Rashmika Mandanna: రష్మిక మందన్న తన కొత్త చిత్రం ‘మైసా’ (Mysaa) నుంచి నేడు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అయితే, ఈ పోస్టర్ చూసిన వారికి ఎన్నో సందేహాలు వస్తున్నాయి. కెరీర్ మంచిగా ఉన్నప్పుడు ఇలాంటి సాహసం ఎందుకు చేసిందని అంటున్నారు. అయితే, ఈ పాన్-ఇండియా సినిమాలో రష్మికా గోండ్ సముదాయానికి చెందిన ఒక శక్తివంతమైన, కీలక పాత్రలో కనిపించనుంది. పోస్టర్‌లో ఆమె సాంప్రదాయ చీరలో, గిరిజన ఆభరణాలతో, ముఖంపై రక్తపు మరకలతో భయానకంగా ఉంది. నేషనల్ క్రష్ యోధురాలిగా కనిపిస్తూ అందరినీ ఆశ్చర్యపరిచింది. రవీంద్ర పుల్లె దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అన్‌ఫార్ములా ఫిల్మ్స్ పతాకం పై తెరకెక్కుతుంది. ఇది డైరెక్టర్ కు తెలుగులో మొదటి దర్శకత్వ చిత్రం.
Also Read: Anasuya Bharadwaj:యాంకర్ అనసూయ ఫోన్ ట్యాపింగ్.. రహస్యాలు మొత్తం బయటకు వస్తాయా?
రష్మికా ఈ పాత్రను తన కెరీర్‌లో ఇప్పటివరకు చూడని కొత్త పాత్ర అని చెప్పుకొచ్చింది. ఈ పోస్టర్‌ను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, “నేను ఇప్పటివరకు చూడని నా కొత్త వెర్షన్” అని చెప్పడం విశేషం. ఈ పోస్టర్‌ను టాలీవుడ్ దర్శకుడు హను రాఘవపూడి తెలుగు వెర్షన్‌లో విడుదల చేశారు.
ఈ సినిమా లేడి ఓరియెంట్ డ్ గా రూపొందుతోంది. రష్మికా పాత్ర ధైర్యవంతమైన యోధురాలిగా ఉంటుందని సినీ వర్గాల నుంచి తెలిసిన సమాచారం. ఇక ఇటీవలే ‘యానిమల్’, ‘పుష్ప 2’, ‘ఛావా’, ‘కుబేరా’ వంటి చిత్రాలతో హిట్స్ తో జోరుమీద ఉన్న రష్మికా, ఈ సినిమాతో మరో బ్లాక్‌బస్టర్ అందుకోవాలని అభిమానులు కోరుకుటున్నారు.
Shivanna sir! 🥺❤️
Thankyou so so much for this 😭❤️❤️
Feel so honoured!❤️ https://t.co/LcMVZMoI3A— Rashmika Mandanna (@iamRashmika) June 27, 2025