YS Jagan Family: మంచు విష్ణు ‘కన్నప్ప’ (Kannappa)కు, వైఎస్ జగన్ ఫ్యామిలీకి సంబంధం ఏంటి? ‘కన్నప్ప’ కోసం వైఎస్ జగన్ ఫ్యామిలీ కదిలి రావడం ఏంటి? అని ఆశ్చర్యపోతున్నారు కదా! వైఎస్ జగన్ ఫ్యామిలీకి, మంచు విష్ణు ఫ్యామిలీకి సంబంధం ఉంది. మంచు విష్ణు భార్య ఎవరో కాదు.. స్వయానా వైఎస్ జగన్‌కు చెల్లెలు అవుతారు. వైఎస్ రాజా రెడ్డి నాలుగో కొడుకు సుధాకర్ రెడ్డి, విద్య దంపతుల కుమార్తె విరానికా. అమెరికాలో పుట్టి పెరిగిన విరానికా (Veronica Reddy), మంచు విష్ణుతో ప్రేమలో పడటం, ఆ తర్వాత పెళ్లి చేసుకోవడం వంటివి జరిగాయి. రాజకీయాలు పక్కన పెడితే, వారిది ఫ్యామిలీ బాండింగ్. రాజకీయాల పరంగానూ మొన్నటి వరకు వైఎస్ జగన్‌కే మంచు ఫ్యామిలీ సపోర్ట్ ఇస్తూ వచ్చింది. ‘మా’ ఎన్నికల సమయంలో మంచు విష్ణు గెలుపు వెనుక వైఎస్ జగన్ హస్తం ఉందనేలా అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.
Also Read- Kannappa Review: ‘కన్నప్ప’ మూవీ జెన్యూన్ రివ్యూ
సరే.. ఆ విషయం పక్కన పెడితే, ఇప్పుడేంటి? వైఎస్ జగన్ ఫ్యామిలీ ఏమైనా ‘కన్నప్ప’ ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నారా? అనే అనుమానం టైటిల్ చూస్తే రాకమానదు. సినిమా ఇండస్ట్రీపై పట్టు కోసం మొదటి నుంచి వైఎస్ జగన్ ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఒక విధంగా చెప్పాలంటే, సినిమా ఇండస్ట్రీ విషయంలో ఆయన తీసుకున్న కొన్ని నిర్ణయాలు, విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే. అలాంటి వైఎస్ జగన్.. ‘కన్నప్ప’ రూపంలో సినిమా ఇండస్ట్రీలో పట్టు సాధించాలని చూస్తున్నారా? అంటే అస్సలు కాదు. ఆయనకిప్పుడు అంత ఓపిక కూడా లేదు. ప్రస్తుతం పార్టీని ఎలా బలోపేతం చేయాలా? అనే ఆలోచనలో ఉన్న వైఎస్ జగన్‌కు, ‘కన్నప్ప’ గురించి పట్టించుకునే సమయం ఎక్కడ ఉంటుంది? మరి విషయం ఏంటి అని అనుకుంటున్నారా?
Also Read- Ram Charan: ప్రతి ఒక్కరం.. ఒక సోల్జర్‌లా మారుదాం
వైఎస్ జగన్ ఫ్యామిలీకి చెందిన వైఎస్ విజయమ్మ, ఆమె బంధువులు ‘కన్నప్ప’ సినిమాను స్పెషల్‌గా చూశారు. హైదరాబాద్‌లో ఏఎమ్‌బీ సినిమాస్‌లో ‘కన్నప్ప’ సినిమాను చూసిన వైఎస్ విజయమ్మ.. సినిమాపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘కన్నప్ప’ సినిమా చాలా బాగుందని అన్నారు. ఏదో తేడా కొడుతుంది కదా. వైఎస్ విజయమ్మ ఏంటి? ‘కన్నప్ప’ సినిమా చూడటమేంటి? అని మరో డౌట్ కొడుతుంది కదా. కానీ ఇదే నిజం. ఆమె జీసస్‌ని కొలుస్తారు. అలాంటి విజయమ్మ.. ‘కన్నప్ప’ కోసం స్వయంగా థియేటర్‌కు కదిలి రావడంతో అంతా ఆశ్యర్యపోతున్నారు. అంతా విరానికా మహిమ అని అంటున్నారు. ప్రస్తుతం ‘కన్నప్ప’ సినిమా చూసి, థియేటర్ నుంచి బయటకు వస్తున్న విజయమ్మ వీడియో ఒకటి సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ వీడియోపై నెటిజన్లు ఆసక్తికరంగా కామెంట్స్ చేస్తున్నారు. ‘కన్నప్ప’ విషయానికి వస్తే.. ప్రస్తుతం విడుదలైన అన్ని చోట్ల ఈ సినిమా పాజిటివ్ టాక్‌నే సొంతం చేసుకుని, సక్సెస్‌పుల్‌గా థియేటర్లలో రన్ అవుతోంది.
AMB లో #kannappa సినిమా చూసిన వైఎస్ విజయమ్మ#KannappaReview #kannappapublictalk #KannappaMoviereview #KannappaMovie #ysvijayamma pic.twitter.com/oD0pueQjLK
— TeluguOne (@Theteluguone) June 27, 2025
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు