Cashless Treatment Scheme (imagcredit:twitter)
తెలంగాణ

Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాద బాధితులకు.. ప్రభుత్వం గుడ్ న్యూస్

Cashless Treatment Scheme: రోడ్డు ప్రమాద(Road Acident) బాధితులకు కేంద్రం నగదు రహిత చికిత్స పథకం-2025 ను ప్రారంభించిందని మంత్రి పొన్నం ప్రభాకర్(Min Ponnam Prbhakar) తెలిపారు. రోడ్డు ప్రమాదాలు జరిగి ఎవరు చనిపోకుండా ఉండడానికి ఈ పథకం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. సచివాలయంలోని మంత్రి ఛాంబర్లో రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, ఎన్ఐసీ, విభాగాల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రోడ్డు ప్రమాద బాధితులకు నగదు రహిత చికిత్స పథకం తీసుకొచ్చిన కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ(Union Minister Nitin Gadkari)కి ధన్యవాదాలు తెలిపారు. పథకంపై కింద స్థాయి పోలీస్ అధికారులకు ఇతర విభాగాల అధికారులకు సామాన్య ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.

రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స

రవాణా, పోలీస్, హెల్త్, ఇన్సూరెన్స్, ఎన్ఐసీ విభాగాలు కలిసి జిల్లా, రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు. గతంలో రోడ్డు ప్రమాదాలు జరిగితే పోలీసుల(Police)కు సమాచారం ఇస్తే తమ మీద కేసులు అవుతాయనే భయం ఉండేదనేది అపోహ మాత్రమే అని తెలిపారు. ప్రమాదాలు జరగగానే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. రోడ్డు ప్రమాద బాధితులకు వెంటనే చికిత్స(Treatment) అందించేలా అన్ని సౌకర్యాలతో మరిన్ని ట్రామా సెంటర్లు ఏర్పాటు చేయాలని సూచించారు. అన్ని పోలీస్ స్టేషన్ లలో ఈ పథకం పై అవగాహన కల్పించాలని డీజీపీ జితేందర్‌(DGP Jitender)ను ఆదేశించారు. ఈ పథకం పై సమాచార ప్రసార శాఖ ప్రత్యేక కార్యక్రమాలు చేయాలని ఆదేశించారు. ఈ పథకం విజయవంతం కావడానికి అన్ని విభాగాల అధికారులు ఎవరి విధులు వారు సక్రమంగా నిర్వహించాలన్నారు.

Also Read: TG Govt Schools: గుడ్ న్యూస్.. ప్రభుత్వ స్కూళ్లల్లో భారీగా పెరిగిన విద్యార్థులు.. ఎంతంటే?

ఆయుష్మాన్ భారత్

రోడ్డు ప్రమాదాల బాధితులకు, వారి బీమా స్థితితో సంబంధం లేకుండా, ప్రమాదం జరిగిన మొదటి 7 రోజుల్లోపు, ఒక్కో బాధితుడికి 1.5 లక్షల ఆర్థిక పరిమితి వరకు తక్షణ, నగదు రహిత వైద్య చికిత్స అందించడం ఈ పథకం లక్ష్యం అన్నారు. పథకం వర్తించే వారు రోడ్డు ప్రమాద బాధితుడు ప్రమాదం జరిగిన 24 గంటల్లోపు ఆసుపత్రిలో చేరాల్సి ఉంటుందన్నారు. ఆయుష్మాన్ భారత్(Ayushman Bharat) పీఎం-జేఏవై(PM-JAY) కింద ఎంప్యానెల్డ్ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స అందించబడుతుందన్నారు. ఎన్హెచ్ఏ(NHA) ద్వారా నియమించబడిన ఇతర సౌకర్యాలు కలిగి ఉంటాయని, ప్రమాద బాధితుడి వివరాలు సజావుగా డేటా మార్పిడి కోసం e-DAR (ఎలక్ట్రానిక్ వివరణాత్మక ప్రమాద నివేదిక), టీఎంఎస్ (లావాదేవీ నిర్వహణ వ్యవస్థ) ద్వారా అమలు చేయబడుతుందన్నారు.

హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు 112 హెల్ప్‌లైన్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు అని, బాధితుడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించడానికి 108 అంబులెన్స్ పంపించబడుతుందన్నారు. సమావేశంలో డీజీపీ జితేందర్(DGP Jitender), స్పెషల్ చీఫ్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫర్ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, సాట్ చైర్మన్ శివసేన రెడ్డి, రవాణా శాఖ కమిషనర్ సురేంద్ర మోహన్, జేటీసీ మామిళ్ల చంద్రశేఖర్ గౌడ్, శివలింగయ్య, రమేశ్, యూనిసెఫ్, ఎన్ఐసీ ప్రతినిధులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.

Also Read: CM Revanth Reddy: అసంపూర్తిగా ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలి!

Just In

01

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?