YS Sharmila
సూపర్ ఎక్స్‌క్లూజివ్

YS Sharmila: వివేకా హత్య కేసులో భారతి రెడ్డి పాత్ర? బిగ్ టీవీతో వైఎస్ షర్మిల ఇంటర్వ్యూ

YS Viveka Murder Case: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో వైఎస్ వివేకా మర్డర్ కేసు హాట్ టాపిక్‌గానే ఉన్నది. ముఖ్యంగా కడప జిల్లాలో ఈ కేసు చుట్టూ తీవ్ర చర్చ జరుగుతున్నది. వైఎస్ జగన్, అవినాశ్ రెడ్డిలకు ఈ కేసు ఇప్పటికీ కొరకరాని కొయ్యగానే ఉన్నది. ఈ సందర్భంలోనే వైఎస్ షర్మిల వివేకా హత్య కేసు గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. బిగ్ టీవీతో ఆమె మాట్లాడుతూ ఈ మర్డర్ కేసు గురించి చెప్పుకొచ్చారు. అవినాశ్ రెడ్డిని జగన్ ఎందుకు వెనుకేసుకువస్తున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ కన్విన్స్ అయ్యానని చెబితే సరిపోతుందా? కన్విన్స్ కావాల్సింది దర్యాప్తు సంస్థలు కదా అని పేర్కొన్నారు. ఇక ఈ కేసులో భారతి రెడ్డి పాత్ర ఏమిటీ? అనే ప్రశ్నకూ ఆమె సమాధానం ఇచ్చారు. వైఎస్ వివేక మర్డర్ కేసులో భారతి రెడ్డి పాత్ర ఉన్నదా? అనే అనుమానాలు ఇటీవలే వచ్చాయి. ముందుగా ఆమెకు ఫోన్ కాల్ వెళ్లినట్టు సీబీఐ పేర్కొనడంపైనా ఆరా తీస్తున్నారు. దీనిపై షర్మిల మాట్లాడుతూ ఎవరికైనా సహజంగానే తన బంధువులను కాపాడుకోవాలని ఉంటుంది కదా అని తెలిపారు. వైఎస్ జగన్ రెండు బీల రిమోట్ కంట్రోలర్ అని షర్మిల ఇటీవలే చేసిన వ్యాఖ్యలపైనా మరింత వివరణ ఇచ్చారు. భార్య ఇన్‌ఫ్లుయెన్స్ భర్త మీద ఉండటం సహజమే కదా అని వివరించారు.


Also Read: The Naked Truth: ది హెలిప్యాడ్ స్టోరీ.. ఏమిటా మతలబు?

బిగ్ టీవీకి వైఎస్ షర్మిల ఇచ్చిన ఫుల్ ఇంటర్వ్యూ ఇక్కడ చూడండి.


Just In

01

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు

Proddatur Dasara: దాగి ఉన్న చరిత్రను చెప్పే కథే ఈ ‘ప్రొద్దుటూరు దసరా’.. ఆ రోజు మాత్రం!

Gadwal: గద్వాల నడిబొడ్డున ఎండోమెంట్ ఖాళీ స్థలం కబ్జా.. దర్జాగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం

Crime News: దుస్తులు లేకుండా వచ్చి.. ఒక మహిళను ఈడ్చుకెళుతున్నారు.. యూపీలో ‘న్యూడ్ గ్యాంగ్’ కలకలం

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?