Andhra Public
ఆంధ్రప్రదేశ్, లేటెస్ట్ న్యూస్

Andhra Pradesh: ఏపీ ప్రజలకు తీపికబురు.. ఇకపై ఇంటికి నేరుగా..!

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా శనివారం ఒక్కరోజే మూడు శుభావార్తలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో వంద శాతం రక్షిత తాగునీరు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. గత ప్రభుత్వం నిర్లక్ష్యంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు మధ్యలోనే నిలిచిపోయాయని అన్నారు. ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు వద్ద మున్సిపల్ శాఖపై సమీక్ష జరిగింది. ఈ సమీక్షకు నారాయణతో పాటు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ఉన్నతాధికారులు హాజరయ్యారు. సమీక్ష ముగిసిన తర్వాత నారాయణ మీడియాతో మాట్లాడుతూ.. మున్సిపాలిటీల్లో ప్రధానంగా ప్రజలంతా కోరుకునేది స్వచ్ఛమైన తాగునీరు, పారిశుధ్యం, వీధి దీపాలు ఆ తర్వాత మంచి రోడ్లు,పార్కులను కోరుకుంటారన్నారు. 2014-19 మధ్య కాలంలో మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనుల కోసం కేంద్రం నుంచి అనేక నిధులను తీసుకొచ్చాం. ఆసియా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (AIIB) నుంచి రూ.5,800 కోట్లు, స్వచ్ఛ భారత్ నుంచి రూ.3వేల కోట్లు విడుదలకు ఆమోదం తీసుకున్నాం. అయితే గత ప్రభుత్వం రాష్ట్ర వాటా నిధులు విడుద‌ల చేయ‌క‌పోవ‌డంతో ఆ నిధులు మ‌ధ్యలోనే నిలిచిపోయాయి. తిరిగి గ‌త ఏడాదిగా ఎన్ని క‌ష్టాలున్నప్పటికీ ఒక్కొక్కటిగా ప‌రిష్కరించుకుంటూ మ‌ళ్లీ నిధులు తీసుకొచ్చే ప్రయ‌త్నం చేస్తున్నాం. ఇప్పటికే అమృత్ స్కీం నిధుల‌కు గ్రీన్ సిగ్నల్ వ‌చ్చింది అని నారాయణ వెల్లడించారు.

Read Also- Ram Charan: రాజకీయాల్లోకి రామ్ చరణ్.. ఇంత హడావుడి వెనుక..!

ఇటు టెండర్లు.. అటు ప్లాంట్‌లు
ఈ ప‌థ‌కానికి సంబంధించి మంచి నీటి పైప్ లైన్ల కోసం టెండ‌ర్లు పిలిచాం. ఈ ప‌నులు పూర్తయితే 85 శాతం ఇళ్లకు నేరుగా తాగునీరు అందుతుంది. అయితే బోర్ల నుంచి వ‌చ్చే నీరు కాకుండా న‌దులు, కాలువ‌ల ద్వారా ఈ నీటిని ఇళ్లకు స‌ర‌ఫ‌రా చేస్తాం. మ‌రోవైపు ఆసియ‌న్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ బ్యాంక్ నుంచి వ‌చ్చే రూ.5,350 కోట్లతో మిగిలిన డ్రింకింగ్ వాట‌ర్ పైప్ లైన్లు, డ్రైనేజి పైప్ లైన్లు పూర్తి చేస్తాం. ఇవ‌న్నీ పూర్తయితే రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీల్లో వంద‌శాతం ఇళ్లకు ర‌క్షిత నీరు అందుతుంది. ఈ నిధుల‌కు సంబంధించి రాష్ట్ర వాటా ఇచ్చేలా చంద్రబాబు ఆర్ధిక శాఖ‌కు ఆదేశాలు ఇచ్చారు. ఇక శుద్ది చేసిన నీటిని డ్రైనేజిల్లోకి వ‌దిలేలా ఎస్టీపీల‌ను కూడా 2029కి పూర్తి చేస్తాం. మ‌రోవైపు రాష్ట్రంలో ప్రతిరోజూ 8000 ట‌న్నుల ఘ‌న వ్యర్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. వీటి నుంచి విద్యుత్ ఉత్పత్తి త‌యారుచేసేలా చ‌ర్యలు తీసుకుంటున్నాం. రాష్ట్రంలో 2014-19 మ‌ధ్య కాలంలో 10 వేస్ట్ టు ఎన‌ర్జీ ప్లాంట్‌లు నెల‌కొల్పాల‌ని నిర్నయించామ‌ని, అయితే ప్రస్తుతం గుంటూరు, విశాఖ‌లో మాత్రమే రెండు ప్లాంట్‌లు అందుబాటులోకి వ‌చ్చాయి. మ‌రో ఆరు ప్లాంట్‌లు త్వర‌లో ఏర్పాటుచేస్తాం అని నారాయణ మీడియాకు తెలిపారు.

మరో శుభవార్త..
ఈ ఆరింటిలో రాజ‌మండ్రి, నెల్లూరు ప్లాంట్‌ల‌కు ఇప్పటికే టెండ‌ర్లు పూర్తయ్యాయి. క‌డ‌ప‌, క‌ర్నూలు, విజ‌య‌వాడ‌, తిరుప‌తిలో ప్లాంట్ల ఏర్పాటుకు త్వర‌లో టెండ‌ర్లు పిలుస్తాం. ఈ ప్లాంట్‌ల‌న్నీ అందుబాటులోకి వ‌స్తే 7500 ట‌న్నుల చెత్త ప్రతిరోజూ విద్యుత్‌గా మారుస్తామ‌ని, మ‌రో 500 ట‌న్నుల చెత్తను వివిధ రూపాల్లో నిర్వహిస్తాం. మ‌రోవైపు గ‌త ప్రభుత్వం వ‌దిలేసి వెళ్లిన 85 ల‌క్షల మ‌ట్రిక్ ట‌న్నుల లెగ‌సీ వేస్ట్‌ను వ‌చ్చే అక్టోబ‌ర్ రెండో తేదీ నాటికి పూర్తిగా తొల‌గిస్తాం. మున్సిపాల్టీల్లో పారిశుద్య నిర్వహ‌ణ కోసం కాంపాక్టర్లు, స్వీపింగ్ మెషీన్ల కొనుగోలు కోసం 225 కేటాయించాం. 2014-19 మ‌ధ్య కాలంలో 5 ల‌క్షల టిడ్కో ఇళ్ల నిర్మాణానికి ప‌నులు ప్రారంభించ‌గా, గ‌త ప్రభుత్వం వాటిని 2,60,000కు త‌గ్గించేసింది. ఇళ్లను ల‌బ్దిదారుల‌కు కేటాయించ‌కుండానే లోన్లు తీసుకోవ‌డంతో నాన్ పేమెంట్ కేట‌గిరీలోకి వెళ్లిపోవ‌డంతో సుమారు రూ.140 కోట్లను ఈ ప్రభుత్వం చెల్లించాల్సి వ‌చ్చింది. త్వర‌లోనే టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ల‌బ్దిదారుల‌కు అంద‌జేస్తాం. మున్సిపాల్టీల్లో ఇంజినీరింగ్ అవుట్ సోర్సింగ్ కార్మికుల స‌మ్మెపై మంత్రివ‌ర్గ ఉప‌సంఘంలో చ‌ర్చించి నిర్ణయం తీసుకుంటాం అని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.

Read Also- Kethireddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూల్చేస్తారా.. సీన్ రివర్స్!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు