cm revanth reddy
Politics

Revanth Reddy: పంద్రాగస్టులోగా రుణమాఫీ పక్కా!.. మోసగాళ్లను నమ్మొద్దు!

– ఆరడుగుల అరవింద్ అహంకారానికి ప్రతిరూపం
– ప్రాణ ప్రతిష్ఠ జరగకుండా అయోధ్య అక్షింతలు పంచడం ఏంటి?
– ఇది దేవుడిని మోసం చేయడం కాదా?
– బీజేపీ హిందూ ధర్మాన్ని వంచిస్తోంది
– కేసీఆర్.. సవాళ్లు విసరడం కాదు, స్వీకరించే దమ్ము ఉండాలి
– ఆర్మూరు కార్నర్ మీటింగ్‌లో సీఎం రేవంత్ రెడ్డి ఫైర్

CM Revanth: బీజేపీ, బీఆర్ఎస్‌ను నమ్మి మోసపోవద్దని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆర్మూరులో పర్యటించిన ఆయన, కార్నర్ మీటింగ్‌లో మాట్లాడారు. తాను పీసీసీ అధ్యక్షుడిని అయ్యానంటే ఆర్మూరు రైతుల కష్టం ఉందన్నారు. ఈ స్థాయికి రావడానికి వారి తోడ్పాటు ఉందని చెప్పారు. వంద రోజుల్లో చక్కెర కర్మాగారం తెరుస్తానని కవిత మోసం చేశారని, పదేళ్లయినా ఫ్యాక్టరీని తెరవలేదని విమర్శించారు. అందుకే, 2019లో రైతులు కవితకు బుద్ధి చెప్పారని అన్నారు.

పసుపు బోర్డు అంటూ బాండ్ పేపర్ రాసి అరవింద్ మోసం చేశారని, నమ్మి ఓట్లేసి గెలిపిస్తే బోర్డు రాలేదని విమర్శించారు. అందుకే, ఈసారి ఆయన్ను ఓడించి జీవన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఆర్మూరుకు ఏం చేశారని నిలదీశారు. 150 రోజులైంది కేంద్రం నుంచి ఏం నిధులు తెచ్చారని అడిగారు. రైతులకు మోదీ చేత క్షమాపణలు చెప్పించిన ధైర్యం హర్యానా, పంజాబ్ రైతులదన్న సీఎం, వారిలాగే ఆర్మూరు రైతులు అదే పౌరషంతో కొట్లాడాలని చెప్పారు.

‘‘మీ సమస్యలు పరిష్కరం కావాలన్నా, చక్కెర కర్మాగారం తెరుచుకోవాలన్నా, పసుపు బోర్డు రావాలన్నా జీవన్ రెడ్డి ఎంపీగా గెలవాలి. రాష్ట్రంలో పండే పంటలకు మద్దతు ధరతోపాటు, బోనస్ 500 ఇచ్చే బాధ్యత మాది. రైతు బంధు రావడం లేదని కేసీఆర్ అన్నారు. మే 9 లోపల రైతు బంధు ఇస్తానని సవాల్ చేశా. చెప్పినట్టుగానే అంతకంటే ముందే 6వ తేదీ లోపలే 69 లక్షల మంది రైతులకు రైతు బంధు ఇచ్చాం. కేసీఆర్‌కు సవాళ్లు విసరడం కాదు స్వీకరించే దమ్ము ఉండాలి. కేసీఆర్ అమరవీరుల స్థూపం దగ్గరకు రావాలి, ముక్కు నేలకు రాయాలి. ఆగస్టు 15లోపు రైతు రుణమాఫీ కూడా చేసి తీరుతాం’’ అని స్పష్టం చేశారు సీఎం రేవంత్.

Also Read: అధైర్యపడొద్దు!.. అన్నదాతకు అండగా మేమున్నాం!

2014లో బీఆర్ఎస్‌ను గెలిపించారు, 2019లో బీజేపీని గెలిపించారు, రెండు పార్టీలు నిండా ముంచాయి, ఒక్క అవకాశం జీవన్ రెడ్డికి ఇవ్వాలని కోరారు. ఆరడుగుల అరవింద్ అహంకారానికి ప్రతిరూపమని విమర్శించారు. ‘‘అయోధ్య రామాలయం పూర్తి కాకముందే అక్షింతలు పంచడం ఏంటి? ఇది హిందూ సాంప్రదాయమా? ఇది దేవుడిని మోసం చేయడం కాదా? దేవుడి పేరుతో రాజకీయం చేయడం కాదా? దేవుడు గుడిలో ఉండాలి భక్తి గుండెల్లో ఉండాలి. అది పాటించేవాడే అసలైన హిందూవు. బజార్లోకి వచ్చి దేవుడి పేరుతో ఓట్లు అడిగే వాడు బిచ్చగాడు అవుతాడు. హిందూ ధర్మాన్ని బీజేపీ వంచిస్తోంది’’ అంటూ మండిపడ్డారు సీఎం.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