Actress Pakija
ఎంటర్‌టైన్మెంట్, లేటెస్ట్ న్యూస్

Actress Pakeezah: కన్నీళ్లు పెట్టిన పాకీజా.. స్వేచ్ఛ కథనంపై పవన్ కళ్యాణ్ స్పందన

Actress Pakeezah: లేడీ కమెడియన్, సినీ నటి శ్రీమతి వాసుకి (పాకీజా) (Actress Pakeezah) ప్రస్తుతం తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నారు. దయనీతి స్థితిలో ఉన్న ఆమె, తన గోడును వెళ్లబోసుకుంటూ ఈ మధ్యే సోషల్ మీడియాలో ఒక వీడియోను విడుదల చేశారు. తనను ఆదుకోవాలంటూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ల‌ను ఆమె వేడుకున్నారు. దీనిపై ‘స్వేచ్ఛడైలీ.కామ్’ (swetchadaily.com) ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ ఆర్టికల్‌ ఈ నోటా ఆ నోటా చర్చనీయాంశమవడంతో చాలామందిని కదిలించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు.

పెద్ద మనసు చాటుకున్న పవన్
వాసుకి (పాకీజా) ఆర్థిక కష్టాలు తెలుసుకున్న పవన్ కళ్యాణ్ మంగళవారం ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నటి దీనస్థితికి చలించి తన తరపున రూ.2 లక్షల సాయం ప్రకటించార. ఏపీ శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్, శాసన సభ్యులు గిడ్డి సత్యనారాయణ నగదు చెక్కును పాకీజాకు అందించారు. ఈ మేరకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సినీ నటి వాసుకి (పాకీజా)కి పవన్ ఆపన్న హస్తం అందించారని తెలిపింది. ‘‘ఆమె దీన స్థితి తెలిసి చలించిన పవన్ రూ.2 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. మంగళవారం మధ్యాహ్నం మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో నగదు మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పీ. హరిప్రసాద్, పీ.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ కలిసి పాకీజాకు అందజేశారు. పవన్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు చెప్పారు’’ అంటూ జనసేన ఒక ప్రకటన విడుదల చేసింది. కాగా, పవన్ చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ పాకీజా భావోద్వేగానికి లోనయ్యారు. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే (సోమవారం) పవన్ కళ్యాణ్‌ కార్యాలయానికి తెలియజేశానని, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని ఆమె కళ్లు చెమర్చారు. పవన్ కళ్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని ఈ సందర్భంగా ఆమె భావోద్వేగంతో అన్నారు.

Read Also- Samantha and Raj Nidimoru: సమంత రెండో పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. త్వరలోనే అఫీషియల్‌ ప్రకటన?

పాకీజా వీడియో ఇదే..

తన ఆర్థిక కష్టాలను వివరిస్తూ పాకీజా ఇటీవలే సోషల్ మీడియాలో ఒక వీడియో విడుదల చేశారు. ‘‘ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌‌కు (AP Deputy CM Pawan Kalyan) నమస్కారం. నేనే పాకీజామ్మ. పాత కామెడీ యాక్టర్‌ని మాట్లాడుతున్నాను. నేను ఇప్పుడు చాలా కష్టాల్లో ఉన్నాను. మూడేళ్లుగా కష్టాలు అనుభవిస్తున్నాను. సినిమాలు లేవు, టీవీ షూటింగ్స్ లేవు. తమిళనాడులోని మా సొంత ఊరు కారైకుడి‌కి వెళ్లి జీవిస్తున్నాను. పల్లెటూరుకు వచ్చేశాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మిమ్మల్ని కలవడానికి రెండు సార్లు విజయవాడ వచ్చాను. సీఎంని కలవడం చాలా కష్టమైంది. డిప్యూటీ సీఎంను కూడా కలవలేకపోయాను. తమిళనాడు అడ్రస్‌తో నాకు ఆధార్ కార్డు ఉంది. దయచేసి నాకు నెల నెలా పెన్షన్ వచ్చేందుకు ఆధార్ పెట్టి ఏదైనా సాయం చేయండి. సీఎం, డిప్యూటీ సీఎం కాళ్లు పట్టుకుంటున్నాను. చాలా కష్టాల్లో ఉన్నాను. నాకు పిల్లలు లేరు, భర్త లేడు. ఎవరూ లేరు. అనాథగా బతుకుతున్నాను. సాయం అంటే నాకు డబ్బులివ్వడం కాదండి. నా దగ్గర తమిళనాడు ఆధార్ ఉంది. దానిపై ఏపీ ప్రభుత్వం తరపున ఏదైనా సహాయం చేయండి. మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నాను’’ అంటూ పాకీజా భావోద్వేగంతో మాట్లాడారు. ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్‌ అయింది. ఆమెను ఆదుకోవాలంటూ చాలామంది నెటిజన్లు ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు.

Read Also- Pasamailaram Blast: పాశమైలారం ఘటన.. తెరపైకి గుండెలు పిండేసే విషాద గాధలు!

 

Just In

01

Srinivas Goud: వైన్స్ షాపుల్లో గౌడ్లకు 25శాతం ఇవ్వాల్సిందే… మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

CM Revanth Reddy: నిమజ్జనానికి సింపుల్ గా సీఎం.. ఏమైనా ఇబ్బందులున్నాయా?

Leaves denied: బ్రదర్ పెళ్లికి లీవ్స్ ఇవ్వలేదని ఓ మహిళా ఉద్యోగి తీసుకున్న నిర్ణయం ఇదీ

Students Protest: మా సార్ మాకు కావాలి.. నిరసనకు దిగిన విద్యార్థులు

Dhanush: మరో తెలుగు డైరెక్టర్‌కి ధనుష్ గ్రీన్ సిగ్నల్.. ఆ దర్శకుడెవరో తెలుసా?