Dil Raju: ‘గేమ్ ఛేంజర్’ రిజల్ట్ ఎలా ఉన్నా, హీరో రామ్ చరణ్, డైరెక్టర్ శంకర్ కనీసం ఫోన్ కూడా చేసి మాట్లాడలేదని దిల్ రాజు సోదరుడు శిరీష్ చేసిన కామెంట్స్‌పై ఇండస్ట్రీలో పెద్ద దుమారమే చెలరేగుతుంది. ఈ కామెంట్స్‌పై తాజాగా నిర్మాత దిల్ రాజు రియాక్ట్ అయ్యారు. ఫస్ట్ టైమ్ శిరీష్ ఇలా ఇంటర్వ్యూ ఇచ్చారు. తను మాట్లాడింది తప్పే.. నేను ఎక్కడా రామ్ చరణ్ పేరును తీసుకురాలేదు. రామ్ చరణ్ మాకు ఎంతో కోపరేట్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమా తర్వాత మాకు డేట్స్ ఇచ్చి, సినిమా కోసం దాదాపు 3 సంవత్సరాలు పని చేశారు. మధ్యలో నేను వేరే సినిమా చేసుకోమని చెప్పినా కూడా ఈ సినిమాపై ఉన్న నమ్మకంతో ఆయన వేరేది చేయకుండా అలాగే డెడికేటెడ్‌గా ఉన్నారు. శిరీష్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రొడక్షన్ చూసుకున్నారు. అతనికి ఇవన్నీ తెలియదు. ఫస్ట్ టైమ్ ఇలా ఆయన ఇంటర్వ్యూ ఇవ్వడంతో బ్యాలెన్స్‌డ్‌గా మాట్లాడలేక పోయారని వివరణ ఇచ్చారు. ‘తమ్ముడు’ సినిమా ప్రమోషన్స్ నిమిత్తం జరిగిన ఓ ఇంటర్వ్యూలో దిల్ రాజు.. ఈ విషయంపై రియాక్ట్ అయ్యారు.
Also Read- Sree Vishnu: ‘లోపలికి రా చెప్తా’ అంటున్న శ్రీ విష్ణు.. విషయం ఏంటంటే?
‘‘లాస్ట్ 10 డేస్ నుంచి ‘గేమ్ చేంజర్’ పేరు లేకుండా ఇంటర్వ్యూ జరగడం లేదు. ఇప్పటి వరకు జరిగిన ప్రతి ఇంటర్వ్యూలో నేను చెబుతూనే వస్తున్నాను. నేను రామ్ చరణ్‌తోనూ, శంకర్‌తోనూ చాలా క్లోజ్‌గా ట్రావెల్ అయ్యాను. శిరీష్ ఆ సినిమాకు ఇన్వాల్వ్ కాలేదు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మొత్తం శిరీష్ ట్రావెల్ అయ్యారు. ఇప్పటి వరకు జరిగిన ఇంటర్వ్యూలలో ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి అన్ని విషయాలు చెప్పుకుంటూనే వస్తున్నాను. డైరెక్టర్‌తో సరైన వేవ్‌లెంత్ లేనప్పుడు సరిగ్గా మాట్లాడుకోవడానికి అవకాశం ఉండదని చెబుతూ వస్తున్నాను తప్పితే.. ఎక్కడా కూడా రామ్ చరణ్ గురించి మాట్లాడలేదు. RRR తర్వాత శంకర్ దర్శకత్వంలో సినిమాకు డేట్స్ ఇవ్వడం, ఆ డేట్స్‌తో మేమిద్దరం ప్రాసెస్ చేశాం. ఈ ప్రాసెస్‌లో శంకర్ ‘ఇండియన్ 2’ చేయాల్సి వచ్చింది. అప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. ఆ సమయంలో వేరే స్క్రిప్ట్ ఉంటే చేసుకోమని చెప్పాను. ఆయన వేరే సినిమా చేయకుండా ఈ సినిమా కోసం వేచి ఉన్నారు. నాకు కూడా చరణ్‌పై కన్సర్న్ ఉంటుంది. నేను వేరే సినిమా చేసుకుంటున్నాను. శంకర్ వేరే సినిమా చేసుకుంటున్నారు. నా హీరో మాత్రం ఖాళీగా ఉంటున్నారే.. అని నేను వెళ్లి వేరే సినిమా చేసుకోమని చెప్పాను. కానీ శంకర్‌పై, సినిమాపై ఉన్న రెస్పెక్ట్‌తో ఏ సినిమా చేయకుండా, ఈ సినిమా కోసమే ఎన్ని రోజులైనా వచ్చి చేశారు. అదంతా నాకు తెలుసు. ఇదంతా పెద్ద జర్నీ నాకు. అందుకే, ‘గేమ్ ఛేంజర్’కు సంబంధించి ఎక్కడా కూడా రామ్ చరణ్ ప్రస్తావన నేను తీసుకు రాలేదు.
