Kolli Veera Prakash Rao: ఇటీవల మురళీ మోహన్ (Murali Mohan) భావోద్వేగానికి గురైన ఓ ఘటన జరిగిన విషయం తెలిసిందే. మురళీ మోహన్ పర్సనల్ మేకప్‌మ్యాన్ కొల్లి రాము (Kolli Ramu) సోదరి కళ్లను, భౌతిక కాయాన్ని డొనేట్ చేయడంతో.. దాదాపు ఆయన కన్నీటి పర్యంతమయ్యారు. ఇంత గొప్ప నిర్ణయం తీసుకున్న తన మేకప్‌మ్యాన్‌ని మురళీ మోహన్ ఎంతగానో అభినందించారు. ఎందరికో ఆదర్శప్రాయుడిగా నిలిచిన కొల్లి రాముని కొనియాడారు. ఇప్పుడు సేమ్ టు సేమ్ మరోసారి కొల్లి రాము ఫ్యామిలీ గొప్ప మనసును చాటుకుంది. కొల్లి రాముకు అన్నయ్య అయిన కొల్లి వీర ప్రకాశరావు (84) మృతి చెందగా, ఆయన కళ్లను చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంక్‌కి (Chiranjeevi Eye and Blood Bank), భౌతిక దేహాన్ని అపోలో ఆసుపత్రికి (Apollo Hospitals) డొనేట్ చేశారు.
Also Read- Thammudu: నలుగురు హీరోయిన్స్ తో తమ్ముడు డైరెక్టర్ రచ్చ.. మహేష్ బాబును బాగా వాడేశారుగా?
నిజంగా తెలుగు చిత్ర పరిశ్రమలో వ్యక్తుల మధ్య అనుబంధాలకు, ఆత్మీయతలకు నిదర్శనంగా నిలిచే ఘటన ఇది. నటుడు, నిర్మాత మురళీమోహన్‌తో ఐదు దశాబ్దాల అనుబంధం కలిగి, ఆయన జయభేరి రియల్ ఎస్టేట్ సంస్థలో సైట్ మేనేజర్‌గా పని చేస్తున్న కొల్లి వీర ప్రకాశరావు (Kolli Veera Prakash Rao) మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కొల్లి వీర ప్రకాశరావు ఎవరో కాదు.. మురళీమోహన్ పర్సనల్ మేకప్‌మ్యాన్ అయిన కొల్లి రాముకు స్వయానా అన్నయ్య. మురళీమోహన్ హీరోగా పరిచయమైన ‘జగమే మాయ’ చిత్రానికి మేకప్ డిపార్ట్‌మెంట్‌లో అప్రెంటిస్‌గా చేరిన కొల్లి రాము.. గత 50 సంవత్సరాలకు పైగా ఆయన వద్దే పనిచేస్తున్నారు. ఆ అనుబంధంతోనే రాము అన్నయ్య వీర ప్రకాశరావుకు తమ జయభేరి రియల్ ఎస్టేట్‌లో సైట్ మేనేజర్‌గా ఉద్యోగం ఇచ్చారు మురళీమోహన్. ఈయన కుమారుడు దుర్గా ప్రసాద్ చిత్ర పరిశ్రమలో కెమెరామెన్‌గా స్థిరపడ్డారు.
Also Read: Kannappa Movie: ప్రభాస్ వచ్చినప్పుడు కాదు.. నా సీన్ నుంచే సినిమా లేచింది.. విష్ణు కామెంట్స్!
ఇటీవల కామెడీ హీరో ధనరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘రామం రాఘవం’ (Ramam Raghavam) చిత్రానికి దుర్గా ప్రసాద్ కెమెరామెన్‌గా పనిచేశారు. కాగా, కొల్లి వీర ప్రకాశరావు కళ్ళను చిరంజీవి ఐ అండ్ బ్లడ్ బ్యాంకుకు, భౌతిక కాయాన్ని అపోలో ఆసుపత్రికి డొనేట్ చేశారు. వీరి ఫ్యామిలీలో ఆ మధ్య మృతి చెందిన వీరి అక్కయ్య కళ్ళను, భౌతిక కాయాన్ని కూడా ఇలాగే డొనేట్ చేయటం చూస్తుంటే.. ఆ కుటుంబ సభ్యుల సామాజిక బాధ్యతకు నిదర్శనంగా నిలుస్తున్నారని చెప్పుకోవాలి. ఇదిలా ఉంటే.. తనతో, తమ జయ భేరి సంస్థతో సుదీర్ఘ అనుబంధం కలిగిన కొల్లి వీర ప్రకాశరావు మృతి పట్ల మురళీమోహన్ తీవ్ర విచారాన్ని వ్యక్తం చేశారు. ఒక గొప్ప వ్యక్తిని, కుడి భుజం లాంటి మంచి మనిషిని కోల్పోయినట్లుగా ఆయన దిగ్భాంతిని వ్యక్తం చేశారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు