Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. మానవత్వం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటివరకూ ఆయన ఎంతో మందికి సాయం చేసి తన మంచి మనుసును చాటుకున్నారు. ఈ కారణం చేతనే ఆయన్ను సినీ నటుడు, రాజకీయ నాయకుడుగానే కాకుండా మంచి మనిషిగాను అభిమానులు ఆరాధిస్తుంటారు. ప్రస్తుతం ఆయన డిప్యూటీ సీఎంగా ఉన్న నేపథ్యంలో అటు పొలిటికల్ గాను తన పవర్ ను ఉపయోగించి.. బాధితులకు అండగా నిలుస్తున్నారు. దీంతో పవన్ ను కలిస్తే తమ కష్టాలు తీరిపోతాయని పలువురు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే రాజమండ్రికి వచ్చిన పవన్ ను కలిసేందుకు రాజస్థానీ కుటుంబం చేసిన ప్రయత్నాలు ఆసక్తికరంగా మారాయి.
అసలేం జరిగిదంటే?
14 ఏళ్ల మైనర్ బాలిక పాయల్ (Payal) మిస్సింగ్ కేసుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఫిర్యాదు చేయడానికి గురువారం ఓ రాజస్థాని కుటుంబం తీవ్రంగా శ్రమించింది. ఈనెల 8వ తేదీన పాయల్ అనే మైనర్ బాలిక ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఇంటి పక్కన ఉండే మణికంఠ అనే యువకుడు పాయల్ ను తీసుకువెళ్లిపోయాడని రాజస్థానీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోయిందని వాపోయారు. దీంతో రాజమండ్రికి వస్తున్న పవన్ ను ఎయిర్ పోర్ట్ లో కలిసి.. తమ బిడ్డ మిస్సింగ్ కు సంబంధించిన విషయాన్ని చెప్పాలని భావించారు.
పవన్ దృష్టిలో పడేందుకు ఫ్లకార్డులు
అయితే గురువారం పవన్ తో పాటు కేంద్రమంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ఉండటంతో ప్రోటోకాల్ భద్రత పేరుతో రాజస్థాన్ కుటుంబాన్ని పోలీసులు అడ్డుకున్నారు. బాధితుల ఫిర్యాదు పత్రాన్ని తీసుకొని కలెక్టర్ కు అందజేస్తామని.. చెప్పి వెనక్కి పంపేశారు. దీంతో రాజమండ్రి పుష్కర్ ఘాట్ వద్ద జరిగిన సభలో.. రాజస్థాన్ కుటుంబ సభ్యులు పవన్ దృష్టిలో పడేందుకు ఫ్లకార్డులు ప్రదర్శించారు. అయితే పవన్, ఆయన అధికారుల దృష్టి వారిపై పడకపోవడంతో వెనుదిరిగి వెళ్లిపోయారు. ఈ క్రమంలోనే కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీని కలిసి తమ గోడును వెళ్లబుచ్చుకుంది రాజస్థానీ కుటుంబం.
Also Read: Star Actress: నా లైఫ్‌లో అతిపెద్ద నమ్మకద్రోహం అదే.. లవరే కాలయముడు అయ్యాడు.. స్టార్ నటి!
పవన్‌తోనే సమస్య పరిష్కారం!
బాలిక మిస్సింగ్ సమస్యను అర్థం చేసుకున్న కాకినాడ రూరల్ ఎమ్మెల్యే.. వెంటనే పోలీసులను సమాచారం అందించారు. మైనర్ బాలిక పాయల్ మిస్సింగ్ కేసుపై దర్యాప్తు జరపాలని ఆదేశించారు. బాలిక ఎక్కడ ఉన్నా కనిపెట్టి వెంటనే వెనక్కి తీసుకొని రావాలని సూచించారు. మరోవైపు ఇవాళ కాకినాడ కలెక్టర్ ను కలిసి ఫిర్యాదు చేయాలని మార్వాడి సంఘాలు నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే తమ సమస్యను పవన్ దృష్టికి తీసుకెళ్లినట్లైతే సత్వరమే పరిష్కారం లభించి ఉండేదని బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. డిప్యూటీ సీఎం పవన్.. ఇప్పటికైనా సమస్యను గుర్తించి ఆడ బిడ్డను తమ వద్దకు చేర్చాలని కోరుకుంటున్నారు.