Dil Raju steps in for damage control after producer Shirish Reddy’s comments in a recent interview stirred controversy.#GameChanger #RamCharan pic.twitter.com/OEGoApRF0E
— Telugu Chitraalu (@TeluguChitraalu) July 1, 2025
శంకర్ బిగ్ డైరెక్టర్. ఆయనతో మాకు యాక్సెస్ సరిగా లేకపోవడం వల్ల కొన్ని ఊహించని వేస్టేజ్, టైమ్, షెడ్యూల్ ప్లానింగ్.. ఇవన్నీ వన్ టు వన్ కూర్చుని మాట్లాడుకునే ఛాన్స్ లేకపోవడం కారణంగా డిలే జరుగుతూ వచ్చింది. అలాంటి సమయంలో రామ్ చరణ్ ఓపికగా సినిమా కంప్లీట్ చేసే వరకు ఎంతగానో కోపరేట్ చేశారు. అలాగే సంక్రాంతికి రిలీజ్ అనుకున్న తర్వాత రెండో సినిమా విడుదల చేసుకోవడానికి కూడా మెగాస్టార్, చరణ్ ఇద్దరూ ఎంతగానో సహకరించారు. వేరొక హీరో అయితే ఒప్పుకునే వారు కాదు. అందుకే నేను ప్రతి ఈవెంట్‌లో చిరు, చరణ్‌లకు థ్యాంక్స్ చెబుతూ వచ్చాను. రెండు సినిమాలు సంక్రాంతికి వచ్చి, ఆ సినిమా బాగా ఆడి, తన సినిమా ఆడకపోతే.. హీరోకి కూడా చిన్న పెయిన్ ఉంటుంది. అది నాకు తెలుసు. మాకు సంక్రాంతికి వస్తున్నాం హిట్ అయింది కాబట్టి.. బ్రీతింగ్ స్పేస్ దొరికింది. కానీ, రామ్ చరణ్‌కి అలా కాదు.. రేపు ‘పెద్ది’ వచ్చి హిట్ అయ్యే వరకు.. ఆయన ఎంతో ఎనర్జీతో వర్క్ చేయాలి. ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి.. రామ్ చరణ్‌తో మరో సినిమా చేయాలని, మంచి స్క్రిప్ట్ కోసం చూస్తున్నాను. కచ్చితంగా మంచి స్క్రిప్ట్ దొరికితే చరణ్‌తో సినిమా చేస్తాను.
Also Read- Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!
శిరీష్ ఇంటర్వ్యూ విషయానికి వస్తే.. ఫస్ట్ టైమ్ ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. మాములుగా ఆయన మీడియా ముందుకు రారు. స్టేజ్‌పై కూడా ఎక్కువగా మాట్లాడరు. ఆ మధ్య ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఈవెంట్‌లో ఎమోషనల్ అయ్యారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకు ఆయన జర్నీ చేశాడు, ‘గేమ్ చేంజర్’కు నేను చేశాను. ఇద్దరం సెపరేట్‌గా జర్నీ చేశాము. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇవ్వడం వల్ల.. డిస్ట్రిబ్యూటర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. కానీ ఇంటెన్షన్ మాత్రం అది కాదు. చరణ్‌తో శిరీష్ కూడా చాలా క్లోజ్‌గా ఉంటాడు. చరణ్‌పై మాకు అలాంటి ఉద్దేశం లేనే లేదు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ ఇస్తున్నప్పుడు, ఎమోషనల్‌గా అలా రియాక్ట్ అయ్యాడు. ఇంతకు ముందు ఎక్స్‌పీరియెన్స్ ఉండి ఉంటే.. వేరే విధంగా మాట్లాడేవాడు. ఫస్ట్ టైమ్ అవ్వడం వల్ల ఇంటెన్షన్‌తో వెళ్లిన తప్పే కానీ, అదే ఇంటెన్షన్ కాదు. పూర్తి వీడియో చూడకుండా చిన్న క్లిప్ చూసి మాట్లాడుతున్నారు. తర్వాత నేను పూర్తి వీడియో చూశాను. మేము హీరోలను అడిగేది ఏమీ ఉండదు.. అంటూ ఫైనల్ కంక్లూజన్ అంతా కరెక్ట్‌గానే మాట్లాడారు. ఫస్ట్ టైమ్ ఇంటర్వ్యూ కారణంగా జరిగిన తప్పే తప్పితే.. చరణ్‌పై మాకు ఎలాంటి ఇది ఉండదు. మా మధ్య గుడ్ రిలేషన్ ఉంది..’’ అని దిల్ రాజు ఈ ఇష్యూపై వివరణ ఇచ్చారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు