Sunday, September 15, 2024

Exclusive

The Helipad Story: ది ‘హెల్’ప్యాడ్!.. బాధితులకు కన్నీళ్లు.. గులాబీలకు కోట్లు!

– వట్టినాగులపల్లిలో రూ.600 కోట్ల భూ స్కాం
– బీఆర్ఎస్ బినామీ పత్రిమ శ్రీనివాసరావు చిత్ర విచిత్రాలు
– పాత్రధారులుగా ఉదయ్ భాస్కర్, ఏబీవీఎస్ ప్రకాశ్ రావు
– ధరణి మాటున భూదాన్ బూచిని చూపించిన వైనం
– చనిపోయిన సభ్యుల సంతకాల ఫోర్జరీ
– అమ్మడానికి వీలు లేని సొసైటీ భూములకు రెక్కలు
– గండిపేట ఎమ్మార్వో రాజశేఖర్ బరితెగింపు
– తవ్వుతున్న కొద్దీ బయటపడుతున్న గులాబీ బినామీల బాగోతాలు
– ‘స్వేచ్ఛ’-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ కథనం
– గులాబీ.. బినామీ.. సునామీ పార్ట్ -3

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809
స్వేచ్ఛ ఇన్వెస్టిగేషన్ టీం

The Helipad Story: హైదరాబాద్ మహానగర శివారులోని ఖరీదైన లొకేషన్‌. దగ్గరలో అమెరికన్ కాన్సులేట్, మైక్రోసాఫ్ట్‌. చుట్టూ హైక్లాస్ అపార్ట్‌మెంట్స్‌. అలాంటి చోట ల్యాండ్ అంటే మామూలుగా ఉండదు. ధర ఓ రేంజ్ లో ఉంటుంది. కానీ, అధికార బలం, అంగ బలంతో చాలా చీప్‌గా భూమిని కొట్టేశారు. లగ్జీరియస్ హెలిప్యాడ్‌ను కట్టేశారు. 8 ఎకరాలకు పైగా ఉన్న ఈ ల్యాండ్‌ ప్రస్తుతం బోయినపల్లి శ్రీనివాసరావు పేరు మీద ఉంది. ఈయన ఎవరో కాదు, బీఆర్‌ఎస్ పార్టీ కీలక నేత, మాజీ సీఎం కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ముద్ర పడిన బోయినపల్లి వినోద్‌ కుమార్‌కు స్వయానా సోదరుడు. అంతేకాదు, ప్రతిమ గ్రూప్ ఓనర్. వివాదాస్పదమైన ఈ భూమిని ఆయన హైదరాబాద్ ఎయిర్‌ లైన్స్‌కు లీజ్‌కు ఇచ్చారు. విచిత్రమేంటంటే ఆ కంపెనీ కూడా ఈయనదే.

కీలక పాత్రధారిగా ఏబీవీఎస్ ప్రకాశ్ రావు

అధికారంలో ఉంటే చాలు వేల కోట్ల భూములను ఇట్టే భయపెట్టి లాక్కోవచ్చు. అధికారులను గుప్పిట్లో పెట్టుకుని ఇష్టానుసారంగా సంతకాలు పెట్టించొచ్చు. అందుకు నిదర్శనమే బోయినపల్లి శ్రీనివాసరావు కబ్జా బాగోతం. ఎకరం భూమి రూ.వంద కోట్లు పలికే ప్రాంతంలో సొసైటీ సభ్యులను మభ్యపెట్టి లాక్కున్న తీరు చూస్తే కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. ఏ ఒక్కటి సరిగ్గా లేకున్నా ధరణిలో భూదాన్ అనే పదాన్ని చేర్చి , ప్రొహిబిటెడ్ లిస్టులో పెట్టించి ప్లాట్ ఓనర్స్‌ని బెదిరించారు. ఈ భూమి 111 జీవో పరిధిలోకి రాదని తెలిసినా తర్వాత చకచకా పావులు కదిపారు. ఏబీవీఎస్ ప్రకాశ్ రావు ఇందులో కీలక పాత్ర పోషించారు. బోయినపల్లి శ్రీనివాసరావు అలియస్ ప్రతిమా శ్రీనివాసరావుని బుట్టలో వేసుకుని భూమిని కొనుగోలు చేసేలా ప్లాన్ చేశారు. అందుకు 10 లక్షలు తన అకౌంట్స్ నుంచి సొసైటీకి బదిలీ అయ్యాయి. భూమిని లిటిగేషన్‌లోకి నెట్టేశారు. సొసైటీ అధికారులు ఈ భూమిని అమ్మడానికి వీలు లేదని చెప్పినా, ప్రెసిడెంట్ అంటూ చెప్పుకునే ఉదయ్ భాస్కర్‌ని పట్టేశారు. భారీగా ఆశ చూపించి ఎవరిని ఎలా లొంగ తీసుకోవాలో అలా చేశారు. 63 ప్లాట్స్‌కు గాను 52 మంది వద్ద కొనుగోలు చేశారు. వారందరికి గజం భూమి 5 వేల చొప్పున నగదు బదిలీ చేశారు. మరో 25 వేల రూపాయలు బ్లాక్ మనీ ఇచ్చినట్లు సమాచారం. అయితే, సొంతింటి కల కోసం 20 ఏండ్లుగా తాపత్రాయ పడ్డవారు మాత్రం నిరంతరం ఫైట్ చేస్తూనే ఉన్నారు.

