Actress Pakeezah and AP Ministers
ఎంటర్‌టైన్మెంట్

Actress Pakeezah: తమిళనాడు ఆధార్ ఉంది.. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎం ఆదుకోండి!

Actress Pakeezah: నటీనటులు ఎవరైనా సరే.. ఎంత స్టార్‌డమ్ ఉన్నా సరే.. తమ నటనకు వచ్చిన రెమ్యునరేషన్‌ని విలాసాలకు, స్నేహితులకు ఖర్చు పెట్టకుండా.. నాలుగు రాళ్లు వెనకేసుకుంటేనే, తర్వాత రోజుల్లో గౌరవం ఉంటుంది. అలా చేయని పక్షంలో కష్టాలు పడకతప్పదు. అడిగినకాడికి సాయాలు, దానాలు చేసి.. చివరి రోజుల్లో మహానటి సావిత్రి ఎలాంటి ధీన స్థితిని అనుభవించిందో అందరికీ తెలుసు. ఒక్క సావిత్రి అనే కాదు, కాంతారావు, ఎస్వీఆర్.. ఎలా ఎందరో మహానుభావులు చివరి రోజుల్లో కష్టాలు అనుభవించి, తినడానికి తిండిలేక అలమటించి చనిపోయారు. సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి జాబితా చాలానే ఉంటుంది. కానీ ఆ రోజుల్లో.. వచ్చిన డబ్బుతో భూమి, ఇతరత్రా కొనుక్కున్న వారంతా ఈ రోజు హాయిగా, ఏ లోటు లేకుండా జీవిస్తున్నారు. సావిత్రి వంటి నటీమణుల జీవితం గుణపాఠం అయితే, విలాసాలకు పోకుండా డబ్బును పొదుపు చేసుకున్న శోభన్ బాబు వంటి వారి జీవితం ఎందరికో ఆదర్శం అని చెప్పుకోవాలి. ఇక విషయంలోకి వస్తే.. లేడీ కమెడియన్ పాకీజా ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోయింది. ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలను సహాయం చేయమని ఆమె అభ్యర్థిస్తోంది.

Also Read- Kolli Veera Prakash Rao: అక్క బాటలోనే తమ్ముడు.. కళ్లు చిరంజీవి ఐ బ్యాంక్‌కి.. భౌతిక కాయం అపోలో ఆసుపత్రికి!

తాజాగా ఆమె తన కష్టాన్ని తెలుపుతూ మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో.. ‘ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుగారికి (AP CM Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌గారికి (AP Deputy CM Pawan Kalyan) నమస్కారం. నేనే పాకీజామ్మ. పాత కామెడీ యాక్టర్‌ని మాట్లాడుతున్నాను. నేను చాలా కష్టాల్లో ఉన్నాను. మూడు సంవత్సరాలుగా నేను కష్టాలను అనుభవిస్తున్నాను. సినిమాలు లేవు, టీవీ షూటింగ్స్ లేవు. తమిళనాడులోని మా సొంత ఊరు కారైకుడి‌కి వచ్చి బతుకుతున్నాను. పల్లెటూరుకు వచ్చేశాను. చాలా కష్టంలో ఉన్నాను. నేను రెండు సార్లు విజయవాడ వచ్చాను. ముఖ్యమంత్రిని కలవడం చాలా కష్టమైపోయింది. డిప్యూటీ సీఎంను కూడా నేను కలవలేదు. దయచేసి నాకు నెల నెల పెన్షన్ వచ్చేందుకు తమిళనాడు ఆధార్ ఉంది. ఆ ఆధార్ పెట్టి ఏదైనా నాకు సహాయం చేయండి. సీఎం, డిప్యూటీ సీఎం కాళ్లు పట్టుకుంటున్నాను. చాలా కష్టంలో ఉన్నాను. నాకు పిల్లలు లేరు, భర్త లేడు.. ఎవరూ లేరు, అనాథగా ఉంటున్నాను. సహాయం అంటే నాకు డబ్బులివ్వడం కాదండి. నా దగ్గర తమిళనాడు ఆధార్ ఉంది. ఆ ఆధార్‌పై ఏపీ తరపున ఏదైనా సహాయం చేయండి. మీ కాళ్లు పట్టుకుని వేడుకుంటున్నాను’’ అని పాకీజా ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమెను ఆదుకోవాలని నెటిజన్లు కూడా ఏపీ ప్రభుత్వానికి సూచనలిస్తున్నారు.

Also Read- Star Actress: ఆ నిర్మాత నాతో చాలా దారుణంగా ప్రవర్తించాడు.. స్టార్ హీరోయిన్ సంచలన కామెంట్స్

పాకీజా విషయానికి వస్తే.. ఆమెను తెలుగు సినిమా ఇండస్ట్రీకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు పరిచయం చేశారు. బ్రహ్మానందం సరసన ఆమె ఒకప్పుడు మంచి పెయిర్‌గా నటించింది. ‘అసెంబ్లీ రౌడీ’ సినిమాలో బ్రహ్మానందం, పాకీజా కామెడీ అందరినీ కడుపుబ్బా నవ్విస్తుంది. తమిళనాడులో కూడా ఆమెకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంది. మరి అలాంటి నటి, ఇప్పుడిలా అయిపోవడానికి కారణం ఏమిటనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. పాకీజా పరిస్థితి ఉంది. మరి ఆమెకు ఏపీ ప్రభుత్వం ఏమైనా సాయం చేస్తుందేమో చూద్దాం.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!