Pedda Reddy House
ఆంధ్రప్రదేశ్

Kethireddy: కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇల్లు కూల్చేస్తారా.. సీన్ రివర్స్!

Kethireddy: తాడిపత్రి కింగ్ నేనే.. మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ 2019 నుంచి 2024 వరకూ కేతిరెడ్డి పెద్దారెడ్డి (Kethireddy Peddareddy) వ్యవహరించారు. 2024 ఎన్నికల్లో కేతిరెడ్డి ఓడిపోవడం, వైసీపీ కూడా ఘోర పరాజయం పాలవ్వడంత్ సీన్ మొత్తం రివర్స్ అయ్యింది. సీన్ కట్ చేస్తే.. అవన్నీ ఇప్పుడు రివర్స్ అవుతున్నాయి. ఎంతలా అంటే కనీసం తాడిపత్రిలోని తన సొంత ఇంటికి వెళ్లలేని పరిస్థితిలో కేతిరెడ్డి ఉన్నారు. అంతేకాదు.. ఆయన వెళ్లాలని ప్రయత్నించిన ప్రతిసారీ పోలీసులు జోక్యం చేసుకుంటున్నారు. ఈ దెబ్బతో తాడిపత్రిలో (Tadipatri) అసలు వైసీపీ ఉందా..? క్యాడర్‌కు పెద్ద దిక్కు ఉందా? అని అభిమానులు, కార్యకర్తలు ఆలోచనలో పడిన పరిస్థితి. ఒక్క మాటలో చెప్పాలంటే.. నాడు ఎంతలా అయితే కేతిరెడ్డి హడావుడి చేశారో ఇప్పుడు అంతకుమించి వడ్డీతో సహా టీడీపీ సీనియర్ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy) తిరిగి ఇచ్చేస్తున్నారు. అటు అడుగడుగునా జేసీ బ్రేకులు వేస్తుండటం.. ఇటు కార్యకర్తలో తీవ్ర అసంతృప్తితో రగిలిపోతుండటంతో దిక్కుతోచని స్థితిలో కేతిరెడ్డి పడ్డారని తెలుస్తున్నది. సరిగ్గా ఈ క్రమంలోనే.. పెద్దారెడ్డి ఇల్లు కూల్చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఒక్కసారిగా వార్తలు గుప్పుమన్నాయి. దీనికితోడు మున్సిపల్ శాఖ అధికారులు రంగంలోకి దిగడంతో ఈ వార్తలకు ప్రాధాన్యత సంతరించుకున్నది.

Read Also- Rapido: చంద్రబాబు చెబితేనే రాపిడో స్థాపించారా.. నిజమెంత?

Kethireddy House

ఏం జరుగుతోంది?
అయితే దీనిపై వైసీపీ మాత్రం మరోలా స్పందిస్తున్నది. కేతిరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్య కొనసాగుతోంది. ఇప్పటికే ఆయన్ను తాడిపత్రిలో అడుగుపెట్టకుండా అడ్డుకుంటున్న కూటమి నేతలు.. తాజాగా ఆయన ఇంటిని టార్గెట్‌ చేశారని జిల్లా నేతలు ఆరోపిస్తున్నారు. పెద్దారెడ్డి ఇంటి వద్ద తాజాగా మున్సిపల్‌ శాఖ అధికారులు కొలతలు తీసుకోవడం పలు అనుమానాలకు తావిస్తున్నది. పెద్దారెడ్డిని టార్గెట్‌ చేసి అధికారులు, టీడీపీ నేతలు రాజీకీయంగా వేధింపులకు గురిచేస్తున్నారని మండిపడుతున్నారు. ఎందుకంటే.. హైకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ స్థానిక టీడీపీ నేతలు, పోలీసులు ఇప్పటికీ ఆయన్ను తాడిపత్రిలో అడుగుపెట్టనివ్వడం లేదని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా.. తాడిపత్రిలో మున్సిపల్‌ అధికారులు తనిఖీలు అనుమానాలు వస్తున్నాయి. శనివారం నాడు పెద్దారెడ్డి ఇంటికెళ్లిన అధికారులు.. అక్కడ టేపుతో కొలతలు తీసుకున్నారు. ఇంటి ముందు, పరిసరాల్లో కొలతలు చేపట్టారు. అయితే, మున్సిపల్‌ స్థలం ఆక్రమించారనే ఫిర్యాదు మేరకు తాము కొలతలు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. అయితే, వారి మాటలకు చేతలకు పొంతన ఏమాత్రం కనిపించట్లేదు. దీంతో స్థానిక వైసీపీ నేతలు, ప్రజలు మాత్రం పెద్దారెడ్డి ఇంటిని కూల్చివేసేందుకు కుట్రలు చేస్తున్నట్టు ఆరోపిస్తున్నారు.

