Manchu Vishnu: మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకొచ్చింది. మోహన్ బాబు నిర్మాతగా వ్యవహరించిన ఈ భారీ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. గత పదేళ్లుగా విష్ణు ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఈ ప్రాజెక్ట్ కోసం విష్ణు తన ప్రాణాన్ని ఫణంగా పెట్టారు. న్యూజిలాండ్‌లో భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని గ్రాండ్‌గా తెరకెక్కించారు. ఇక వీఎఫ్ఎక్స్ విషయంలో ఎక్కడా రాజీ పడకుండా, కాస్త ఆలస్యమైనప్పటికీ, ఈ సినిమాను జూన్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.
Also Read: Telangana: త్వరలో ఎంఈఎంయూ రైళ్లు అందుబాటులోకి వస్తాయి.. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్
మంచు విష్ణు ఎక్కువగా సౌత్ ఇండియన్ ఫుడ్, వాటిలో ఎక్కువగా దోశలను ఇష్టపడతాడని పలు ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు చెప్పుకొచ్చాడు. అయితే, కన్నప్ప షూటింగ్ మొత్తం న్యూజిలాండ్ లో జరిగింది. అక్కడ రేట్లు చాలా ఎక్కువగా ఉంటాయని ఓ యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో శివ బాలాజీ చెప్పాడు. ఆయన మాట్లాడుతూ మంచు విష్ణు ఉదయం మూడు గంటలకు లేచే వాడు. సినిమా కోసం చాలా కష్ట పడ్డాడు. అన్ని పనులు దగ్గరుండి ఆయనే చూసుకునే వాడు. న్యూజిలాండ్ ఒక్కో దోశ రూ.1500. అయినా కూడా ఎక్కడ తగ్గకుండా .. అందర్ని మంచిగా చూసుకున్నాడు.
Also Read: Student Commits suicide: హోం వర్క్ చేయలేదని మందలించడంతో.. పురుగుల మందు తాగిన విద్యార్థి
శివ బాలాజీ ఇలా రేట్లు గురించి చెప్పడంతో విష్ణు ఏమైనా చెప్పించి ఉంటాడా? ఎందుకు ఇప్పుడు రేట్స్ గురించి మాట్లాడుతున్నాడని కొందరికి కొత్త సందేహాలు వస్తున్నాయి. ప్రస్తుతం, దీనికి సంబందించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.