TG Badi Bata Program: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన బడిబాట కార్యక్రమం సత్ఫలితాలు ఇవ్వడంతో తెలంగాణలో మూతబడిన (Schools) పాఠశాలలు తిరిగి తెరుచుకుంటున్నాయి. ఇప్పటివరకు 138 పాఠశాలలు తిరిగి ప్రారంభం కాగా, వాటిలో 1224 మంది విద్యార్థులు చేరారు. (Ranga Reddy District) రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 26 పాఠశాలలు తిరిగి తెరుచుకోగా, (Nagarkurnool District) నాగర్ కర్నూల్ జిల్లాలో 23 పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. రాష్ట్రంలో బడుల్లో అడ్మిషన్ల పెంపు కోసం ప్రభుత్వం ఈనెల 6 నుంచి 19 వరకూ ప్రొఫెసర్ జయశంకర్ (Professor Jayashankar) బడిబాట కార్యక్రమాన్ని చేపట్టింది.
దీనిలో మూతబడిన స్కూళ్లను (Schools) తెరిపించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ చేపట్టింది. గతేడాది 1960 స్కూళ్లలో ఒక్కరూ చేరలేదు. ప్రస్తుతం వీటిలో 23 జిల్లాల్లో 138 బడులు తెరుచుకున్నాయి. వీటిలో 1224 మంది పిల్లలు అడ్మిషన్లు తీసుకున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఉచితంగా అందించే నోట్ పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ తదితర వాటన్నింటినీ అందించారు. అయితే, జీరో ఎన్ రోల్మెంట్ స్కూళ్లు రీపెన్‌పై పలు జిల్లాల కలెక్టర్లు, డీఈవోలు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రంగారెడ్డి జిల్లాలో 26 స్కూల్స్ ఉన్నాయి. వీటిలో 210 మంది చేరారు. నాగర్ కర్నూల్‌లో 23 స్కూల్స్‌లో (Schools) 129 మంది, ఖమ్మంలో 15 స్కూల్స్‌లో (Schools) 196 మంది చేరారు.
Also Read: Formula E Race Case: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ స్పీడ్!
విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలి.. ముఖ్యమంత్రి కీలక ఆదేశాలు
తెలంగాణలో విద్యా వ్యవస్థను మరింత పటిష్టం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) అధికారులను ఆదేశించారు. అదనపు కలెక్టర్లు వారంలో కనీసం రెండు ప్రభుత్వ పాఠశాలలను సందర్శించాలని స్పష్టం చేశారు. విద్యా శాఖపై ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ)లో అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది ప్రైవేట్ పాఠశాలల నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో (Schools) 48 వేల మంది చేరారని అధికారులు సీఎంకు వివరించారు.
నూతన గదుల నిర్మాణం
పెరిగిన విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా నూతన గదులు నిర్మించాలని అధకారులను సీఎం ఆదేశించారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలకు అవసరమైన వసతులను పాఠశాలల్లో కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. మధ్యాహ్న భోజనం తయారీకి సంబంధించి గ్యాస్, కట్టెల పొయ్యిల బాధల నుంచి మహిళలకు విముక్తి కల్పించాలని, సోలార్ కిచెన్ల ఏర్పాటుపై తక్షణమే దృష్టి సారించాలని రేవంత్ రెడ్డి (Revanth Reddy) తెలియజేశారు.
టెన్త్ విద్యార్థులపై ఫోకస్
పదో తరగతిలో ఉత్తీర్ణులవుతున్న విద్యార్థుల సంఖ్యకు, ఇంటర్మీడియట్‌లో నమోదవుతున్న విద్యార్థుల సంఖ్యకు మధ్య వ్యత్యాసం ఎక్కువ ఉండడంపై అధికారులను రేవంత్ (Revanth Reddy) ప్రశ్నించారు. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులంతా కచ్చితంగా ఇంటర్మీడియట్‌లో చేరేలా చూడాలని సూచించారు. ఇంటర్మీడియట్ అనంతరం జీవనోపాధికి అవసరమైన స్కిల్డ్ కోర్సుల్లో శిక్షణ పొందవచ్చని, తద్వారా వారి జీవితానికి ఢోకా ఉండదని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ((Vem Narender Reddy) సీఎం ప్రత్యేక కార్యదర్శి బీ అజిత్ రెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ ఏ శ్రీదేవసేన, విద్యాశాఖ ప్రత్యేక కార్యదర్శి ఎం హరిత తదితరులు పాల్గొన్నారు.
Also Read: Minister Uttam Kumar Reddy: 30న ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్!