Swetcha Effect: హనుమకొండ జిల్లా కమలాపూర్‌లోని 800 ఏళ్ల నాటి కాకతీయుల కాలం నాటి పెద్ద చెరువు తూము వద్ద ఏర్పడిన బుంగలను స్థానిక మత్స్యకార్మికులు కాంక్రీట్‌తో పూడ్చి, శిథిలమైన తూమును తాత్కాలికంగా రిపేర్ చేశారు. ఈ చర్యలను కమలాపూర్ (Kamalapur) మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షుడు మౌటం మురళి ఆధ్వర్యంలో చేపట్టారు. ‘స్వేచ్ఛ’ పత్రికలో ‘ప్రమాదంలో పెద్ద చెరువు’ అనే ప్రత్యేక కథనానికి స్పందించిన స్థానికులు, చెరువు కట్టలోని బుంగలను పూడ్చడంతో వరద నీటి నుంచి తూమును కాపాడారు.
Also Read: BJP Telangana: జూబ్లీహిల్స్‌పై బీజేపీ ఫోకస్.. సరైన అభ్యర్థి కోసం మల్లాగుల్లాలు.. ఆశలు నెరవేరేనా?
కమలాపూర్(Kamalapur) పెద్ద చెరువు వేలాది ఎకరాల పంట పొలాలకు సాగునీరు, వందలాది మత్స్యకార్మికులకు ఉపాధి, అనేక గ్రామాలకు తాగునీరు అందిస్తుంది. అయితే, రెండేళ్ల క్రితం మత్తడి కొట్టుకుపోవడం, తూము వద్ద రాతి కట్టడంలో బుంగలు ఏర్పడటం, కట్టను అక్రమంగా తవ్వడంతో చెరువు ప్రమాదకర స్థితిలో ఉంది. ఈ పరిస్థితుల వల్ల నీరు వృథా అవుతుండటంతో రైతులు, (Farmers) స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం..
చెరువు కట్టలో బుంగలు, మత్తడి కొట్టుకుపోవడం, అక్రమ తవ్వకాల గురించి నీటిపారుదల శాఖ అధికారులకు రైతులు, (Farmers) స్థానికులు ఫిర్యాదు చేసినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్థానికులు, మత్స్యకార్మికులు స్వయంగా తూము రిపేర్ చేసినప్పటికీ, శాశ్వత పరిష్కారం కోసం నీటిపారుదల శాఖ తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
రైతుల డిమాండ్..
రైతులు, (Farmers) స్థానికులు నీటిపారుదల శాఖ అధికారులు వెంటనే స్పందించి, మత్తడి పునర్నిర్మాణం, చెరువు కట్ట సమీక్ష చేయాలని కోరుతున్నారు. అక్రమంగా కట్టను తవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని, చెరువు నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచేలా శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Bonalu Festival in Golconda: తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు!