Samantha and Sreeleela: ‘ఊ అంటావా’ భామతో ‘కిస్సిక్’ పాప..
Samantha and Sreeleela
ఎంటర్‌టైన్‌మెంట్

Samantha and Sreeleela: ‘ఊ అంటావా’ భామతో ‘కిస్సిక్’ పాప.. స్టన్నింగ్ అవతారాల్లో!

Samantha and Sreeleela: ప్రపంచవ్యాప్తంగా ఓ ఊపు ఊపేసిన ‘పుష్ప’ (Pushpa) సిరీస్ చిత్రాలలో ఐటమ్ సాంగ్స్ చేసిన భామలెవరో అందరికీ తెలుసు. ఒకరు స్టార్ హీరోయిన్ సమంత అయితే, మరొకరు ఇప్పుడిప్పుడే స్టార్ స్టేటస్‌కి చేరుకుంటున్న శ్రీలీల (Sreeleela). ప్రస్తుతం సమంత బాలీవుడ్, హాలీవుడ్ సంగతి చూసుకుంటుంటే.. శ్రీలీల మాత్రం సౌత్‌లో సత్తా చాటి, నార్త్ వైపు అడుగులు వేస్తుంది. ఇక ఈ భామలిద్దరూ ఒకే చోట, ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే.. సోషల్ మీడియా షేక్ అవుతుంది కదా. ఇప్పుడదే జరుగుతుంది. వీరిద్దరూ కలిసి కనిపించగానే కెమెరాలు ‘కిస్సిక్’ అంటూ సందడి చేయడం మొదలెట్టాయి. అందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. వీరిద్దరూ ఎక్కడ కలుసుకున్నారా? అంటూ సెర్చింగ్‌కు దారి తీస్తున్నాయి. వివరాల్లోకి వెళితే..

Also Read- Kannappa: అంత మంది నటీనటులా? అనుకున్నారుగా!

‘పుష్ప’ పార్ట్ 1 సినిమాను ప్రపంచ స్థాయికి లేపింది ఒకటి అల్లు అర్జున్ (Allu Arjun) నటన అయితే, రెండోది మాత్రం కచ్చితంగా సమంత చేసిన ‘ఊ అంటావా.. మావ.. ఊఊ అంటావా’ పాటే. అబ్బో.. అప్పట్లో ఎక్కడ చూసినా ఈ పాటే. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా ఈ పాట దుమ్ములేపుతూనే ఉంది. సమంత ఎక్స్‌ప్రెషన్స్, సాంగ్ లిరిక్స్ అన్నీ ఆ పాటకి అలా కలిసి వచ్చాయి. రెండో పార్ట్‌లో కూడా సమంతతోనే స్పెషల్ సాంగ్ పెట్టించమని ప్రేక్షకులు కోరేంతగా ఆ సాంగ్ సంచలనాన్ని సృష్టించింది. కానీ అది జరగలేదు. ‘పుష్ప’ పార్ట్ 2లో స్పెషల్ సాంగ్ కోసం శ్రీలీలను ఫిక్స్ చేసి కిస్సిక్ అనిపించారు. సమంత పాట స్థాయిలో ఈ సాంగ్ సంచలనాన్ని క్రియేట్ చేయకపోయినా, ‘కిస్సిక్’ సాంగ్ కూడా బాగానే వర్కవుట్ అయింది. సినిమా పెద్ద హిట్ అయింది. పుష్ప సిరీస్ చిత్రాలు గుర్తున్నంతకాలం సమంత, శ్రీలీల కూడా వారి స్పెషల్ సాంగ్‌తో సందడి చేస్తూనే ఉంటారు.

Also Read- Ileana: రెండో బిడ్డకు జన్మినిచ్చిన ఇలియానా.. సెలబ్రిటీలు ఆపుకోలేకపోతున్నారు

ఇక ఈ భామలిద్దరూ ఒకే చోట దర్శనమివ్వడంతో.. మరోసారి వార్తలలో హైలైట్ అవుతున్నారు. ఇంతకీ వీరిద్దరూ ఎక్కడ కలిశారంటే.. GQ మోస్ట్ ఇన్‌ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్ (GQ Most Influential Young Indians) ఈవెంట్‌లో స్టన్నింగ్ అవతారాల్లో కనిపించి ‘కిస్సిక్’ కాదు ‘కస్సక్’ అనిపించారు. ఇందులో సమంత (Samantha) బోల్డ్ బ్లాక్ అవుట్‌ఫిట్‌లో గ్లామర్ ప్రదర్శిస్తుంటే.. శ్రీలీల రెడ్ బాడీకాన్ గౌన్‌లో రాణిలా మెరుస్తున్నారు. ఈ పిక్స్ చూసిన వారంతా GQ మోస్ట్ ఇన్‌ఫ్లూఎన్సేల్ యంగ్ ఇండియన్స్‌లో ‘సౌత్ క్వీన్స్ సందడి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇద్దరూ కూడా ఈ వేడుకలో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవడం విశేషం. ప్రస్తుతం వీరిద్దరూ బాలీవుడ్‌లో చక్రం తిప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలాంటి వేడుకల్లో ఎంత మెరిస్తే.. అంతగా అక్కడి దర్శకనిర్మాతల చూపుల్లో పడతామనే.. సెలబ్రిటీలు కొందరు స్పెషల్ డ్రస్‌లలో దర్శనమిస్తుంటారు. ఇప్పుడు సమంత, శ్రీలీల కూడా అలానే మెరిసి, అందరినోట వావ్ అనిపించుకుంటున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..