Jubilee hills Constituency: సిటీలోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్(Maganti Gopinath) హఠాన్మరణంతో అనివార్యమైన జూబ్లీహిల్స్(Jubilee Hills) ఉప ఎన్నిక వేడి రాజుకుంది. అధికార కాంగ్రేస్ పార్టీకి సిటీలో కేవలం ఒక్క ఎమ్మెల్యే ఉన్నందున, జూబ్లీహిల్స్ ను కూడా తన ఖాతాలోకి చేర్చుకునేందుకు హస్తం పార్టీ వ్యూహాం సిద్దం చేసినట్లు సమాచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఈ సీటును కైవసం చేసుకునేందుకు అధికార పార్టీ ప్రయత్నాలను మొదలుపెట్టింది. ముఖ్యంగా గత 2023 నవంబర్ లో జరిగిన సాధారణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రేస్(Congress) నుంచి పోటీ చేసిన ఓటమి పాలైన మాజీ క్రికెటర్ అజారుద్దిన్(Azharuddin) కాకుండా లోకల్ గా బాగా పట్టున్న అభ్యర్థి కోసం కాంగ్రేస్ అధిష్టానం అన్వేషణ ప్రారంభించినట్లు సమాచారం.
మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్
ఇప్పటికే పలువురు ఆశావాహులు టికెట్ కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లు వార్తలు విన్పిస్తున్నా, ఈ నియోజకవర్గంలో విజయం సాధించాలన్న విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), జిల్లా ఇన్ ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలిసింది. ఇందులో భాగంగానే రెండు సార్లు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని డివిజన్ నుంచి కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహించిన మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్(Murali Goud) పేరు ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం. మాజీ కార్పొరేటర్ మురళీ గౌడ్ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితో కలిసి తెలుగుదేశం పార్టీలో పని చేసిన సానిహిత్యం ఉండటంతో గతంలోనే కాంగ్రేస్(Congress) పార్టీలో చేరిన మురళీధర్ గౌడ్ ఇటీవలే సీఎం రేవంత్ రెడ్డిని కలిసి జూబ్లీహిల్స్ టికెట్ అభ్యర్థించినట్లు తెలిసింది. ప్రస్తుతం జూబ్లీహిల్స్ టికెట్ కోసం పోటీ పడుతున్న ఆశావాహుల్లో దాదాపు అందరూ స్థానికేతరులే కావటంతో కాంగ్రేస్ అధిష్టానం సైతం పక్కా లోకల్ లీడర్ అయిన మురళీధర్ రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
Also Read; MLC Kavitha: కవిత భేటీలపై రాజకీయ చర్చ.. ఎందుకిలా?
యాక్టీవ్ కార్యకర్తగా మురళీధర్ గౌడ్
త్వరలో జరగనున్న జూబ్లీ హిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల్లో లోకల్ లీడర్ ను గెలిపించుకోవాలని పార్టీ క్యాడర్ కూడా నిర్ణయించుకున్నట్లు తెలిసింది. 1975 నుంచి అప్పటి ఖైరతాబాద్(Khairathabad) నుంచి వరుసగా పలు సార్లు గెలిచిన పీజేఆర్(PJR) హయాంలో కాంగ్రేస్(Congress) పార్టీలో యాక్టీవ్ కార్యకర్తగా పని చేసిన మురళీధర్ గౌడ్ ఆ తర్వాత టీడీపీ(TDP) పార్టీ నుంచి ఓ సారి తాను, మరోసారి ఆయన కుమారుడు కార్పొరేటర్ గా గెలిచి, స్థానికంగా పలు అభివృద్ది పనులు చేసి ప్రజల్లో తమదైన ముద్ర వేసుకున్నారు. ఇప్పటి వరకు ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన లీడర్లు, పోటీ చేసి గెలిచిన లీడర్లంతా స్థానికేతరులే కావటంతో ఈ సారైనా లోకల్ లీడర్ మురళీధర్ గౌడ్ కు పార్టీ టికెట్ కేటాయిస్తే, గెలిపించుకోవాలన్న ధృడ సంకల్పంతో పార్టీ క్యాడర్ స్కెచ్ సిద్దం చేసినట్లు తెలిసింది.
Also Read: Operation Muskan: చైల్డ్ ట్రాఫికింగ్‌కు చెక్.. రంగంలోకి స్పెషల్ ఫోర్స్