Minister Uttam Kumar Reddy( IMAGE CREDIT: TWITTER)
తెలంగాణ

Minister Uttam Kumar Reddy: 30న ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్!

Minister Uttam Kumar Reddy:  ఏపీ ప్రతిపాదించిన గోదావరి- బనకచర్లను చట్టపరంగా అడ్డుకుంటామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) స్పష్టం చేశారు. తెలంగాణ రైతాంగ ప్రయోజనాలకు భంగం వాటిళ్ల కుండా చూడడమే తమ ముందున్న కర్తవ్యమని తేల్చిచెప్పారు.  (Hyderabad) హైదరాబాద్‌లోని ఎర్రమంజిల్‌లో గల జలసౌధాలో నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్షించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ, (Banakacharla Project) బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ ప్రాంత ప్రయోజనాలు ఏ విధంగా దెబ్బ తింటాయో, నష్టం ఎలా వాటిల్లుతుందోనన్న అంశంలో బలమైన వాదనలు వినిపించి ప్రాజెక్టు నిర్మాణాన్ని ఆపుతామన్నారు.

గోదావరి -బనకచర్ల ప్రాజెక్ట్‌తో , (Banakacharla Project) తెలంగాణకు జరుగుతున్న ముప్పును (CM Revanth Reddy)  సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఈ నెల 19న కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్‌పాటిల్‌కు సవివరంగా పవర్‌ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఇచ్చామన్నారు. బనకచర్ల ప్రాజెక్టుకు (Banakacharla Project) సంబంధించిన ప్రీఫిజిబిలిటీని నివేదికను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించ వద్దని తేల్చి చెప్పామన్నారు. ఈ ప్రాజెక్టును నిర్మిస్తే తెలంగాణ రాష్ట్ర నీటి కేటాయింపులపై ప్రభావం చూపుతుందని దానిని దృష్టిలో పెట్టుకుని నివేదికను తిరస్కరించాలని కోరామన్నారు. కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ స్పందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించిన నివేదికను ఆమోదించ లేదని, త్వరలోనే అపెక్స్ కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారని మంత్రి వివరించారు.

 Also Read: Kavitha Slams Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డిపై.. ఎమ్మెల్సీ కవిత ఆగ్రహం!

ప్రజా భవన్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో పుట్టుకొచ్చిన గోదావరి- బనకచర్ల ప్రాజెక్టు (Banakacharla Project) నిర్మిస్తే తెలంగాణ ప్రయోజనాలకు జరిగే నష్టంపై ఈ నెల 30న ప్రజా భవన్‌లో మధ్యాహ్నం 3 గంటలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను ఏర్పాటు చేశామన్నారు. టన్నెల్ నిర్మాణాలలో అనుభవం కలిగిన సైనికాధికారులను నీటిపారుదల శాఖలోకి తీసుకునేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. ఇటీవల రోహ్తంగ్, జోజిలా టన్నెల్ నిర్మాణంలో పనిచేసిన ఇద్దరు అధికారులను వినియోగించుకునేందుకు నీటిపారుదల శాఖ కసరత్తు చేస్తుందన్నారు.

భారత సైన్యంలో ఇంజినీర్ ఇన్-చీఫ్‌గా పనిచేసిన జనరల్ హార్బల్ సింగ్‌ను రాష్ట్ర నీటిపారుదల శాఖకు సలహా దారుడిగా ఉండాలని ఆహ్వానించామన్నారు. అంతర్జాతీయ స్థాయిలో పేరున్న టన్నెల్ టెక్నాలజీ నిపుణుడు కర్నల్ పరిక్షిత్ మోహ్రా ఈ జులైలో రాష్ట్ర నీటిపారుదల శాఖలో చేరనున్నారని తెలిపారు.

ఎన్డీఎస్ఏ ఆదేశాలు అమలులోకి తీసుకురావాలి
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై ఎన్డీఎస్ఏ ఇచ్చిన నివేదికలపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సమీక్షించారు. పునరుద్ధరణ పనులకై ఎన్డీఎస్ఏ డిజైన్ కన్సల్టెంట్‌గా వ్యహారిస్తుందన్నారు. ఎన్డీఎస్ఏ ఇచ్చిన ఆదేశాలను సత్వరమే అమలులోకి తీసుకు రావాలని అధికారులను ఆదేశించారు. పునరుద్ధరణ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు వీలుగా ప్రతివారం సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తనకు నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.

కేంద్ర జలసంఘం సూచనలకు అనుగుణంగా పనులను వేగవంతం చేయాలన్నారు. డిండి ప్రాజెక్ట్ భూసేకరణపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సమావేశం నిర్వహించాలన్నారు. శ్రీశైలం ఎడమ కాలువ (ఎస్‌ఎల్‌బీ‌సీ) పనుల పురోగతిపై సమీక్షించిన ఆయన పునరుద్ధరణ పనుల కోసం అంతర్జాతీయ స్థాయి ఏజెన్సీలతో చర్చించి ప్రతిపాదనలు స్వీకరిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పునరుద్దరణ పనులు చేపట్టే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చామని, పనులను వేగవంతంగా పూర్తి చేసేందుకు ఖర్చుకు వెనకాడకుండా ముందుకు పోవాలని అధికారులను ఆదేశించారు.

నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పూడికతీతపై సమీక్ష
నీటిపారుదల శాఖలో పెండింగ్ లో ఉన్న పదోన్నతుల ప్రక్రియను వేగవంతం చేయాలని, బదిలీలు వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. అనేక జలాశయాలు పూడికతో పూడి పోయి ఉన్నందున 20 నుంచి 25 శాతం మేర నీటి సామర్ధ్యం తగ్గిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగా మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేశామన్నారు. నాగార్జునసాగర్, నిజాంసాగర్ తదితర ప్రాజెక్టుల పూడిక తీత పనులపై సమీక్షించారు.

ప్రత్యేకంగా సాగర్ పూడిక తీత పనులను సత్వరం ప్రారంభించాలన్నారు. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించాలని అధికారులను సూచించారు. దేవాదుల ప్రాజెక్టు మూడో దశ పనుల పురోగతితో పాటు సీతారామ ప్రాజెక్టుకు ప్రస్తుతం కేటాయించిన నిధుల పరిమితులకు లోబడి అదనపు ప్యాకేజీలను రూపొందించే అంశాలపై అధికారులు దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.

 Also Read: Jurala Project: జూరాలకు పోటెత్తిన వరద.. 13 గేట్లు ఎత్తివేత!

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు