Eatala Rajendar: హైడ్రా, రెవెన్యూ అధికారులు జవహర్ నగర్ లోని పేద ప్రజల నివాసాలను నేలమట్టం చేస్తూ పేదల బతుకులు చిన్నాభిన్నం చేస్తున్నారని, కాంగ్రెస్ సర్కారుకు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. జవహర్ నగర్ లో ప్రజా సమస్యల సాధనకై భాజపా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన పోరుబాట కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేద ప్రజలు కష్టపడి నిర్మించుకున్న ఇళ్లను రెవెన్యూ అధికారులు లంచాలు అడిగి ఇవ్వకపోతే కూల్చివేయడం హేయమైన చర్య అని అన్నారు. పేద ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతూ కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చర్యలు ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భాజపా ఆధ్వర్యంలో ఎంతో మంది పేదలకు ఇళ్లను నిర్మించి ఇచ్చినట్లు వెల్లడించారు.
Also Read: Celebrity Wedding: నాలుగో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి.. ఎగిరిగంతులేస్తున్న భర్త? వీడియో వైరల్
డంపింగ్ యార్డ్ మూలంగా జవహర్ నగర్ పరిసర ప్రాంతాల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని.. చిన్నారులు, వృద్ధులు దుర్వాసన, దోమల మూలంగా రోగాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు మౌలిక వసతులు కల్పించడంలో కూడా గత ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ అధికారులు తక్షణమే కూల్చివేతలు ఆపి పేద ప్రజలకు పట్టాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బాలాజీ నగర్ డంపింగ్ యార్డును పూర్తిగా ఎత్తివేయాలని, ఇక్కడున్న సమస్యలను పరిష్కరించకపోతే పోరుబాట తప్పదని హెచ్చరించారు.
Also Read: Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్