Mogalirekulu Sagar: మొగలిరేకులు RK నాయుడు సాగర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చక్రవాకం సీరియల్లో జగన్ క్యారెక్టర్ తో పరిచయమైన మొగలిరేకులు సీరియల్ తో స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. అలా ఈ హీరోకి మెగా ఫ్యామిలీతో మంచి అనుబంధం కూడా ఉంది. కెరీర్ మంచిగా ముందుగా వెళ్తున్న సమయంలో సీరియల్స్ ఎందుకు వదిలేశాడో ఇక్కడ తెలుసుకుందాం..
సీరియల్లోకి సాగర్ ఎలా వెళ్ళాడంటే?
సాగర్ కు తను డిగ్రీ స్టార్ చేసినప్పటి నుంచి నటన పై ఎక్కువ మక్కువ ఉండటంతో యాక్టర్ అవుతానని ఇంట్లో వాళ్ళకి చెప్పగా.. ఇంట్లో వాళ్ళ పై ఆధారపడకుండా ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తూ.. సినిమాల్లోకి వెళ్ళడానికి అవకాశాల కోసం వెతుకులాట మొదలు పెట్టాడు. ఎక్కడ ఆడిషన్స్ జరిగినా జాబ్ కి సెలవు పెట్టి మరి వెళ్ళే వాడు. కానీ, ఒక్కరూ కూడా అతనికి ఛాన్స్ లు ఇవ్వలేదు. ఆఫీసులు చుట్టూ తిరిగిన తర్వాత మనసంతా సినిమాలో నటించే అవకాశం వచ్చింది. అలా ఆ సినిమా హిట్ అయిన కూడా ఎలాంటి అవకాశం రాలేదు. దీంతో , కొంత మందిని కలిసిన తర్వాత తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. సీరియల్స్ లో పాపులర్ అయితే సినిమాల్లో ఛాన్స్ లు ఈజీగా వస్తాయని చెప్పడంతో సీరియల్ ఆఫీసులు చుట్టూ తిరిగాడు. ఈ క్రమంలోనే సాగర్ కు 2003 లో అమృతం సీరియల్లో ఒక చిన్న పాత్ర చేసే అవకాశం వచ్చింది. వచ్చిన ఛాన్స్ ని వదులుకోకూడదని అందులో నటించాడు.
Also Read: Bayya sunny yadav: సన్నీ యాదవ్ పెట్టిన వీడియోలో నిజం లేదంటున్న నా అన్వేష్ ఊరి ప్రజలు
ఇంద్రనీల్ తో సాగర్ స్నేహం
ఇంద్రనీల్ తో మంచి స్నేహం ఏర్పడి కొద్దీ రోజుల్లోనే వీళ్ళు మంచి స్నేహితులుగా మారారు. ఈ క్రమంలోనే ఇంద్రనీల్ చక్రవాకం సీరియల్ కు సాగర్ ను కూడా తీసుకెళ్ళాడు. అక్కడ రైటర్ గా చేస్తున్న బిందు నాయుడితో మంచి స్నేహం పెరిగి, ఆమె అక్క డైరెక్ట్ చేస్తున్న చక్రవాకం లో సాగర్ కు ఒక చిన్న నెగిటివ్ రోల్ ఇప్పించింది. అయితే, ఇతని పాత్ర ఎక్కువ కాలం లేకపోవడంతో అక్కడితో పుల్ స్టాప్ పడింది.
Also Read: Bollywood Heros: చీరలు కట్టిన బాలీవుడ్ హీరోస్.. పాలు పితుకుతున్న అక్షయ్ కుమార్.. వీడియో వైరల్
అతని వల్లే నా లైఫ్ నాశనం అయింది?
మిస్టర్ పర్ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ ఫ్రెండ్ పాత్రలో నటించాడు. కానీ, ఆ సినిమాలో కూడా సాగర్ కు ఎదురు దెబ్బే తగిలింది. అతను ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ బాబీ వల్లే తన లైఫ్ ఇలా అయిందని ఎమోషనల్ అయ్యాడు. అతని మాట వినకపోయి ఉంటే ఈ రోజు నా లైఫ్ చాలా బావుండేదని అన్నాడు.