Telangana Tourism ( image cedit: twtter)
తెలంగాణ

Telangana Tourism: తెలంగాణ టూరిజానికి ప్రతినెలా 50 లక్షల నష్టం!

Telangana Tourism:  ఏపీ ప్రభుత్వం వైఖరితో తెలంగాణ టూరిజం శాఖకు భారీగా నష్టం జరుగుతున్నది. ప్రజల తరపున పలు మార్లు టూరిజం శాఖ విజ్ఞప్తులు చేసినా స్పందించలేదు. గత డిసెంబర్ నుంచి తిరుపతి దర్శనాలకు టోకెన్లు ఇవ్వకపోవడంతో ప్రభుత్వానికి ఆదాయానికి గండి పడింది. ప్రతి నెలా సుమారు 50లక్షల వరకు నష్టం జరుగుతుందని అధికారులు పేర్కొంటున్నారు. తిరుమలేశుడి దర్శనం కోసం తెలంగాణ నుంచి భారీగా భక్తులు వెళుతుంటారు. వారికోసం తెలంగాణ పర్యాటక శాఖ, తెలంగాణ ఆర్టీసీ (Telangana RTC) ప్రత్యేక బస్సు సర్వీసులను భక్తులకోసం నడుపుతుంది.

ఈ బస్సుల్లో వెళ్లేవారికి ముందస్తుగానే టికెట్లు జారీ చేస్తుండడంతో దైవ దర్శనం అవుతున్నది. తిరిగి వస్తుంటారు. దీంతో భక్తులు ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. దీంతో పర్యాటకశాఖతో పాటు ఆర్టీసీ భారీగా ఆదాయం వస్తుండేది. అయితే, గతేడాది డిసెంబర్ నుంచి దర్శన టికెట్లను ఏపీ ప్రభుత్వం (AP Govt) బంద్ చేస్తున్నట్లు ప్రకటించింది. పునరుద్దరణకోసం (Telangana Tourism) తెలంగాణ టూరిజం శాఖ లేఖలు రాసినా స్పందన కరువైంది. ఇటు భక్తులకు అటు టూరిజం శాఖపై ఎఫెక్ట్ పడింది.

 Also ReadHMDA Scam: రూ.3 వేల కోట్ల ప్రభుత్వ భూమి ప్రైవేట్‌కు ధారాదత్తం!

టూరిజం శాఖ నుంచి ప్రతీ రోజూ హైదరాబాద్ (Hyderabad)  బషీర్ బాగ్ నుంచి తిరుమలకు వెళ్లే భక్తుల సౌకర్యార్ధం రెండు బస్సులను ఏర్పాటు చేస్తుండేది. ఈ టికెట్ బుకింగ్ ఆన్ లైన్లో చేసుకునేవారు. అయితే ఒక్కరికి 3800బస్ టికెట్ గా నిర్ణయించారు. భక్తులను తిరుమలకు తీసుకెళ్లడం, బస, స్వామివారి దర్శనం, తిరిగి తీసుకొచ్చేవారు. అందుకు పర్యాటక శాఖకు ప్రతి రోజూ 100 నుంచి 200టికెట్లు ఇచ్చేవారని సమాచారం. అదే ఆర్టీసీ వెయ్యి టికెట్ల వరకు టీటీడీ జారీ చేసేదని అధికారులు తెలిపారు. దీంతో పర్యాటక శాఖకు ప్రతి నెలా రూ.40లక్షల నుంచి 50లక్షల వరకు ఆదాయం సమకూరేది. అదే విధంగా (RTC) ఆర్టీసీకి సైతం భారీగా ఆదాయం వచ్చేది. భక్తులకు ఆర్టీసీ బస్సు ప్రయాణం సౌకర్యవంతంగా ఉండేది. భక్తులు సైతం ఎక్కువగా స్వామివారి దర్శనం కోసం వెళ్లేవారు.