Kethi Reddy

ఇదీ అసలు కథ..
వైసీపీ హయాంలో నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా తాడిపత్రి ప్రభుత్వ జూనియర్ కాలేజీ ప్రహారీగోడను రూ.27 లక్షలతో అధికారులు నిర్మించే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. అది సరిగ్గా జేసీ ఇంటికి ఎదురుగా ఉండటంతో ఈ కాంపౌండ్ వాల్ రోడ్డులో ముందుకు వచ్చి నిర్మిస్తున్నారని నాడు అభ్యంతరం తెలిపారు. 2022 మాస్టర్‌ ప్లాన్‌ ప్రకారం కాలేజీ నుంచి వరకు 60 అడుగుల రోడ్ ఉంది. ఆ మేరకు స్థలాన్ని విడిచి పెట్టి ప్రహరీ నిర్మించాలని జేసీ సూచించారు. అయితే.. రోడ్డు విస్తరణ చేపడితే గోడను కూల్చేయాల్సి ఉంటుందని వార్నింగ్ ఇచ్చారు. అనుకున్నట్టుగానే అప్పట్లో జూనియర్ కాలేజీ కాంపౌండ్‌ వాల్‌ను ధ్వంసం చేయడం జరిగింది. అది ఎవరు చేశారనేది తెలియదు.. కానీ, జేసీ ప్రభాకర్‌రెడ్డి తోపాటు మరో 13 మందిపై కూడా నాడు పోలీసులు కేసులు నమోదు చేశారు. ప్రహరీ నిర్మాణంపై ఏకంగా కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు జేసీ.. దీంతో నాడు నిర్మాణం ఒక్కసారిగా ఆగిపోయింది. ఇలా ఒకటి కాదు రెండు కాదు.. వైసీపీ హయాంలో జేసీ ఫ్యామిలీకి చాలా దెబ్బలే తగిలాయి. ఇప్పుడు అధికారం మారడంతో దెబ్బకు దెబ్బ తీయడానికి కేతిరెడ్డిపై కావాల్సినన్ని ప్రయోగాలకు జేసీ సిద్ధమై ఇలా చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది.

JC Prabhakar Reddy

అప్పుడు.. ఇప్పుడు!
అవన్నీ మనసులో పెట్టుకున్న జేసీ.. ఇప్పుడు రంగంలోకి దిగిపోయారు. పెద్దారెడ్డి మున్సిపల్ స్థలాన్ని ఆక్రమించి.. ఇళ్లు నిర్మించారని జేసీ గత కొన్ని రోజులుగా ఆరోపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే వైసీపీ నాయకులే టార్గెట్ కూల్చివేతలు, నోటీసులు ఇచ్చే ప్రక్రియ కొనసాగుతూ వస్తున్నది. ఇప్పుడు పెద్దారెడ్డి వంతు వచ్చింది. మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు లోని సర్వే నెం.639, 640, 641లో గల ప్లాట్ నెంబర్‌ 1 నుంచి 16లోని సంబధించిన ఆక్రమణకు గురైన మున్సిపాలిటీ స్థలంను కొలతలు తీసుకోవడం జరిగింది. అది కూడా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భారీ పోలీసు బందోబస్తు నడుమ మున్సిపల్ సర్వే అధికారులు, రెవెన్యూ సర్వేయర్ దాదాపు రెండు గంటల పాటు సర్వే చేయడం గమనార్హం. ఈ ప్రక్రియ పూర్తయ్యాక మున్సిపల్ కమిషనర్‌కు నివేదిక అందజేస్తామని అధికారులు వెల్లడించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రభుత్వానికి సంబంధించిన స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించినట్లుగా తెలుస్తున్నది. ఇప్పుడు అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? పరిణామాలు ఎలా ఉంటాయనేది ఎవరికీ అర్థం కావట్లేదు. ఎప్పుడేం జరుగుతోందో..? ఎప్పుడు ఇల్లు కూల్చేస్తారో అంటూ కేతిరెడ్డి, వైసీపీ నేతలు టెన్షన్ పడుతున్నారు.

Read Also- Free Bus: మహిళలకు ‘ఉచిత బస్సు’పై సీబీఎన్ కసరత్తు.. ప్లాన్ మొత్తం మారిపోయిందే!

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్