Read Also: సుప్రీంలో కేజ్రీవాల్‌కు భారీ ఊరట.. మధ్యంతర బెయిలు మంజూరు

ల్యాండ్ వెనుక ఉన్న కథ ఇదే!

వట్టినాగులపల్లిలో గజం విలువ లక్ష నుంచి లక్షన్నర పలుకుతోంది. కనీసం లక్ష వేసుకున్నా ఎకరాకు రూ.48 కోట్లు పలకాలి. లక్షన్నర అయితే, రూ.72 కోట్లు పలకాలి. ఆ లెక్కన చూస్తే 8 ఎకరాల 7 గుంటల విలువ దాదాపు రూ.600 కోట్లు అన్నమాట. కానీ, బోయినపల్లి శ్రీనివాసరావు దీన్ని దక్కించుకుంది కేవలం 17 కోట్ల 16 లక్షల 75వేల రూపాయలకే. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లో ఒకేచోట 8 ఎకరాల స్థలం దొరకడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి భూమిని గజం 5 వేలకే బోయినపల్లి శ్రీనివాసరావు దక్కించుకున్నారంటేనే దీని వెనుక ఎంత తతంతం నడించిందో అర్థం చేసుకోండి. ఎన్నో ఆశలతో ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చి విప్రోలో ఉద్యోగాలు చేస్తున్న వారంతా సొంతింటి కలను నెరవేర్చుకోవడానికి 2002లో కొనుక్కున్న భూములివి. మొత్తం 63 మంది విప్రో ఉద్యోగులు, వారి సన్నిహితులు రియల్‌ ఎస్టేట్ డీల్స్ చేసే ఓ వ్యక్తి ద్వారా ఈ భూమిని కొనడానికి ముందుకొచ్చారు. ద సాఫ్ట్‌వేర్ అసోసియేట్స్ మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ హౌజింగ్ సొసైటీ లిమిటెడ్‌ను రిజిస్ట్రేషన్ చేసుకుని వెంకట్ కూనపల్లిని ప్రెసిడెంట్‌గా, వేములపాటి ఉదయ్ భాస్కర్‌ను వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎన్నుకున్నారు. సొసైటీ సభ్యులకు ఇళ్లు కట్టుకోవడం కోసమే ఈ సొసైటీ అని కూడా బైలాస్‌లో స్పష్టంగా రాసుకున్నారు. 2002, నవంబర్, డిసెంబర్ నెలల్లో వట్టినాగులపల్లిలోని 181, 189 సర్వే నెంబర్లలో 8 ఎకరాల 7 గుంటల భూమిని పవర్ ఆఫ్ అటార్నీ పద్ధతిలో కొనుగోలు చేశారు. ఆ తర్వాత భూమిలో లే ఔట్ ప్లాన్ చేసుకుని ఎవరి స్థోమతకు తగ్గట్లుగా ప్లాట్లు తీసుకున్నారు. ప్లాట్లు అలాట్ చేసినట్లు నెంబర్లు, విస్తీర్ణంతో సహా సొసైటీ నుంచి సభ్యులందరికీ అలాట్‌మెంట్ లెటర్లు కూడా వచ్చాయి. అయితే, ప్లాట్ అలాట్‌మెంట్ కోసం గీసుకున్న లేఔట్‌ ప్లాన్‌కు అనుమతులు తెచ్చుకోవడానికి హెచ్ఎండీఏకు వెళ్దామనుకున్న సమయంలో ఆ భూములు 111 జీవో పరిధిలో ఉన్నాయన్న సంగతి తెలిసింది. అక్కడ నిర్మాణాలేవీ చేయకూడదని, అలాంటి వాటికి అనుమతులూ ఉండవని చెప్పేసరికి అందరిలో టెన్షన్ ఎక్కువైంది. చేసేదేం లేక భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసుకుని, గేటు పెట్టి ప్రొటెక్ట్ చేసుకున్నారు.

ప్రతిమ శ్రీనివాసరావు ఎంట్రీ

2007లో పవర్ ఆఫ్ అటార్నీతో కొన్న భూమిని సేఫ్టీ కోసం పూర్తి స్థాయిలో 2009లో సొసైటీ పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు కావడంతో కొంతమంది ఇతర ప్రాంతాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోయారు. 2020లో వీరికి మరో పిడుగులాంటి వార్త తెలిసింది. అదే ధరణి. సొసైటీ కొన్న 189 సర్వే నెంబర్‌లోని 5 ఎకరాల 35 గుంటల భూమిని భూదాన్‌ భూమిగా ధరణిలోకి ఎక్కించేశారు అధికారులు. ఇక్కడి నుంచే అసలు డ్రామా మొదలయ్యింది. ధరణిని అడ్డం పెట్టుకుని అప్పట్లో అధికార పార్టీ నేతలు వేసిన కుట్రల్లో ఈ సాఫ్ట్‌వేర్ ఉద్యోగుల హౌజింగ్ సొసైటీ కూడా ఇరుక్కుంది. చాలాకాలంగా అక్కడ భూమి ఖాళీగా ఉండడం గమనించిన కొంతమంది, కావాలనే ధరణిలో భూదాన్ భూమిగా రికార్డుల్లో చేర్చారు. దీనివెనుక బోయినపల్లి శ్రీనివాసరావు హస్తం ఉందంటున్నారు బాధితులు. రికార్డుల్లో ఎప్పుడూ భూదాన్ భూమిగా లేని 5 ఎకరాల 35 గుంటల స్థలం, సడన్‌గా ఎలా మారిపోతుంది? దీనికి బోయినపల్లి చేతుల్లో కీలుబొమ్మగా మారిన ఉదయ్ భాస్కర్ ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా.. ఎవరో కావాలనే పెట్టారని. ఓ సొసైటీ ప్రెసిడెంట్‌గా భూములను రక్షించాల్సిన బాధ్యత తీసుకోవాల్సిందిపోయి, ఆ భూములను ఇక కాపాడలేమని, అమ్ముకోవడం తప్ప మరోమార్గం లేదంటూ సభ్యులను భయపెట్టాడంటే ఆయన స్కెచ్ ఏంటో ఈజీగా తెలుసుకోవచ్చు. ఎలాగైనా భూమిని దక్కించుకోవడం కోసం ఇది బోయినపల్లి శ్రీనివాసరావు ఆడించిన నాటకమన్న సంగతి ఈ వ్యవహారం చూసిన వారందరికీ అర్థమైపోతుంది.

Read Also: కమలానికి ‘రామ’సాయం

హైకోర్టులో పిటిషన్

వట్టినాగులపల్లిలో సమగ్రమైన సర్వే చేయకుండా గ్రామంలోని భూములన్నింటినీ ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలోకి తేవడంపై హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు 178 నుంచి 214 మధ్య ఉన్న సర్వే నెంబర్లు ట్రిపుల్‌ వన్ జీవో పరిధిలోకి రావంటూ తీర్పు చెప్పింది. దీని ఆధారంగా ప్రభుత్వం ఏప్రిల్ 12, 2022న ఇచ్చిన జీవో 69తో సొసైటీ భూములకు ట్రిపుల్ వన్ జీవో బాధ తొలిగిపోయింది.

జనవరి 16 న డీసీవో ముందు విచారణకు ఉదయభాస్కర్ హాజర్యయారు
జనవరి 17న రికార్డుల్లో నుంచి భూదాన్ పదం తొలిగించి సొసైటీకి పట్టా పాస్‌బుక్ ఇచ్చేశారు
జనవరి 18న సొసైటీ భూములను రిజిస్ట్రేషన్ చేయద్దంటూ తహసీల్దారుకు డీసీవో నోటీస్ పంపించారు
జనవరి 19న బోయినపల్లి శ్రీనివాసరావు పేరిట సొసైటీ భూములను తహసీల్దార్ రిజిస్ట్రేషన్ చేసేశాడు
జనవరి 20న సొసైటీ సభ్యుల అకౌంట్లలోకి గజం 5వేల చొప్పున డబ్బులు డిపాజిట్ అయిపోయాయి

