Jagan On Lokesh
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

YS Jagan: మంత్రి లోకేష్‌పై వైఎస్ జగన్ అనుచిత వ్యాఖ్యలు!

YS Jagan: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ (Nara Lokesh) వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ శాఖలో ఎందుకో ఎప్పుడూ ఏదో ఒక గోల నడుస్తూనే ఉంటుంది. ఇప్పటికే పలు ఫలితాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వంపై ఏ రేంజిలో వ్యతిరేకత వచ్చిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తాజాగా వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) ఎక్స్ వేదికగా స్పందిస్తూ లోకేష్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మంచిగా, మర్యాదగా చెబుతూనే అనాల్సిన మాటలన్నీ అనేశారు జగన్. దీంతో ప్రస్తుతం మాజీ సీఎం వర్సెస్ టీడీపీగా పరిస్థితులు నెలకొన్నాయి. ‘ రాష్ట్రంలో విద్యావ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైందనడానికి ఏపీఈసెట్‌ అడ్మిషన్లే పెద్ద ఉదాహరణ. ఈసెట్‌ రిజల్ట్స్‌ వచ్చి దాదాపు 45 రోజులు అవుతున్నా ఇప్పటికీ కౌన్సిలింగ్‌ ప్రారంభం కాలేదు. మరోవైపు రేపటి నుంచి ఇంజినీరింగ్‌ విద్యార్థులకు క్లాసులు ప్రారంభం అవుతున్నాయి. ఇంజినీరింగ్ రెండో ఏడాదిలో అడ్మిషన్లకోసం 34వేల మంది పాలిటెక్నిక్‌ విద్యార్థులు ఈసెట్‌ పరీక్షలు రాస్తే అందులో 31,922 మంది ఉత్తీర్ణత సాధించారు. గతనెల మే 15న ఫలితాలు వెలువడినా, ఇప్పటికీ కౌన్సెలింగ్‌ ప్రక్రియపై షెడ్యూల్‌ విడుదలచేయకపోవడం, ఆ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభం కాకపోవడం, విద్యావ్యవస్థలో నెలకొన్న దారుణ పరిస్థితులకు మరో నిదర్శనం. అమాత్యా మేలుకో.. పప్పూ నిద్ర వదులు’ అని లోకేష్‌పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆ చివరి లైన్ ఏదైతే ఉందో.. అబ్బో ఇలా కూడా కామెంట్స్ చేస్తారా? అంటూ టీడీపీ కార్యకర్తలు, నేతలు మండిపడుతున్నారు. తమరికి చేతనైతే సలహాలు ఇవ్వాలే తప్ప ఇలా ఇష్టానుసారం మాట్లాడటం ఎంతవరకూ సబబు? అని మండిపడుతున్నారు.

Read Also- Celebrity Wedding: నాలుగో పెళ్లి చేసుకున్న టాలీవుడ్ నటి.. ఎగిరిగంతులేస్తున్న భర్త? వీడియో వైరల్

APECET

రూటు మార్చినట్టేనా..?
వాస్తవానికి వైఎస్ జగన్ ఇలా కామెంట్స్ చేయడం చాలా అరుదు. చాలా సామరస్యంగా, మర్యాదపూర్వకంగానే మాటలు, సోషల్ మీడియా పోస్టులు చేస్తుంటారు. అలాంటిది సడన్‌గా ఇలా ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంతో జగన్ పూర్తిగా రూట్ మార్చేశారంటూ వైసీపీ కార్యకర్తలు ఒకింత హ్యాపీగా ఫీలవుతున్నారు. దీన్నే అదనుగా చేసుకున్న వైసీపీ వీరాభిమానులు ఇక చూస్కోండి చిత్రవిచిత్రాలుగా కామెంట్స్ చేసేస్తున్నారు. ‘ ఈ సంవత్సర కాలంలో విద్యావ్యవస్థ ఎంత నాశనం కావాలో అంతా నాశనం అయింది లోకేష్ ఇంకనైనా మేలుకో’ అని కొందరు కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు. ‘ సార్ ఎంత కాలానికి పప్పూ అని పిలిచారు. మీరు అడ్రస్ చేస్తున్న సమస్యలు చాలా కరెక్ట్. మా వైఎస్ఆర్ (YSR) గారిలా వారంలో ఒకటి లేదా రెండు రోజులు ప్రజలతో ముఖాముఖీ నిర్వహించి, కలిస్తే ప్రజలు ఇంకా దగ్గరవుతారు. ఎదుటి వారి వ్యూహాలు తెలుస్తాయి’ అని మరికొందరు జగన్‌కు సలహాలు ఇస్తున్నారు. అయితే టీడీపీ కార్యకర్తలు, లోకేష్ వీరాభిమానులు కూడా ఏ మాత్రం తగ్గట్లేదు. వైసీపీకి, ఆ పార్టీ కార్యకర్తలకు గట్టిగానే ఇచ్చిపడేస్తున్నారు. తమ యువనేతనే పప్పు అంటారా? అంటూ జగన్‌ను గన్నేరు పప్పు అని కార్యకర్తలు పిలుస్తున్నారు. ‘ గన్నేరు పప్పు గారు.. బెంగళూరు ప్యాలెస్‌లో పడుకుని ట్వీట్లు వేస్తున్నారా?’ అని స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చారు. కొందరేమో జాతిరత్నాలు సినిమాలో కోర్టు సీన్లు గుర్తు చేసుకుంటున్న పరిస్థితి.

Lokesh Vs Jagan

రియాక్షన్ ఎలా ఉంటుందో?
ఈ ట్వీట్‌పై ఇంతవరకూ లోకేష్ స్పందించలేదు. అయితే ఆయన రియాక్షన్ ఎలా ఉంటుంది? జగన్‌కు ఎలా కౌంటర్ ఇస్తారు? తనను పప్పు అన్న కామెంట్స్‌పై రివర్స్ ఎటాక్ ఎలా ఉండబోతోంది? అనేదానిపై అటు టీడీపీలో.. ఇటు వైసీపీలోనూ కార్యకర్తలు, వీరాభిమానులు ఎదురుచూపుల్లో ఉన్నారు. ఇక లోకేష్ చివరిగా చేసిన ట్వీట్ల విషయానికొస్తే.. ‘ప్రభుత్వ పాఠశాలలవైపు.. పిల్లల చూపు’ అని ఓ కథనం.. ‘పేదింట సాహితీ కెరటం’ అంటూ పోస్టులు చేసి ఓ ప్రముఖ దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఈ ట్వీట్‌కు జోడించారు. ‘ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విద్యారంగంలో మార్పు మొదలైంది. విద్యావ్యవస్థలో సమూల ప్రక్షాళన కోసం ఏడాదికాలంగా నేను చేపట్టిన సంస్కరణలు సత్ఫలితాలు ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది. నక్కపల్లి మండలం దేవవరంలో ఒకేరోజు 32మంది విద్యార్థులు ప్రైవేటు స్కూళ్ల నుంచి ప్రభుత్వ మోడల్ ప్రైమరీ పాఠశాలకు మారడం హర్షణీయం. ఏపీ మోడల్ ఎడ్యుకేషన్ కోసం నేను చేస్తున్న కృషిలో భాగస్వాములుగా నిలుస్తున్న అధికారులు, ఉపాధ్యాయులు, తలిదండ్రులకు మనస్పూర్తిగా అభినందనలు’ అని లోకేష్ ట్వీట్ చేశారు.

Read Also- Ram Charan: రాజకీయాల్లోకి రామ్ చరణ్.. ఇంత హడావుడి వెనుక..!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?