 నుంచి 35 వరకు పులులు ఉన్నాయి. దీంతో అక్కడి నుంచి టైగర్స్‌ను ఇక్కడికి తీసుకొచ్చేందుకు మహారాష్ట్ర చీఫ్ వైల్డైఫ్ వార్డెన్ కు ప్రతిపాదన పంపించగా అందుకు అంగీకరించారు. పులుల రీలోకేషన్ చేసేందుకుఅనుమతుల కోసం రాష్ట్ర అటవీశాఖ ఎన్టీసీఏకు లేఖ రాశాం. త్వరలోనే ఈ బృందం కవ్వాల్లో పర్యటించనున్నది. నివేదికను బట్టి ముందుకు వెళ్తామని అన్నారు.
Also Read: Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!