Actress Laya about Thammudu
ఎంటర్‌టైన్మెంట్

Actress Laya: అప్పటికీ, ఇప్పటికీ సినిమా రంగంలో గమనించిన మార్పులివే!

Actress Laya: టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థలలో ఒకటైన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటోన్న మూవీ ‘తమ్ముడు’ (Thammudu). నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాను శ్రీరామ్ వేణు (Sriram Venu) దర్శకత్వంలో దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రంతో టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తున్నారు ఒకప్పటి హీరోయిన్ లయ. ‘తమ్ముడు’ సినిమా జూలై 4న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్‌కు రెడీ అయిన నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రమోషన్స్ జోరును పెంచింది. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా నటి లయ (Laya Actress) మీడియాకు చిత్ర విశేషాలను తెలిపారు. ఆమె మాట్లాడుతూ..

Also Read- Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!

‘‘నేను యుఎస్ నుంచి ఇండియాకు 2023 ఫిబ్రవరిలో వచ్చాను. ఇక్కడ కొన్ని యూట్యూబ్ ఛానెల్స్‌కు ఇంటర్వ్యూస్ ఇచ్చాను. ఆ ఇంటర్వ్యూలు చూసి జూన్‌లో ‘తమ్ముడు’ సినిమా యూనిట్ నుంచి కాల్ వచ్చింది. నా దగ్గర ఉన్న కొన్ని ఫొటోస్ పంపిస్తే.. అవి పాత్రకు సరిపడేలా లేవని, మళ్లీ ఫొటో షూట్ చేసి పంపమని అడిగారు. అలా మళ్లీ ఫొటో షూట్ చేసి పంపించాను. అలా ఈ సినిమాలో నాకు అవకాశం వచ్చింది. నా రీ ఎంట్రీకి ‘తమ్ముడు’ సరైన సినిమా అని భావిస్తున్నాను. ఈ మూవీ కోసం కొన్ని నెలల పాటు ఇక్కడే ఉన్నాను. ఇందులో నేను ఝాన్సీ కిరణ్మయి అనే పాత్రలో నటించాను. తనొక స్ట్రిక్ట్ ఆఫీసర్. హీరో నితిన్‌కు సోదరి పాత్ర నాది. ఈ చిత్రం కోసం అడవిలో కూడా షూటింగ్ చేశాం. అప్పుడు అందరం ఇబ్బందులు పడ్డాం. ఎవరో ఒకరికి గాయాలు అవుతూనే ఉండేవి. అయినా సరే చాలా డెడికేటెడ్‌గా వర్క్ చేశాం.

Also Read- PuriSethupathi: ‘పూరిసేతుపతి’ సినిమాకు కామ్‌గా క్లాప్.. పూరిలో ఇంత మార్పా?

సుదీర్ఘ విరామం తర్వాత మళ్లీ ఇలా ప్రేక్షకుల ముందుకు వస్తున్నందుకు సంతోషంగా ఉంది. ఇన్నేళ్ల తర్వాత వస్తున్నా.. ప్రేక్షకులు అదే ఆదరణను నాపై చూపిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫిట్‌నెస్‌గా ఉండటం అంటే సన్నగా ఉండటం కాదు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను. ప్రతి ఏజ్‌కి ఏజ్ లిమిట్ ఉండదని నేను భావిస్తుంటాను. ‘తమ్ముడు’ సినిమాలో నా పాత్రలకు అసలు మేకప్ లేదు. న్యాచురల్‌గా ఉండాలని దర్శకుడు ముందే చెప్పారు. అప్పటికి ఇప్పటికీ నేను చాలా గమనించాను. ఇప్పుడంతా టెక్నాలజీ మారిపోయింది. ప్రతి ఫ్రేమ్ గురించి అంతా ముందే జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడటం లేదు. అప్పట్లో రీల్ కాస్ట్ ఎక్కువగా ఉండేది. ఒకటి, రెండు టేక్స్ మించితే భయపడిపోయే వాళ్లం. ఇప్పుడలా లేదు.. మంచి అవుట్‌ఫుట్ కోసం ఎంత సమయమైనా, ఎన్ని టేక్స్ అయినా తీసుకుంటున్నారు. ఇప్పుు సినిమా క్వాలిటీని పెంచే విషయంలో అడ్వాన్స్‌డ్ మెథడ్స్ ఉన్నాయి. అప్పట్లో సినిమాలు చాలా ఫాస్ట్‌గా షూటింగ్ జరుపుకునేవి. మేము ఏడాదికి 7, 8 సినిమాలు కూడా చేసే వాళ్లం. ఇప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్ అయింది. ఏది ఏమైనా ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయడం ఇక్కడ ముఖ్యం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

ఇంకా ఈ ఇంటర్వ్యూలో నితిన్‌తో చేయడంపై, ‘తమ్ముడు’ సినిమా స్టోరీపై, పరిశ్రమలో ఉన్న దోపీడీ గురించి, రియాలిటీ షోల గురించి, పాత్రకి తను ఎలా రెడీ అవుతారు, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్, తన వ్యక్తిగత ఆలోచనలు, పెళ్లి, ఫ్యామిలీ గురించి బోలెడన్ని విషయాలు లయ చెప్పారు. అవేంటో తెలియాలంటే.. ఈ క్రింది వీడియో చూడాల్సిందే.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?