Siddharth: చెన్నైలో జరిగిన ‘3BHK’ (త్రీ బెడ్‌రూమ్ హాల్ కిచెన్) ఆడియో ఫంక్షన్ వేడుకలో హీరో సిద్ధార్థ్ మాట్లాడిన తీరు ప్రేక్షకుల హృదయాలను కదిలించింది. ఎప్పుడూ ఉత్సాహంగా, హ్యాపీగా కనిపించే ఈ హీరో, ఈ సారి తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఈ ఫంక్షన్ లో సిద్ధార్థ్ మాట్లాడుతూ, “ఇది నా 40వ సినిమా. నా తల్లిదండ్రులు నా సినీ ప్రయాణంలో నాకు అండగా నిలిచారు. వారు నన్ను గర్వంగా చూశారు. 3BHK సినిమా నన్ను భావోద్వేగపరంగా పూర్తిగా మార్చేసింది. సినిమాలోని ప్రతి సన్నివేశం నా మనసును బలంగా తాకింది ” అని చెబుతూ కంటతడి పెట్టడం అందర్నీ షాక్ కు గురి చేసింది.
Also Read: Himachal Pradesh’s Kullu: హిమాచల్‌లో అకస్మిక వరదలు.. సంచలన విషయాలు చెప్పిన ప్రత్యక్ష సాక్షి!
ఈ సినిమాలో హీరో సిద్ధార్థ్‌తో పాటు జె.ఆచర్, శరత్ కుమార్, యోగి బాబు, దేవయాని, మీతా రఘునాథ్, సుబ్బు పంచు తదితరులు నటించారు. ఈ సినిమా జూలై 4న తమిళంతో పాటు తెలుగులో కూడా రిలీజ్ కానుంది. ఇది ఒక ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా రూపొందింది. ఇటీవల రిలీజైన ‘చిన్నా’ మూవీతో భావోద్వేగ కథలకు ఆకర్షితుడైన సిద్ధార్థ్, ఇప్పుడు కుటుంబ కలలను ఆధారంగా తీసిన 3BHK సినిమాతో మరోసారి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ చిత్రం ద్వారా ప్రేక్షకుల మనసులను గెలుచుకోవాలని ఆయన ఆశిస్తున్నారు. మరి, ఈ సినిమా ఆడియెన్స్ ను అలరిస్తుందో? లేదో చూడాల్సి ఉంది.
Also Read: Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?