Old city MP candidates
Politics

Hyderabad: పాతబస్తీ లో విచిత్రం

  • ఓటు హక్కు వినియోగించుకోలేని ప్రధాన పార్టీ అభ్యర్థులు
  • వేరే నియోజకవర్గాలలో ఉన్న అభ్యర్థుల ఓట్లు
  • ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓటు చేవెళ్ల నియోజకవర్గంలో
  • బీజేపీ అభ్యర్థి మాధవీలత ఓటు మల్కాజి గిరి లో
  • కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ ఓటు సికింద్రాబాద్ పరిధిలో
  • 2004 నుంచి ఎంపీ గా గెలుస్తున్న అసదుద్దీన్ ఒవైసీ

 

Old City Parliament Candidates having no chance to caste their votes:
ఎక్కడైనా సరే ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థి ఓటు సంబంధిత నియోజకవర్గంలోనే ఉంటుంది. కానీ హైదరాబాద్ పరిధిలోని పాత బస్తీ లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీ అభ్యర్థులెవరికీ అక్కడ ఓట్లు లేకపోవడమే.
లోక్ సభ ఎన్నికల్లో కొంతమంది అభ్యర్థులు తమ ఓటును తాము వేసుకోలేని పరిస్థితి ఏర్పడింది. దీనికి కారణం వారికి తాము పోటీ చేసే నియోజకవర్గంలో కాకుండా ఇతర నియోజక వర్గాల్లో ఓటు ఉండటమే.
అటువంటి వారిలో హైదరాబాద్ ఎంఐఎం ఎంపీ అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఓటు చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో ఉంది. హైదరాబాద్ బిజెపి ఎంపి అభ్యర్థి మాధవీ లత ఓటు మల్కాజిగిరిలో పరిధిలో ఉంది. హైదరాబాద్ లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ ఓటు సికింద్రాబాద్ పరిధిలో ఉంది. దీంతో వీరందరికి తాము పోటీ చేసే నియోజకవర్గంలో తమ ఓటు వేసుకునే అవకాశం లేకుండా పోయింది.
హైదరాబాద్ పార్లమెంట్ పై ఎవరు పాగా వేస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

ఈ సారి గట్టిపోటీ తప్పదా?
1984 నుంచి ఇక్కడ జరిగే ప్రతి ఎన్నికల్లో ఎంఐఎం పార్టీనే గెలుస్తోంది. అప్పటి నుంచి1999 వరకు సుల్తాన్ సలావుద్దీన్ ఒవైసీ వరుసగా ఆరు సార్లు ఎంపీగా విజయం సాధించగా, ఆయన తదనంతరం 2004 నుంచి ఇప్పటి వరకు ఆయన కొడుకు అసదుద్దీన్ ఒవైసీ ఎంపీగా గెలుస్తూ వస్తున్నారు. ఎంఐఎం నుంచి మరోసారి అసదుద్దీన్ ఒవైసీ బరిలో ఉండగా, బీజేపీ నుంచి ఈ సారి ధార్మికవేత్త మాధవీలత పోటీలో ఉన్నారు. కాంగ్రెస్​ నుంచి వలీవుల్లా సమీర్ కి టికెట్ దక్కింది. బీఆఎర్ఎస్​ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తలపడుతున్నారు. నేటితో ప్రచారం గడువు ముగుస్తుండడంతో ఇప్పటికే నియోజకవర్గాన్ని చుట్టేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా అసదుద్దీన్ ఒవైసీ కాలనీల్లో తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ప్రచారానికి సంబంధించిన ప్రచార రథాలపై తెలుగు వాక్యాలు, తెలుగు పాటలతో ప్రచారం నిర్వహిస్తున్నారు. మైనార్టీ ఓట్లపైనే కాకుండా అందరి ఓట్లు రాబాట్టేలా ప్లాన్ ​చేశారు. మరోవైపు బీజేపీ అభ్యర్థి కూడా జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఆమె ప్రత్యర్థులపై చేస్తున్న విమర్శలు, సవాళ్లు సోషల్ మీడియాతో వైరల్ అవుతున్నాయి. కాంగ్రెస్, బీఆర్ఎస్​ అభ్యర్థులు కూడా ఎక్కడా తగ్గట్లేదు. కాంగ్రెస్ అభ్యర్థి మహ్మద్ సమీర్ కేవలం అధికారపార్టీ సంక్షేమ పథకాలు, ఆరు గ్యారెంటీలపై ఓట్లు పక్కా అని భావిస్తున్నారు. అవే తనని గట్టెక్కిస్తాయని నమ్ముతున్నారు. బీఆఎర్ఎస్​ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్ తలపడుతున్నారు. కాగా గడ్డం శ్రీనివాస్ యాదవ్ నామ మాత్రపు పోటీ ఇస్తున్నారు. ప్రధాన పోటీ కాంగ్రెస్, ఎంఐఎం, బీజేపీ మధ్యనే అంటున్నారు రాజకీయ పండితులు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?