Hari Hara Veera Mallu
ఎంటర్‌టైన్మెంట్

Hari Hara Veera Mallu: ‘హరి హర వీరమల్లు’ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Hari Hara Veera Mallu: సినీ అభిమానులు, మెగాభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎంతగానో ఎదురుచూస్తున్న అప్డేట్ వచ్చేసింది. భారతీయ సినీ చరిత్రలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చిత్రాలలో ఒకటిగా రూపుదిద్దుకుంటోన్న ‘హరి హర వీరమల్లు’ చిత్ర ట్రైలర్ విడుదలకు సంబంధించిన అప్డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇప్పటికే ఈ సినిమా పలుమార్లు వాయిదా పడుతూ, ఎట్టకేలకు జూలై 24న విడుదలకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ గ్యాప్‌లో మేకర్స్ సాధ్యమైనంతగా ఈ సినిమాను ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలని ప్లాన్ చేశారు. అందులో భాగంగానే జూలై 3వ తేదీన చిత్ర ట్రైలర్‌ను విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మునుపెన్నడూ చూడని శక్తివంతమైన చారిత్రక యోధుడు ‘వీరమల్లు’ పాత్రలో ఈ సినిమాలో కనువిందు చేయనున్నారు. మొఘల్ శక్తిని ధిక్కరించిన ఓ ధైర్యవంతుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో అత్యద్భుతంగా చూపించబోతున్నామని మేకర్స్ తెలుపుతూ వస్తున్నారు.

క్రిష్ జాగర్లమూడి నుంచి ‘హరి హర వీరమల్లు’ చిత్ర దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న దర్శకుడు ఎ.ఎం. జ్యోతి కృష్ణ.. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి శాయశక్తులా కృషి చేస్తున్నారు. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఈ చిత్రానికి క్రిష్ జాగర్లమూడి కూడా తన సహకారాన్ని కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని కలిగించడమే లక్ష్యంగా పని చేస్తూ.. ప్రతి ఫ్రేమ్‌ విషయంలో చిత్ర బృందం ఎంతో శ్రద్ధ తీసుకుంటోందని టాక్ వినిపిస్తోంది. మేకర్స్ కూడా ఇదే చెబుతున్నారు.

Also Read- Naga Chaitanya: శోభిత, నేను ఆ రూల్స్ పెట్టుకున్నాం.. ఫస్ట్ టైమ్ పర్సనల్ మ్యాటర్ చెప్పిన చైతూ!

ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన నాలుగు పాటలు మంచి స్పందనను రాబట్టుకున్నాయి. ‘మాట వినాలి, కొల్లగొట్టినాదిరో, అసుర హననం, తార తార’ పాటలు ఒక దానిని మించి మరొకటి శ్రోతలను అలరిస్తున్నాయి. బాబీ డియోల్, నిధి అగర్వాల్‌తో పాటు ఎందరో ప్రముఖ నటీనటులు ఈ ‘హరి హర వీరమల్లు’ సినిమాలో ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞాన శేఖర్ వి.ఎస్., మనోజ్ పరమహంస సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రవీణ్ కె.ఎల్. ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తుండగా.. ప్రముఖ కళా దర్శకుడు తోట తరణి నభూతో నభవిష్యతి అన్నచందాన అద్భుతమైన సెట్‌లను ఈ సినిమా కోసం రూపొందించారని ఇటీవల నిర్మాత ఏఎమ్ రత్నం చెప్పారు.

Also Read- Sonakshi Sinha: ప్రెగ్నెన్సీ వార్తలపై.. భలే స్పందించింది

స్టార్ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఎ. దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 24వ తేదీన తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. చారిత్రాత్మక నేపథ్యంలో అద్భుతమైన నాటకీయత, శక్తివంతమైన ప్రదర్శనలు, ఉత్కంఠభరితమైన యాక్షన్‌తో ఈ సినిమా ప్రేక్షకులని వేరే ప్రపంచానికి తీసుకెళుతుందని, ఈ సినిమాలోని ప్రతి సన్నివేశం ప్రేక్షకుల హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుందని చిత్ర బృందం ఎంతో నమ్మకంగా చెబుతోంది. ఇక ట్రైలర్ విడుదల అప్డేట్‌తో పాటు విడుదల చేసిన పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు