Medical Colleges: మెడికల్ కాలేజీల డెవలప్‌కు వెయ్యి కోట్లు ఖర్చు చేయాలని సర్కార్ భావిస్తుంది. స్టాఫ్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమకూర్చేందుకు ఈ నిధులను వినియోగించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 34 (Medical College) మెడికల్ కాలేజీల్లో స్టాఫ్, సౌలత్‌ల కొరత లేకుండా చర్యలు తీసుకోనున్నారు. ఈ ప్రతిపాదన క్యాబినెట్ (Cabinet) ముందుకు వెళ్లనున్నది. ప్రత్యేక ఫండ్స్ కోసం హెల్త్ మినిస్టర్ (Minister Health) ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాది లోపు ఒక్క మెడికల్ కాలేజీలో కూడా సమస్య ఉండకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగనున్నది.
ఇప్పటికే వరల్డ్ బ్యాంక్ నుంచి సుమారు 4 వేల కోట్లు వైద్య శాఖకు రానున్నారు. వీటికి అదనంగా మెడికల్ కాలేజీల (Medical Colleges) డెవలప్ కూడా మరో వెయ్యి కోట్లను వరల్డ్ బ్యాంక్‌ను అడిగేందుకు వైద్యారోగ్యశాఖ సిద్ధమైంది. ఇటీవల అన్ని మెడికల్ కాలేజీలను (Medical Colleges) సందర్శించిన మానిటరింగ్ కమిటీ, ప్రభుత్వానికి ఓ రిపోర్ట్ ఇచ్చింది. కాలేజీల్లో ఇంకా ఏం కావాలి? ఎలాంటి సమస్యలు ఉన్నాయి? ఎంత మేరకు స్టాఫ్ ఉన్నారు? ల్యాబ్‌ల పనితీరు, ఎక్విప్‌మెంట్లు, విద్యార్థులకు సౌలత్‌లు, అకాడమిక్ బుక్స్, అనుబంధ ఆస్పత్రుల్లో ప్రాక్టీస్, డిజిటల్ సిస్టమ్స్, ఐటీ ఇన్‌ఫ్రా తదితర అంశాలన్నింటీపై ఆ రిపోర్ట్‌లో పొందుపరిచారు.
Also Read: Telangana Tourism: తెలంగాణ టూరిజానికి ప్రతినెలా 50 లక్షల నష్టం!
కుప్పలు కుప్పలుగా పర్మిషన్లు
కొత్త రాష్ట్రం ఏర్పడగానే మొదటి విడతగా గత ప్రభుత్వం 4 కొత్త వైద్య కళాశాలలు మహబూబ్‌నగర్, నల్గొండ, సూర్యాపేట, సిద్దిపేటలో ప్రారంభించింది. రెండో విడుతగా మరో 8 వైద్య కళాశాలలను మంచిర్యాల, రామగుండం, జగిత్యాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మహబూబాబాద్, కొత్తగూడెం, సంగారెడ్డిలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మూడో విడుతగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, ఖమ్మం, కామారెడ్డి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీం ఆసిఫాబాద్, జనగాం జిల్లాల్లో నూతనంగా మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయగా, నాలుగో విడతగా జోగులాంబ గద్వాల్, నారాయణ్‌పేట్, ములుగు, మెదక్, యాదాద్రి భువనగిరి, వరంగల్ జిల్లా నర్సంపేట్, రంగారెడ్డి జిల్లా మహేశ్వరం, మేడ్చల్ జిల్లా లోని కుత్భుల్లాపూర్‌లో మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేశారు.
అయితే, గత సర్కార్ అంకెల గారడీ తరహాలో కాలేజీల సంఖ్యను పెంచుతూ వెళ్లిందే కానీ, అందుకు అవసరమైన సౌకర్యాలు, స్టాఫ్‌ను నియమించడంలో ఫెయిల్ అయ్యింది. దీంతో మెడికల్ కాలేజీల లక్ష్యం సమర్థవంతంగా అమలు కావడం లేదు. ఎన్‌ఎంసీ కూడా వీటన్నింటినీ గుర్తించింది. ఇదే విషయాన్ని (Health Minister) హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహకు ఎన్‌ఎంసీ చైర్మన్ వివరించారు. దీంతో మెడికల్ కాలేజీలపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు.
Also Read: HMDA Scam: రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌కు ధారాదత్తం!