Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?..
Bandi Sanjay( IMAGE credit: TWITTER)
Political News

Bandi Sanjay: బీసీకి బీఆర్ఎస్ అధ్యక్ష పదవి ఇచ్చే దమ్ముందా?.. బండి సంజయ్ కీలక వాఖ్యలు!

Bandi Sanjay: తెలంగాణ బీజేపీ స్టేట్ చీఫ్ అంశంపై చంద్రబాబు చెబితే నిర్ణయం తీసుకునే పార్టీ బీజేపీ కాదని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) విమర్శలు చేశారు. టీబీజేపీ స్టేట్ చీఫ్ ఎన్నికకు నామినేషన్ సందర్భంగా నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి  ఆయన వచ్చారు. ఈ సందర్భంగా బండి సంజయ్ (Bandi Sanjay) మాట్లాడుతూ, అధిష్టానం ఇంకా రాష్ట్ర అధ్యక్షుడిని ప్రకటించలేదన్నారు. ఈ అంశంపై అధిష్టానం అన్ని ఆలోచించి నిర్ణయం తీసుకుంటుందన్నారు. అధ్యక్ష బాధ్యతలు ఎవరైనా అడగొచ్చని కేంద్ర మంత్రి వివరించారు.

 Also ReadRanga Reddy district: పట్టాదారుడికి తెలియకుండానే భూ మార్పిడి!

పార్టీకి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ఎవరు ప్రచారం చేస్తున్నారో అందరికీ తెలుసని, సోషల్ మీడియాలో ఒకరిపై ఒకరు ప్రచారం చేసుకునే సంస్కృతి (BJP) బీజేపీ‌లో కొత్తగా స్టార్ట్ అయిందని ఘాటుగా బండి స్పందించారు. (BJP) బీజేపీలో కట్టర్ కార్యకర్తలు ఉన్నారని, ఎవరైనా పార్టీకి, అధిష్టానానికి వ్యతిరేకంగా సోషల్ మీడియా పోస్టింగ్‌లు పెట్టిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. బీజేపీ (BJP) బీసీలకు అధ్యక్ష పదవి ఇవ్వడం లేదని బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నదని బండి విమర్శలు చేశారు. బీఆర్ఎస్‌కు దమ్ముంటే కేసీఆర్ తప్పుకుని పార్టీ అధ్యక్ష పదవిని బీసీలకు ఇవ్వాలని బండి డిమాండ్ చేశారు.

కనీసం బీఆర్ఎస్ (BJP) వర్కింగ్ ప్రెసిడెంట్ అయినా బీసీ నేతకు ఇవ్వాలని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ (BRS) అధికారంలో ఉన్న సమయంలో ఎంతమంది బీసీలకు మంత్రి పదవులు ఇచ్చారని సంజయ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. బీజేపీ గతంలో బీసీలైన బండారు దత్తాత్రేయ, లక్ష్మణ్, చలపతి రావు, తనకు కూడా స్టేట్ చీఫ్‌గా అవకాశం కల్పించిందన్నారు. బంగారు లక్ష్మణ్‌కు సైతం అవకాశం కల్పించిన పార్టీ బీజేపీ (BJP) అని వ్యాఖ్యానించారు. పార్టీలో ఎవరు డమ్మీ కాదని, ఎవరిని ఎక్కడ వినియోగించుకోవాలో పార్టీకి బాగా తెలుసని సంజయ్ పేర్కొన్నారు.

 Also Read: Raja Singh resigned: రాజాసింగ్ క్రమశిక్షణారాహిత్యం.. పలువురు నేతల ప్రశ్నలు

Just In

01

45 Official Trailer: శివరాజ్ కుమార్, ఉపేంద్రల అరాచకం.. ఎండింగ్ డోంట్ మిస్!

Akhanda 2: ‘అఖండ 2’ సక్సెస్ మీట్‌కు నిర్మాతలు ఎందుకు రాలేదు? భయపడ్డారా?

Suriya46: ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’‌ను తలపిస్తోన్న సూర్య – వెంకీ అట్లూరి మూవీ టైటిల్!

Vishnu Vinyasam: శ్రీ విష్ణు నెక్ట్స్ సినిమా టైటిల్ ఇదే.. టైటిల్ గ్లింప్స్ అదిరింది!

Minister Seethakka: మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని చంపే కుట్ర: మంత్రి సీతక్క