Srisailam Reservoir: శ్రీశైలం జలాశయం ప్లంజ్ ఫుల్ పై అండర్ వాటర్(Under Water) వీడియోగ్రఫీ సర్వే(Video graphy Serve) ముగిసింది. ఈ నెల 14న షీ లయన్ ఆఫ్ షేర్ డైయింగ్ టీమ్ సర్వేను ప్రారంభించింది. 8 మంది డైయింగ్ టీమ్, 8 మంది హెల్పర్ల సహాయంతో 13 రోజుల పాటు అండర్ వాటర్ ఫోటో, వీడియో గ్రఫీ చేపట్టారు. ప్లంజ్ పూల్(గొయ్యి)ఎంత మేర ఏర్పడిందానే దానిపై 10 రోజులుగా ఫోటో,వీడియోలు గ్రఫీ తీశారు. సర్వే ముగించి పూర్తి నివేదిక కోసం తిరిగి వైజాగ్ కు టీమ్ సభ్యులు వెళ్లారు. ప్లంజ్ పుల్ సమగ్ర నివేదికను మూడు వారాలలో నీటిపారుదలశాఖ(Irrigation Department) అధికారులకు అందజేయనున్నారు. శ్రీశైలం డ్యాం కు ప్రమాదం పొంచి ఉందా? శ్రీశైలం డ్యాంలో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోతుందా? తెలుగు రాష్ట్రాలకు బహుళ ప్రయోజనకారి అయిన శ్రీశైలం డ్యాం భవిష్యత్ పై నీలినీడలు కమ్ముకున్నాయా? అనే దానిపై తాజాగా శ్రీశైలం జలాశయంలో నిల్వ ఉన్న నీరు, డ్యాం లో చేరిన మట్టి పూడిక ఎంతగా ఉందో తెలుసుకోవడానికి హైడ్రో గ్రాఫిక్స్ సర్వే(Hydro Graphics Sereve) నిర్వహించారు.
ప్రాజెక్టు పై హైడ్రో గ్రాఫిక్స్ సర్వే
శ్రీశైలం జలాశయం నిర్మాణ సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులో నీటి నిల్వ 308.6 టీఎంసీలు ఉండగా 2009 వరదల కారణంగా సీల్ట్ కొట్టుకు రావడంతో సామర్థ్యం 215 టీఎంసీలకు తగ్గింది. అప్పట్లో వచ్చిన వరదల వల్ల శ్రీశైలం జలాశయం సుమారు తొంభై మూడు టీఎంసీల నీటిని కోల్పోవలసి వచ్చిందని అధికారులు పేర్కొంటున్నారు. ఇక తాజాగా మరోమారు శ్రీశైలం ప్రాజెక్టు(Srisailam Project) పై హైడ్రో గ్రాఫిక్స్ సర్వే నిర్వహిస్తున్న అధికారులు ఇప్పటి వరకు శ్రీశైలం రిజర్వాయర్ లో ఎంత మేరకు మట్టి పూడిక చేరుకున్నది. జలాశయం లో నీటి సామర్థ్యం(Water capacity) ప్రస్తుతం ఎంత ఉంది అన్న అన్ని వివరాలను సేకరించారు. శ్రీశైలం జలాశయం నుండి సంగమేశ్వరం వరకు 13 రోజుల పాటు ఈ సర్వేను నిర్వహించారు. ప్రత్యేకమైన బోట్లో ఎకో సౌండ్ పరికరాల ద్వారా శబ్దాన్ని జలాశయంలోకి పంపి ఎంత లోతులో పూడిక పేరుకు పోయిందో జియో టెక్నికల్ సర్వీసెస్(jio Technical Services) బృందం లెక్కించారు. సీడబ్ల్యూసీ(CWC) మార్గదర్శకాల ప్రకారం ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్కించాలనే నిబంధన ఉండటంతో నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా శ్రీశైలం ప్రాజెక్టు నీటి సామర్థ్యం తేల్చే పనులను జలవనరుల శాఖ అధికారులు చేపట్టారు.
Also Read: Mango Farmers: మామిడి రైతులను ముంచిన వాతావరణం.. ధర రాక దిగులు
నీటి నిల్వ స్థాయిని కోల్పోతోందని అంచనా
రిజర్వాయర్ యొక్క బేస్ లెవల్‌లో ఏర్పడిన మట్టి పూడిక, కోత, డ్యామ్ యొక్క భద్రతా అంశాలను అధ్యయనం చేయడానికి ఈ బృందం సర్వే నిర్వహించింది. ప్రతి సంవత్సరం డ్యామ్‌లో మట్టి పేరుకుపోవడంతో డ్యామ్ కూడా ప్రతి సంవత్సరం దాదాపు 2 టీఎంసీల నీటి నిల్వ స్థాయిని కోల్పోతోందని అంచనా వేస్తున్నారు .ప్రస్తుతం, నిల్వ సామర్థ్యం దాని వాస్తవ సామర్థ్యం 308.060 టీఎంసీలకు గాను 215.80 టీఎంసీల నీటికి తగ్గింది.డ్యామ్ నుండి మట్టి పూడికను తొలగించకపోతే రాబోయే సంవత్సరాల్లో నిల్వ సామర్థ్యం భారీగా తగ్గుతుందని నీటిపారుదల నిపుణులు భావిస్తున్నారు. అయితే శ్రీశైలం జలాశయం జల విస్తరణ ప్రాంతం 616 చదరపు కిలోమీటర్లు. బెడ్ లెవెల్ సగటున 500 మీటర్లు, శ్రీశైలం జలాశయం నీటిమట్టం 885 అడుగులు.
అడవులను నరికి వేయడం వల్ల భూమి కోత
ప్రస్తుతం 215 టీఎంసీల నీటి మట్టం ఉన్న శ్రీశైలం జలాశయంలో తాజాగా జరుగుతున్న సర్వే, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం కంటే ఎంత మేర నీటి సామర్థ్యం తగ్గింది అనేది మూడువారాల్లో అధికారులకు సర్వే బృందం నివేదిక ఇవ్వనుంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో అడవులను నరికి వేయడం వల్ల భూమి కోతకు గురై వరదల సమయంలో మట్టి శ్రీశైలం జలాశయంలోకి కొట్టుకు రావడంతో శ్రీశైలం జలాశయంలో పూడిక భారీ ఎత్తున పేరుకుపోతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఈ నివేదిక ఆధారంగా ప్రాజెక్టు నీటి సామర్థ్యం అంచనా వేస్తారు. ఏదిఏమైనా తెలుగు రాష్ట్రాల జల వివాదాల నేపధ్యంలో నదీజలాల మీద కేంద్రం నిర్ణయం తీసుకునేలా గెజిట్ విడుదల చేసిన కేంద్రం ఇప్పుడు నదీజలాల లెక్కలు, పలు ప్రాజెక్ట్ ల పరిస్థితి అంచనా వేయనున్నట్లు తెలిసింది.
Also Read: Bhatti vikramarka: కాంగ్రెస్ అంటేనే వ్యవసాయం.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క