MP Raghunandan Rao: రెండు రోజుల క్రితం యశోద హాస్పిటల్(Yashoda Hospital)లో కాలికి శాస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న ఎంపీ రఘునందన్ రావు(MP Raghunandan Rao)కు మళ్ళీ బెదిరింపులు కాల్స్ మొదలయ్యాయి, 9489556347, 7365035440 రెండు వేరు వేరు నెంబర్స్ నుండి బెదిరింపులు మొదలయ్యాయి, ఆంధ్రప్రదేశ్(AP) మావోయిస్టు కమిటీ ఆదేశాల మేరకు మిమల్ని చంపడానికి 5 బృందాలు రంగంలోకి దిగాయని, మా ఫోన్స్ ట్రేస్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారని, తమ సమాచారం దొరకదని, తాము ఇంటర్నెట్ కాల్స్(Internet Calls) వాడుతున్నామని ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టబోమని బెదిరించడం జరిగింది. దీంతో రఘునందన్ రావు హాస్పిటల్ నుండే పోలీసులకు ఫిర్యాదు చేయశారు.
గతంలోను బెదిరింపులు
ఇంతకముందు, జూన్ 23న కూడా రఘునందన్ రావుకు ఇలాంటే బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. దాంతో ఆయన వెంటనే ఈ విషయాన్ని తెలంగాణ డీజీపీతో పాటు, సంగారెడ్డి మరియు మెదక్ జిల్లా ఎస్పీలకు ఫిర్యాదు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో పోలీసులు సీరియస్ అయ్యారు. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టి, రఘునందన్ రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని పోలీసులు గుర్తించారు. తక్షణమే మెదక్ జిల్లా పోలీసులకు భద్రత పెంచాలని గతంలో ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Man Suicide Attempt: డబల్ బెడ్ రూమ్ ఇల్లు మంజూరు చేయలేదని వ్యక్తి హల్చల్
ఆపరేషన్ కగార్
ఇదిలా ఉండగా, నేడు నిజామాబాద్‌లో పసుపు బోర్డు ప్రారంభం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా(Amit shah) తెలంగాణలో పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే రఘునందన్ రావుకు మావోయిస్టుల బెదిరింపు కాల్స్ రావడం వలన రాజకీయంగా కలకలం రేపుతోంది. ఈ ఘటనపై అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వెంటనే ఇ కాల్ పై పోలీసులు(Police) అలెర్ట్ అయ్యారు. ఆపరేషన్ కగార్(Operation Khagar) ద్వారా మావోయిస్టులకు కేంద్రం ఘాటు హెచ్చరికలు దేశంలోని మావోయిస్టు వ్యాప్తి చెందిన రాష్ట్రాల్లో కేంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన ఆపరేషన్ కగార్ మావోయిస్టుల నిర్మూలనకు కేంద్రం తీసుకొచ్చింది. అటవీ ప్రాంతాల్లో దాగిఉన్న మావోయిస్టుల మిస్టుల గూళ్లను ఛేదించడం, అణచివేత చర్యలు తీసుకోవడం, అవకాశాలున్నప్పుడు ఎన్‌కౌంటర్ల ద్వారా కీలక నేతలను లక్ష్యంగా చేసుకోవడం వంటి పద్ధతుల్లో ఈ ఆపరేషన్ అమలు చేస్తున్నారు.
Also Read: GHMC Commissioner: ఇక డిప్యూటీ కమిషనర్ల వంతు.. త్వరలో ఉత్తర్వులు