BJP Telangana (Image Source: Twitter)
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

BJP Telangana: జూబ్లీహిల్స్‌పై బీజేపీ ఫోకస్.. సరైన అభ్యర్థి కోసం మల్లాగుల్లాలు.. ఆశలు నెరవేరేనా?

BJP Telangana: రాష్ట్రంలో 8 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్న కాషాయ పార్టీ జూబ్లీహిల్స్‌పై దృష్టి సారించింది. ఈ స్థానం నుంచి గెలుపొంది మరో సీటును తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నది. కానీ, ఇది అయ్యే పనేనా అనే చర్చ జరుగుతున్నది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. దీంతో ఉప ఎన్నికపై అన్ని పార్టీలు దృష్టి సారిస్తున్నాయి. పార్టీల వారీగా ఎవరికి వారు ఆ స్థానాన్ని కైవసం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నాయి. బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానం కావడంతో ఆ సెగ్మెంట్‌ను ఎలాగైనా తిరిగి కైవసం చేసుకోవాలని గులాబీ పార్టీ ప్రయత్నాలు చేస్తున్నది. అలాగే తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఎలాగైనా దాన్ని హస్తగతం చేసుకోవాలని, ఆ స్థానాన్ని వదులుకోవద్దని ప్రణాళికలు రచిస్తున్నది. ఇటు, కాషాయ పార్టీ సైతం ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవద్దనే యోచనలో ఉన్నట్లు సమాచారం.

సరైన అభ్యర్థి కోసం వేట
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పోటీ చేయించేందుకు సరైన అభ్యర్థి కోసం కమలదళం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. ఎవరిని ఎంపిక చేస్తే బాగుంటుందనే అంశంపై తలమునకలైనట్లుగా తెలుస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీసీ ముఖ్యమంత్రి నినాదంతో ఎన్నికలకు వెళ్లిన కాషాయ పార్టీ కేవలం 8 స్థానాలకే పరిమితమైంది. అందుకే ఈసారి ఆచితూచి వ్యవహరించాలని భావిస్తున్నది. ఎందుకంటే అధికారం కోల్పోయి దిక్కుతోచని స్థితిలో బీఆర్ఎస్ ఉంది. అందులోనూ ఆ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో ఈ ఎన్నికల్లో ఓడిపోతే పరిస్థితులు మరింత దిగజారుతాయని, అందుకే గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ పావులు కదుపుతున్నది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో ఓడిపోతే తీరని నష్టాన్ని మూటగట్టుకోవడంతో పాటు భవిష్యత్‌లోని ఎన్నికలపై దీని ప్రభావం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో వారు సైతం జాగ్రత్తగా పావులు కదుపుతున్నట్లు సమాచారం.

ఆశావహుల పోటీ
బీజేపీ నుంచి బరిలో దిగేందుకు పలువురు నేతలు టికెట్ ఆశిస్తున్నారు. అందులో ప్రధానంగా మహిళా నేత జూటూరి కీర్తిరెడ్డి ఉన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ త్యాగం చేశారు. పార్టీలోనే ఉంటూ పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే, గత ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి సైతం రేసులో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. గత ఎన్నికల్లో ఆయన మూడో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది. 54,683 ఓట్లతో గోపీనాథ్ చేతిలో ఓటమి చవిచూశారు. అయితే, ఆయనకు ఇటీవలే పార్టీ హైదరాబాద్ సెంట్రల్ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించింది. వీరితో పాటు ఇంకొందరు నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. అయితే వారు గెలుపును ప్రభావితం చేస్తారా లేదా అనే సందేహాన్ని శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు.

Also Read: BRS Party: ప్రజా క్షేత్రంలో లేని సందడి.. స్థానిక ఎన్నికల వేళ ఎందుకీ దుస్థితి !

29న అమిత్ షా రాక
తెలంగాణకు ఈ నెల 29న కేంద్ర మంత్రి అమిత్ షా రాబోతున్నారు. నిజామాబాద్ పసుపు బోర్డు కార్యాలయ ప్రారంభోత్సవానికి ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అంశం చర్చలోకి వచ్చే అవకాశముందనే చర్చ జరుగుతున్నది. ముఖ్య నేతలతోనూ భేటీ అయ్యే అవకాశాలున్నట్లు సమాచారం. ఈ మీటింగ్‌లో అభ్యర్థి ఎంపికపై సైతం మాట్లాడుకునే అవకాశాలున్నట్లు తెలుస్తున్నది. గ్రేటర్ పరిధిలో బీజేపీకి ఉన్నది ఏకైక ఎమ్మెల్యే రాజాసింగ్. అందుకే సంఖ్యను పెంచుకోవాలని కమలం పార్టీ భావిస్తున్నది. అందుకు అనుగుణంగా గెలుపు గుర్రాన్ని ఎంపిక చేయాలని చూస్తున్నది. అయితే, ఈ నియోజకవర్గంలో మైనార్టీల ఓట్లు కీలకంగా ఉండడంతో బీజేపీ గెలుపు అంత ఈజీ కాదనే చర్చ జరుగుతున్నది.

Also Read This: MHSRB Releases Notifications: స్పీచ్ ఫాథాలజిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల భర్తీ!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?