అధికారం చేతుల్లో ఉండే ఎంత అడ్డగోలుగా పనులు చేసుకోవచ్చనడానికి ఈ ఐదు రోజుల్లో జరిగిన సంఘటనలే నిదర్శనం. రెండేళ్లపాటు సొసైటీను పీడించిన ధరణిలో భూదాన్ సమస్య, బోయినపల్లి శ్రీనివాసరావు తలుచుకోగానే ఒక్కరాత్రిలో మారిపోయింది. అసలు సొసైటీ భూములను అమ్ముకోవాలనుకున్నదే భూదాన్ సమస్య రావడం వల్ల. అదే లేనప్పుడు అమ్ముకోవాల్సిన అవసరమే ఉండదు. అంటే కావాలనే ధరణిలో భూదాన్ భూమిగా చూపించి సొసైటీ సభ్యులను బెదిరించి, బోయినపల్లి శ్రీనివాసరావు ఈ భూములను లాక్కున్నారా? రూ.600 కోట్లు విలువైన భూమిని కారు చౌకగా 17 కోట్లకే కొట్టేశారా?

అక్రమంగా హెలిప్యాడ్ నిర్మాణం

హైదరాబాద్ ఎయిర్‌లైన్స్‌.. బోయినపల్లి శ్రీనివాసరావు కంపెనీ. వివాదాస్పద భూముల్లో హెలిప్యాడ్ కట్టి తన సంస్థకే లీజ్‌కు ఇచ్చారు. అక్కడ కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నారు. హైసెక్యూరిటీ జోన్‌లో ఉండే అమెరికన్ కాన్సులేట్ దగ్గర్లో ఉంది ఈ హెలిప్యాడ్. కమర్షియల్ ఆపరేషన్స్ నిర్వహించడానికి హెలిప్యాడ్ నిర్మించాలంటే డీజీసీఏ అనుమతులు తప్పనిసరిగా తీసుకోవాలి. మరి వట్టినాగులపల్లిలో హెలిప్యాడ్ నిర్మాణానికి పర్మిషన్ ఇచ్చారా అంటూ ఆర్టీఐ ద్వారా సమాచారం అడిగితే ఎలాంటి సమాచారం లేదని రిప్లై వచ్చింది.

Publisher : Swetcha Daily

Latest

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Don't miss

Pawan Kalyan: మనం OG అంటే.. ప్రజలు ‘క్యాజీ’ అంటారు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మార్పు రావడం వెనుక కీలక పాత్ర...

CM Revanth Reddy: రాజకీయాలకు అతీతం… అభివృద్దే మా లక్ష్యం

- బిజీబిజీగా సీఎం హస్తిన పర్యటన - ప్రధానిని కలిసిన సీఎం రేవంత్,...

CM Revanth Reddy: కేసీఆర్‌పై ప్రేమ తగ్గలేదా?

- కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించినప్పుడు ఈటల ఏం చేశారు? - ఆయనపై ఇంకా...

Amrapali Kata: ఆమ్రపాలి ఆకస్మిక తనిఖీలు

GHMC: మంత్రులు, ఉన్నతాధికారులు, వివిధ శాఖల బాధ్యులు పనిపై శ్రద్ధ పెంచాలని,...

Telangana BJP: ఇద్దరు సీఎంలు కలవాలనే కోరుకుంటున్నాం.. కానీ!?

NVSS Prabhakar: ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్...

Telangana: ఎన్నాళ్లీ మూత ‘బడులు’

బీఆర్ఎస్ హయాంలో అస్తవ్యస్తంగా మారిన పాఠశాల విద్య 28 వేల పాఠశాలలకు గాను మూతపడిన సగం పాఠశాలలు పాఠశాల విద్యపై ప్రచారార్భాటమే తప్ప చేసింది శూన్యం బీఆర్ఎస్ విధానాన్ని తప్పుబడుతున్న విద్యావేత్తలు ...

Hyderabad: గుండె ‘చెరువు’ అవుతోంది

దురాక్రమణదారుల కబ్జా కోరల్లో నగర చెరువులు టీ.సర్కార్ వెబ్ సైట్ లో కేవలం 19,314 చెరువుల సమాచారం చెరువుల సంఖ్యపై సమగ్ర సమాచారం సేకరించిన గత పాలకులు ఉన్న చెరువులనైనా కాపాడుకోవడానిక...

Hyderabad:ఆదిల్ కు అండగా సీఎం

CM Reventh reddy Reassurance to cancer patient Mohammadd Adil క్యాన్సర్‌ బాధితుడు మహమ్మద్‌ ఆదిల్‌ను ఆదుకుంటామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ కుటుంబానికి భరోసానిచ్చారు. శనివారం రేవంత్‌ వరంగల్‌ జిల్లా పర్యటనకు వెళ్లిన...