Kannappa and Game Changer Pics
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: ‘గేమ్ ఛేంజర్’ బాటలో ‘కన్నప్ప’.. తలబాదుకుంటోన్న మంచు విష్ణు!

Kannappa: మంచు విష్ణు (Manchu Vishnu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రూపొంది, జూన్ 27వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైన ‘కన్నప్ప’ చిత్రం ‘గేమ్ ఛేంజర్’ బాటలో నడుస్తుంది. అవును ఇది నిజం. అదేంటి మొదటి రోజే పాజిటివ్ టాక్ వచ్చిందిగా! విమర్శకులు కూడా ప్రశంసించారుగా! ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, కాజల్.. ఇలా ఎంతో మంది నటీనటులు ఇందులో ఉంటే.. యావరేజ్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ దారిలో నడవడం ఏమిటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా. ‘కన్నప్ప’ సినిమా విడుదలైంది నిజం.. పాజిటివ్ టాక్‌ని తెచ్చుకుంది నిజం. కానీ ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. ఫస్ట్ డే రూ.9.35 కోట్లు, రెండో రోజు రూ.7 ప్లస్ కోట్లు, మూడో రోజు రూ.7.25 కోట్లు కలెక్షన్స్ రాబట్టిన ఈ సినిమా.. ఇప్పుడు పైరసీ బారిన పడి.. కుదేలవుతోంది. ఇప్పుడర్థమైందా? ఎందుకు ‘గేమ్ ఛేంజర్’ బాటలో అని అన్నది.

Also Read- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan), సంచలన దర్శకుడు శంకర్ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) చిత్రాన్ని కావాలని కొందరు విడుదలైన మొదటి రోజే ఒరిజినల్ ప్రింట్‌ని పైరసీ రూపంలో విడుదల చేశారు. ఆ సినిమాకు టాక్ వీక్‌గా ఉన్నా, ఓపెనింగ్ భారీ స్థాయిలో వస్తాయని ఊహించిన చిత్రబృందానికి ఈ పైరసీ ఊహించని షాక్ ఇచ్చింది. పైరసీ ప్రింట్ వచ్చినా, ఫ్యాన్స్, ప్రేక్షకులు చాలా వరకు థియేటర్లలోనే ఈ సినిమాను చూశారు. దీంతో కొంతమేరకు నష్టం తగ్గిందనే చెప్పుకోవచ్చు. కానీ ‘కన్నప్ప’ విషయంలో అలా జరగడం లేదు. సినిమా పాజిటివ్ టాక్, ప్రభాస్ పాత్రకు మంచి పేరు వస్తున్నా.. పైరసీ రూపంలో ఈ సినిమాపై పెద్ద పిడుగే పడింది. ఈ విషయం తెలిసి మంచు విష్ణు తలబాదుకుంటున్నారు. కారణం ఈ సినిమా రూ. 10, 20 కోట్లతో కాదు, దాదాపు రూ. 200 కోట్లతో రూపుదిద్దుకుంది. అందులోనూ రాక రాక చాలా కాలానికి మంచు ఫ్యామిలీ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఎలాగోలా గట్టెక్కుతామనే వారంతా అనుకుంటున్నారు. కానీ, పైరసీ రూపంలో పెద్ద దెబ్బే పడటంతో.. మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా రిక్వెస్ట్‌లు పెట్టుకోవాల్సి వస్తుంది.

Also Read- Kannappa: ‘కన్నప్ప’ను చూసిన డిప్యూటీ సీఎం.. షాకింగ్ రియాక్షన్!

ఇప్పటి వరకు ‘కన్నప్ప’ పైరసీకి సంబంధించి దాదాపు 30 వేల అనధికార లింక్స్‌ను డిలీట్ చేయించినట్లుగా మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. తన సినిమా పైరసీకి గురి కావడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయవద్దని, వేల మంది కృషితో ఈ సినిమా రూపుదిద్దుకుందని, సినిమాను థియేటర్లలోనే చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు తన పోస్ట్‌లో ‘‘కన్నప్ప సినిమా పైరసీకి గురైంది. ఇప్పటికే మా టీమ్ నెట్టింట ఉన్న సుమారు 30 వేల అనధికార లింక్స్‌ను డిలీట్ చేయడం జరిగింది. చాలా బాధగా ఉంది. పైరసీ అంటే దొంగతనంతో సమానం. మన పిల్లలకు దొంగతనం చేయమని మనం నేర్పించలేం కదా! కానీ, ఇలా అనధికారికంగా సినిమాను చూడడం కూడా దొంగతనంతో సమానమే. దయచేసి అందరూ థియేటర్లకు వచ్చి మా ‘కన్నప్ప’ సినిమాను ఆదరించండి’’ అని విష్ణు పేర్కొన్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్