Minister Ponnam Prabhakar: గ్రేటర్ హైదరాబాద్ లో మేయర్ సీటును కైవసం చేసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prabhakar) పేర్కొన్నారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ మేయర్ సీటు కోసం ఇప్పట్నుంచే ప్రణాళికను ఫిక్స్ చేయాలన్నారు. నేతలంతా యాక్టివ్ గా పనిచేయాలని సూచించారు. జూబ్లీహిల్స్(jublihills) లో కాంగ్రెస్(Congress) జెండా తప్పనిసరిగా ఎగురవేయాల్సిందేనని నొక్కి చెప్పారు. పార్టీ కూడా మంచి అభ్యర్ధికి టిక్కెట్ ఇస్తుందని, నేతలంతా సమన్వయంగా పనిచేసి కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలన్నారు. జూలై 4 వ తేదీన ఏఐసీసీ(AICC) అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే హైదరాబాద్(Hyderabad) లో పర్యటిస్తున్న సందర్భంగా సభను విజయవంతం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. హైదరాబాద్ లో ఉన్న అన్ని నియోజకవర్గాల నుండి ముఖ్య నేతలు సభలో పాల్గొనాలన్నారు.
ప్రోటోకాల్ ఇష్యూస్ లేకుండా చర్యలు
హైదరాబాద్ నాయకత్వం సభ ఏర్పాట్ల పై చురుకుగా పాల్గొనాలన్నారు. హైదరాబాద్ జిల్లాలో కొన్ని సమస్యలు ఉన్నాయని, పార్టీకి సంబంధించిన ఇష్యూస్ తన దృష్టికి వచ్చినట్లు ఆయన వివరించారు. వాటన్నింటినీ వెంటనే పరిష్కరిస్తానని మంత్రి హామీ ఇచ్చారు. దేవాలయ కమిటీలు ,కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ చెక్కులు పంపిణీ ,బోనాల చెక్కుల పంపిణీ లపై తాను మానిటరింగ్ చేస్తున్నానని, త్వరలోనే చిన్న సమస్యలన్నీ పరిష్కరించబడతాయన్నారు. ఇక ప్రోటోకాల్ ఇష్యూస్ లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. క్షేత్ర స్థాయిలో పార్టీ కోసం కష్టపడుతున్న వారికి తప్పనిసరిగా నామినేటెడ్ పోస్టులు వచ్చేలా కృషి చేస్తానన్నారు. గ్రౌండ్ లెవల్ లో పనిచేసినోళ్లకు పార్టీ ఆధరిస్తుందన్నారు.
Also Read: GHMC Commissioner: ఇక డిప్యూటీ కమిషనర్ల వంతు.. త్వరలో ఉత్తర్వులు
సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్నాం
కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Govt) పవర్ లోకి రావడాన్ని బీఆర్ఎస్(BRS) జీర్ణించుకోలేకపోతుందన్నారు. పదేళ్లలో చేయని పనులు, డెవలప్ చేస్తూంటే ఓర్వలేకపోతున్నారన్నారు. తాజాగా ప్రభుత్వ ఉద్యోగులు ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి వివరించారు. కానీ ప్రజల సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతున్న ప్రభుత్వ ఉద్యోగులను బీఆర్ఎస్(BRS) రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందన్నారు. ఆర్థిక సంక్షోభం ఉన్నా తమ ప్రభుత్వం ఆచరణలో చూపెడుతుందన్నారు. ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి అనుగుణంగా ముందుకు పోతుందన్నారు. నిరంకుశత్వంగా పరిపాలించి రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారన్నారు. ప్రతిపక్ష బాధ్యతలు వదిలి ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చకొట్టేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తుందని మండిపడ్డారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు ఎక్కడి వరకైనా పోరాటానికి రెడీ అంటూ మంత్రి పొన్నం సవాల్ విసిరారు.
Also Read: Badi Bata Program: మూతబడిన 26 స్కూళ్లు రీ ఓపెనింగ్.. బడి బాట సక్సెస్