టీటీడీ దర్శన టికెట్లు పక్కదారి
ఈ తరుణంలోనే టీటీడీ దర్శన టికెట్లు పక్కదారి పడుతున్నాయనే కారణంతో టికెట్లను నిలిపివేసింది. అధికారంగానే తెలంగాణతో పాటు తమిళనాడుకు సమాచారం ఇచ్చింది. గతేడాది డిసెంబర్ 1 నుంచి టికెట్ల జారీని నిలిపివేసింది. దీంతో భక్తులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. గత 7నెలలుగా పర్యాటక శాఖ బస్సులు సైతం తిరుమలకు సర్వీసు నడపడం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ఏపీ కారణంగా పర్యాటక శాఖకు ప్రతి నెల 50 లక్షల వరకు నష్టం జరుగుతుందని, ఈ ఏడు నెలల్లో 3.50 కోట్లు నష్టపోయినట్లు పర్యాటక శాఖ అధికారులు పేర్కొంటున్నారు. ఈ రంగంపై ప్రత్యేకంగా, పరోక్షంగా చాలా మంది ఉపాధిని సైతం కోల్పోయారని అభిప్రాయం వ్యక్తం చేశారు.

టీఎస్ ఆర్టీసీకి (RTC) సైతం 9 కోట్ల మేర నష్టం జరిగినట్లు సమాచారం. మళ్లీ దర్శన టికెట్లను పునరుద్ధరించాలని తెలంగాణ పర్యటక శాఖ టీటీడీకి లేఖలు రాసినట్లు అధికారులు తెలిపారు. పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) సైతం లేఖ రాసినా అక్కడి నుంచి రిప్లై రాలేదని సమాచారం. ఏపీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, ఏపీ ప్రభుత్వం వివక్ష కారణంగానే తెలంగాణకు నష్టం జరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీలోనే దర్శన టికెట్లలో అవకతవకలు జరిగాయని, తెలంగాణలో టికెట్లలో అసలు జరగలేదని అధికారులు పేర్కొంటున్నారు.

సీఎం స్పందిస్తేనే మళ్లీ తిరుమలకు బస్సులు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) స్పందిస్తేనే మళ్లీ టూరిజం శాఖకు చెందిన బస్సులు తిరుమలకు వెళ్లే అవకాశం ఉంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబుకు (CM Chandrababu) లేఖ గానీ, నేరుగా ఫోన్ లో గానీ సంప్రదించి టీటీడీ దర్శన టికెట్లు మంజూరు చేసేలా కోరాలని, ఒత్తిడి చేయాల్సిన అవసరం ఉందని టూరిజం అధికారులు పేర్కొంటున్నారు. అయితే సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్లేందుకు అధికారులు సైతం సన్నద్ధమవుతున్నారు. దీంతో పాటు మరో మారు పర్యాటక శాఖ నుంచి టీటీడీకి లేఖలు రానున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులు తిరిగి ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయోనని భక్తులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

తాజాగా తిరుమలేశుడిని దర్శించుకున్న ఆర్టీసీ కి (RTC) ఎండీ సజ్జనార్ సైతం పర్యాటక రంగ అభివృద్ధిలో భాగంగా ఆర్టీసీకి ఇచ్చే శ్రీవారి ప్రత్యేక దర్శన కోటాను తిరుమల తిరుపతి దేవస్థానం పునరుద్ధరించాలని కోరారు.
టీటీడీ ఈవోను కోరినట్లు వెల్లడించారు. టూరిజం కోటా కింద కల్పించే ఈ సౌకర్యం ఇతర రాష్ట్రాల భక్తులకు ఎంతో ఉపయోగకరంగా ఉండేదని, గత డిసెంబరు నుంచి టీటీడీ ఈ కోటాను రద్దు చేసిందని తెలిపారు. ఏపీ ప్రభుత్వం ఈ అంశంపై పునరాలోచన చేయాలని విజ్ఞప్తి చేశారు. దర్శన టికెట్లు ఉంటే తెలంగాణా పర్యాటక రంగానికి, ఆర్టీసీకి టీటీడీ ఊతం ఇచ్చినట్టు అవుతుందన్నారు. అయితే ఏపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంటుందో అనేది వేచిచూడాలి.

 Also Read: Land Grabbing in Kothagudem: భూ బకాసురుల కబంధ హస్తాలలో ప్రభుత్వ భూములు

Just In

01

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు

Ustaad Bhagat Singh: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ గురించి బ్లాక్ బస్టర్ న్యూస్ చెప్పిన దేవీ శ్రీ ప్రసాద్..

Telangana Politics: కాంగ్రెస్‌లో ఉత్కంఠం.. ఏఐసీసీలో కవిత ఎపిసోడ్..?

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