Singer Pravasthi: సింగర్ ప్రవస్తి వివాదం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద దూమారమే రేపింది. అసలు ఎవరూ ఉహించని విధంగా సింగర్ ప్రవస్తి మీడియా ముందుకొచ్చి ” పాడుతా తీయగా ” షో గురించి సంచలన కామెంట్స్ చేసింది. దీనిని మర్చిపోక ముందే మళ్లీ ఇంకో సంచలన వీడియో రిలీజ్ చేసి వార్తల్లో నిలిచింది.
Also Read: Man Vs Leopard: ఆర్ఆర్ఆర్ సీన్ రిపీట్.. తారక్ తరహాలో చిరుతతో సామాన్యుడి ఫైట్.. వీడియో వైరల్!
జడ్జెస్ పై ఫైర్ అయిన సింగర్ ప్రవస్తి?
ఆ షో కి జడ్జెస్ గా వ్యవహరిస్తున్న స్టార్ సింగర్స్ సునీత, మ్యూజిక్ డైరెక్టర్ ఎమ్ ఎమ్ కీరవాణి, లిరిసిస్ట్ చంద్రబోస్ పై షాకింగ్ కామెంట్స్ చేసింది. దీంతో, ఇది హాట్ టాపిక్ గా మారింది. ఆ అమ్మాయి చెప్పిన తర్వాత సింగింగ్ ఇండస్ట్రీలో కూడా వివక్షత ఉందా అని చాలా మందికి సందేహం వచ్చింది. అయితే, తాజాగా ఎలిమినేషన్ ప్రాసెస్ పై కొత్త వీడియో షేర్ చేసింది. దీనిలో నమ్మలేని నిజాలను బయట పెట్టింది. ప్రస్తుతం, దీనికి సంబంధించిన సోషల్ మీడియాలో వీడియోలో తెగ వైరల్ అవుతుంది.
Also Read: Kuberaa: కుబేర సినిమాలో రష్మిక డబ్బు బ్యాగ్ ఎక్కడ ఉంది? శేఖర్ కమ్ముల సమాధానం చెప్పాల్సిందే?
రియాలిటీ షోలో జరిగేది ఇదే!
సింగర్ ప్రవస్తి మాట్లాడుతూ ” నేను నిన్న పెట్టిన పోస్ట్ తో దీని గురించి ఇదే చివరి వీడియో అనుకున్నాను, కానీ ఎలిమినేషన్ ప్రాసెస్ చూసి నేను చాలా షాక్ అయ్యాను. సింగింగ్ ఇండస్ట్రీలోనే ఇలా ఎలిమినేషన్ ప్రాసెస్ వీడియోలు వదులుతారని నేను అస్సలు అనుకోలేదు. అంతే కాదు, ఈ ఛానెల్ వాళ్ళు ఇలా చేస్తారని అనుకోలేదు. అంతా కూడా వారు అనుకున్నదే రిలీజ్ చేశారు. ఇక్కడిది అక్కడ .. అక్కడిది ఇక్కడ అతికించి ఎడిట్ చేస్తారని ముందే అనుకున్నాను. కానీ, మరి ఇంత విలువ లేకుండా రిలీజ్ చేస్తారని అస్సలు అనుకోలేదు. మీరే చాలా మంది రియాలైజ్ అయి మెసెజ్ లు చేస్తున్నారు. అంత ఈజీగా జనాలను ఫూల్స్ చేయోచ్చని ఇక్కడే తెలిసిపోతుందని ” ప్రవస్తి మాటల్లో చెప్పుకొచ్చింది.
Also Read: Tollywood: బ్రేకింగ్.. సినిమాలకు గుడ్ బై చెప్పిన తెలుగు నటుడు.. ఇకపై కనిపించనంటూ సంచలన వీడియో రిలీజ్
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు.