Fire Accident (Image Source: AI)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Fire Accident: హైదరాబాద్‌లో భారీ పేలుడు.. గాల్లోకి ఎగిరిపడ్డ జనాలు.. సీఎం విచారం!

Fire Accident: హైదరాబాద్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. పటాను చెరు పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పాశమైలారం పారిశ్రామిక వాడలోని సీగాచి కెమికల్స్ పరిశ్రమలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పరిశ్రమలోని రియాక్టర్ ఒక్కసారిగా పేలిపోయింది. దీంతో రియాక్టర్ వద్ద పనిచేస్తున్న కార్మికులు.. 100 మీటర్ల దూరం వరకూ ఎగిరిపడ్డారు. ఈ ఘటనలో పలువురు ప్రాణాలు కోల్పోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. రంగంలోకి దిగిన రెస్క్యూ బృందం.. క్షతగాత్రులను హుటాహుటీన ఆస్పత్రికి తరలించింది. బాధితులకు పటాన్ చెరులోని ధ్రువ, చందానగర్ లోని అర్చన ఆస్పత్రిల్లో చికిత్స అందిస్తున్నారు.

భారీగా ప్రాణ నష్టం!
సీగాచి కెమికల్స్ పరిశ్రమల్లో చెలరేగిన మంటల్లో ఐదుగురు ఘటనాస్థలిలోనే చనిపోయినట్లు ప్రాథమికంగా సమాచారం అందుతోంది. తీవ్రంగా గాయపడిన 14 మందిని ఆస్పత్రికి తరలించగా.. అందులో ఇద్దరు కూడా చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే మృతుల సంఖ్య అధికారికంగా నిర్ధరణ కాలేదు. మంటలను రెండు ఫైరింజన్లతో ఆర్పుతున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సంగారెడ్డి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్.. పరిస్థితులను పరిశీలించారు.


పరుగులు పెట్టిన జనం!
అయితే పేలుడు సమయంలో సీగాచి కెమికల్స్ ఫ్యాక్టరీలో 100-120 కార్మికులు పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో వారిలో చాలా మంది ప్రాణ భయంతో ఒక్కసారిగా బయటకు పరుగులుపెట్టినట్లు సమాచారం. పెద్ద శబ్దం రావడంతో కంపెనీకి చుట్టుపక్కల ఉన్న ప్రజలు సైతం ఉలిక్కిపడినట్లు తెలుస్తోంది. క్షతగాత్రులు, మృతుల వివరాలను తర్వాత ప్రకటించే అవకాశముంది. పరిస్థితులు అదుపులోకి వచ్చాక.. రియాక్టర్ పేలడానికి గల కారణాలను సైతం పోలీసులు అన్వేషించే అవకాశముంది.

Also Read: Shefali Jariwala Death: నటి మృతిపై ప్రియాంక చోప్రా షాకింగ్ రియాక్షన్.. చాలా చిన్నదంటూ!

సీఎం రేవంత్ విచారం
పాశమైలారం పారిశ్రామిక వాడలో జరిగిన అగ్నిప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాదంలో గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం ఘటనపై విచారం వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించి జిల్లా కలెక్టర్ తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. మరోవైపు ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ మరికొద్ది సేపట్లో ఘటనా స్థలిని పరిశీలించే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

Also Read This: Telangana BJP president: బీజేపీ అధ్యక్షుడి నియామకంలో బిగ్ ట్విస్ట్.. రామచందర్ రావు పేరు ఖరారు!

Just In

01

CCI Cotton Procurement: పత్తి కొనుగోళ్లలో అవకతవకలు జరగొద్దు.. పినపాక ఎమ్మెల్యే

Kavitha Janam Bata: కేసీఆర్‌కు ఆ అవసరం లేదు.. నిజామాబాద్ ప్రెస్‌మీట్‌లో కవిత ఆసక్తికర వ్యాఖ్యలు

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?