Bayya sunny yadav : బెట్టింగ్ యాప్స్ తో నా అన్వేష్ , భయ్యా సన్నీ యాదవ్ మధ్య గొడవలు మొదలయ్యాయి. చిన్నగా మొదలైన వీరి గొడవలు పెద్దగా అయ్యాయి. ఇక ఇటీవలే సన్నీ యాదవ్, విశాఖపట్నంలోని సింహాచలం వద్ద నా అన్వేష్ మీద కొన్ని పోస్ట్‌లు పెట్టాడు. “నేనొచ్చేశాను, నీ ఇంటికి వెళ్తా, నీ అమ్మానాన్నకి ధైర్యంగా ఉండమని చెబుతా” అంటూ అన్వేష్‌ను గురించి సోషల్ పోస్ట్ పెట్టాడు. అలాగే, “నువ్వు టెన్షన్ పడకు” అని కూడా కౌంటర్ ఇచ్చాడు. అయితే, రీసెంట్ గా భయ్యా సన్నీ యాదవ్ అన్వేష్ సొంతూరికి వెళ్ళి ఆరోపణలు చేశాడు. దీనిలో ఎంత వరకు నిజముందో ఇక్కడ తెలుసుకుందాం..
Also Read: Thammudu: నలుగురు హీరోయిన్స్ తో తమ్ముడు డైరెక్టర్ రచ్చ.. మహేష్ బాబును బాగా వాడేశారుగా?
ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చూడండి.. నా అన్వేష్ గురించి నమ్మలేని నిజాలను చెబుతాను అంటూ భయ్యా సన్నీ యాదవ్ వీడియో షేర్ చేశాడు. అన్వేష్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి .. అక్కడ మన అన్వేష్ అన్న చేసే బిజినెస్ లు గురించి తెలుసుకుందాం. అన్వేష్ ఊరికి వెళ్ళి.. ఇప్పుడు నేను మీకు ఒక భయంకరమైన నిజాలు చెప్పబోతున్నాను. అన్వేష్ ఊరు వారాడా. 2009 నుంచి 2014 వరకు ఈ ఊరిలోనే ఉన్నారు. వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు వారి దగ్గర ఎలాంటి డబ్బు లేదు. వాళ్ళు ఇక్కడ మద్యం అమ్మే వాళ్ళు. అలా డబ్బు సంపాదించే వాళ్ళని.. ఆధారాలతో సహ భయ్యా సన్నీ యాదవ్ చెప్పాడు. అయితే, ఈ మాటల పై ఊరి ప్రజలు ఫైర్ అవుతున్నారు.
అయితే, భయ్యా సన్నీ యాదవ్ ఊరిలో ఎవర్ని అడిగినా చెబుతారు. నేను ఇద్దరి ముగ్గుర్ని అడిగా కెమెరా ముందు రాలేదని చెప్పాడు. మీకు ఈ ఊరిలో చుట్టాలు ఉంటే అడగండి, వాళ్ళు కూడా చెబుతారంటూ చెప్పాడు. అందరికీ ఎన్ని మాటలు చెప్పాడు? మా నాన్న వాచ్ మ్యాన్ అని? కానీ, వీళ్ళు ఇక్కడ చేసింది, మద్యం వ్యాపారం అంటూ అన్వేష్ గుట్టు మొత్తం బయటపెట్టాడు. మీరు కూడా వచ్చి చూడండి. అన్వేష్ ఎన్ని అబద్ధాలు చెబుతున్నాడు? ఎన్ని నిజాలు చెబుతున్నాడో మీకు కూడా తెలుస్తుందంటూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడాడు.
Also Read: Health Tips: ఎలాంటి పరికరాలు అక్కర్లేదు.. ఇంట్లో ఈ వ్యాయామాలు చేస్తే బెల్లీ ఫ్యాట్ మాయం
అయితే, వీటిలో నిజం లేదని ఆ ఊరి ప్రజలు చెబుతున్నారు. ఒక ట్రావెలర్ అక్కడికి వెళ్ళి ఆ ఊరిలో ఉన్నా ఒక పెద్దాయనను అడగగా.. సన్నీ యాదవ్ అబద్దాలు చెప్పాడని అన్నాడు. బతకడం కోసం ఎవరైన ఏదొక పని చేసుకోవాల్సిందే. అలా వారి కుటుంబం కూడా అలాంటి షాపు పెట్టుకున్నారు. దీనిలో తప్పు పట్టడానికి ఏం ఉంది? తప్పుడు ప్రచారాలు చేయకండి. మీరిద్దరూ ట్రావెలర్స్ .. ఇలా ఒకరి మీద ఒకరు ఎందుకు చెప్పుకోవడం. భయ్యా సన్నీ యాదవ్ మీరు ఇక నుంచైనా ఫేక్ మాటలు మాట్లాడటం మానేయండి అంటూ నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు.