K Raghavendra Rao on Kannappa
ఎంటర్‌టైన్మెంట్

Kannappa: మోహన్ లాల్, ప్రభాసే.. ‘కన్నప్ప’పై దర్శకేంద్రుడి రివ్యూ!

Kannappa: విష్ణు మంచు (Vishnu Manchu) డ్రీమ్ ప్రాజెక్ట్‌గా తెరకెక్కిన ‘కన్నప్ప’ (Kannappa) చిత్రం శుక్రవారం థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్‌తో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సినిమా చూసిన వారంతా ప్రభాస్ ఎంటరైనప్పటి నుంచి సినిమా గ్రాఫ్ అమాంతం లేచిందని, అలాగే క్లైమాక్స్ పార్ట్‌లో మంచు విష్ణు చక్కని నటనను కనబరిచారని అంటున్నారు. ఫస్టాఫ్‌పై కాస్త నెగిటివ్‌గా రియాక్ట్ అవుతున్నా, సెకండాఫ్ ఇచ్చిన హై తో.. ప్రస్తుతానికైతే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తుంది. తాజాగా ఈ మూవీ చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు (K Raghavendra Rao) తనదైన స్టైల్లో ఈ సినిమాకు రివ్యూ ఇచ్చారు. ముఖ్యంగా ప్రభాస్, మోహన్ లాల్‌తో పాటు మంచు విష్ణు నటనను కూడా ఆయన కొనియాడారు. మంచు విష్ణు కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడనేలా.. పొగడ్తలు కురిపించారు. ఇంతకీ దర్శకేంద్రుడు ఏమన్నారంటే..

Also Read- Manchu Vishnu: రామ్ గోపాల్ వర్మ మెసేజ్‌తో దాదాపు ఏడ్చేసిన మంచు విష్ణు.. మరీ ఇలానా టీజ్ చేసేది?

‘‘అందరికీ నమస్కారం. ఇప్పుడే దుబాయ్‌లో ‘కన్నప్ప’ చూశాను. వండర్ ఫుల్ విజువల్ ఫీస్ట్. ఫస్టాఫ్ అంతా న్యూజిలాండ్ షాట్స్‌తో విజువల్ ఫీస్ట్‌లాగా ఉంది. అసలు సినిమా మోహన్ లాల్ ఎంట్రీ, ప్రభాస్ ఎంట్రీ నుంచి మంచి ఎమోషన్స్‌తో, మంచి సెంటిమెంట్‌తో సాగింది. పర్టిక్యులర్‌గా మంచు విష్ణు తన కెరీర్‌లోనే బెస్ట్ పెర్ఫార్మెన్స్ చేశాడనే రీతిలో క్లైమాక్స్ సీన్ చాలా బాగా చేశాడు. మోహన్ బాబు లాస్ట్‌లో పాడిన పాట కూడా అద్భుతంగా ఉంది. ఆల్ ద బెస్ట్ టు ఎంటైర్ టీమ్. మోహన్ బాబుకు, వాళ్ల కుటుంబానికి నా శుభాకాంక్షలు’ అని దర్శకేంద్రుడు కె. రాఘవేంద్రరావు ‘కన్నప్ప’ సినిమాపై తన రివ్యూని ఇచ్చారు. ప్రస్తుతం దర్శకేంద్రుడు మాట్లాడుతున్న ఈ వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

Also Read- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ

అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వలో తెరకెక్కిన ఈ సినిమాలో భారీ తారాగణం నటించింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్, ప్రభాస్, ముఖేష్ రిషి, కాజల్ అగర్వాల్, ప్రీతి ముకుందన్, మధుబాల, బ్రహ్మానందం, సప్తగిరి వంటి వారంతా ఈ సినిమాలో భాగమయ్యారు. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న టాక్‌తో చిత్రయూనిట్ హ్యాపీగా ఉంది. ఈ మేరకు యూనిట్ థ్యాంక్స్ మీట్‌ని కూడా నిర్వహించి, ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. ఈ థ్యాంక్స్ మీట్‌లో మంచు విష్ణు మాట్లాడుతూ.. దాదాపు తనకు వెయ్యికి పైగా వాట్సప్ మెసేజ్‌లు వచ్చాయని, వాటన్నింటికీ ఆన్సర్ ఇవ్వాలని పేర్కొన్నారు. ముఖ్యంగా 13 సంవత్సరాల తర్వాత కింగ్ నాగార్జున (King Nagarjuna) తనకు ఫోన్ చేసి, అభినందించారని పేర్కొన్నారు. త్వరలోనే ఆయన సినిమా చూస్తానని తనకు చెప్పినట్లుగా మంచు విష్ణు చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?